
సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ కావాలంటే ఎంతో కృషి, పట్టుదల అవసరం. అది దేశంలోనే ఎంతో కష్టతరమైన పరీక్ష. అయితే ఇటీవల యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాలలో 420 వ ర్యాంకు సాధించిన ఒక వ్యక్తి మాత్రం ప్రస్తుతం విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. దానికి కారణం అతని పేరు. అంతలా ట్రోల్ అయ్యేపేరు ఏముంది అని అనుకుంటున్నారా? ఆ ర్యాంకర్ పేరు రాహుల్ మోదీ. ఒకరు కాంగ్రెస్ నాయకుడు కాగా మరొకరు ప్రధాని. రెండు విభిన్న, వ్యతిరేక పార్టీల నాయకుల పేరు కలిసేలా అతని పేరు ఉండటమే. ఇప్పుడు ట్రోలింగ్‌కు కారణమవుతోంది.
శతాబ్ధాల కలయిక #RahulModi పేరుతో ఇప్పుడు ఒక మీమ్ ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి కొంత మంది రాహుల్, మోదీ ఇద్దరు యూపీఎస్సీ పరీక్షను పాసయ్యారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మరి కొందరు మీరు బీజేపీ మద్దతుదారా? కాంగ్రెస్ మద్దతుదారా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పేరు కారణంగా అతని కృషిని, కష్టాన్ని గుర్తించకుండా ఇలా చేయకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి రాహుల్ మోదీ పేరు కారణంగా ఒక ఆఫీసర్ ఉద్యోగాన్ని చేపట్టే వ్యక్తి ట్రోల్స్‌కు గురవుతున్నాడు. యూపీఎస్సీ టాపర్ గురించి కూడా ఇలా మాట్లాడుకోలేదని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక 2019 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారందరికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment