సాక్షి, తాడేపల్లి: సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్‌రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్‌లను సీఎం జగన్ అభినందించారు.
చదవండి: జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’
సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్‌కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్‌కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment