UPSC Civil Services 2021 Final Result - Sakshi
Sakshi News home page

2021 UPSC Result: సివిల్స్‌ సర్వీసెస్‌ ఫలితాల విడుదల.. మెరిసిన తెలుగు తేజాలు వీళ్లే!

Published Mon, May 30 2022 1:38 PM | Last Updated on Mon, May 30 2022 6:45 PM

UPSC Civil Services 2021 Final Result Out - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ బోర్డు. సివిల్స్‌ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. నలుగురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. 

2021 సివిల్స్‌ పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది శృతి శర్మ. రెండో ర్యాంకర్‌గా అంకితా అగర్వాల్‌, మూడో ర్యాంకర్‌ గామిని సింగ్లా నిలిచారు. 

తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్‌ రెడ్డికి 15వ ర్యాంక్‌ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్‌, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్‌, రవికుమార్‌కు 38వ ర్యాంక్‌, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్‌ దక్కింది. 

పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్‌, గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్‌, శైలజ 83వ ర్యాంక్‌, శివానందం 87వ ర్యాంక్‌, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్‌, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్‌, గడిగె వినయ్‌కుమార్‌ 151 ర్యాంక్‌, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్‌, కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్‌, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్‌, దొంతుల జీనత్‌ చంద్రకు 201వ ర్యాంక్‌, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్‌ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్‌ దక్కాయి.

పూర్తి ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement