సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు.‘సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వంతో తెలంగాణ అభివృద్ధి సూచికల్లో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. పరిశ్రమలకు కేంద్రంగా ఉద్భవించింది. ఇది నిరంతరం అభివృద్ధి చెందాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను’అని ట్వీట్ చేశారు.
తెలుగులోనే రాష్ట్రావతరణ శుభాకాంక్షలు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా /ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వరకు అందరూ తెలుగులోనే శుభాకాంక్షలు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రతీ రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్తూ చేసిన ట్వీట్లకు ఆయా పార్టీ కార్యకర్తలు భారీగా ప్రతిస్పందించారు.
‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పనిచేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడటంలో పేరుపొందిన వా రు తెలంగాణ ప్రజలు. ప్రపంచ ప్రఖ్యా తి పొందినది తెలంగాణ సంస్కృతి. తెలంగా ణ ప్రజల శ్రేయస్సుకై నేను ప్రారి్థస్తున్నాను.’
–నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2022
‘గత ఎనిమిదేళ్లలో తెలంగాణ దారుణమైన టీఆర్‌ఎస్ పాలనను చూసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన రైతులు, కార్మికులు,పేదలు, సామాన్య ప్రజలకు శ్రేయస్సును అందించడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా నిర్మించాలనే కాంగ్రెస్ నిబద్ధతను మరోమారు పునరుద్ఘాటిస్తున్నాను. మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుంచి తెలంగాణ పుట్టింది. ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్, సోనియాగాంధీ నిస్వార్ధంగా పనిచేయడం పట్ల గర్వంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, ఈ చరిత్రాత్మకమైన రోజున అమరవీరులు, వారి కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరించుకుందాం’ –రాహుల్ గాందీ, కాంగ్రెస్ నేత
తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2022
ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.
‘సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటా న్ని గుర్తిస్తూ వారి చిరకాల స్వప్నం నిజం చేసిన రోజు ఇది. అమరవీరులను తలచుకుంటూ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. జై తెలంగాణ! జై కాంగ్రెస్!’ –ప్రియాంకా గాందీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ
‘తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
అమర వీరులకు జోహార్ జోహార్... జై
తెలంగాణ జై జై
తెలం గాణ.’
–అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
ఇది కూడా చదవండి: దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment