
సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది UPSC
ఢిల్లీ: సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది UPSC. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది.
అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది.
జనరల్ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, OBC కేటగిరీ కింద 263 మందిని, SC కేటగిరీ కింద 154 మందిని, ST వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది. ఫలితాల్లో ఇషితా కిషోర్ టాపర్‌గా నిలవగా.. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్ మూడో స్థానం దక్కించుకున్నారు.
ఇషితా కిషోర్
సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల విజయభేరి
IAS/IPS వంటి అత్యున్నత సర్వీసులలో అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపించినట్లు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తోట శరత్ చంద్ర తెలిపారు. తమ అకాడమీలో శిక్షణ తీసుకున్నటువంటి దాదాపు 45 మంది అభ్యర్థులు ఈ ఏడాది ర్యాంకులు సాధించారని ఇందులో చాలామందికి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వంటి మెరుగైన సర్వీసులు వస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు కూడా అత్యున్నత సర్వీసులకు ఎంపికవడం పట్ల శరత్ చంద్ర ఆనందం వ్యక్తం చేశారు.
ర్యాంకర్ల వివరాలు :
పవన్ దత్త All India Rank 22
హెచ్ఎస్ భావన -55
అరుణవ్ మిశ్రా-56
సాయి ప్రణవ్-60
నిధి పాయ్- 110
రుహాని- 159
మహేశ్‌కుమార్- 200
రావుల జయసింహారెడ్ది- 217
అంకుర్ కుమార్-257
బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి-270
చల్లా కల్యాణి- 285
పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి- 292
గ్రంధె సాయికృష్ణ-293
హర్షిత-315
వీరంగంధం లక్ష్మీ సుజిత-311
ఎన్.చేతనారెడ్డి-346
శృతి యారగట్టి- 362
సోనియా కటారియా -376
యప్పలపల్లి సుష్మిత-384
రేవయ్య-410
సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426
బొల్లిపల్లి వినూత్న- 462
కమల్ చౌదరి -656
రెడ్డి భార్గవ్-772
నాగుల కృపాకర్ 866
గత ఏడాది కంటే..
గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఖాళీల సంఖ్య పెరిగింది. 1011 ఖాళీలకు యూపీఎస్సీ.. సివిల్స్ పరీక్ష నిర్వహించింది. జనవరి 30వ తేదీ నుంచి మే 18 వరకు ఇంటర్వ్యూలు జరగగా, మూడు ఫేజ్‌ల వారీగా 2529 అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. సివిల్స్-2022లో 11లక్షల పై చిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.