narayanpet
-
నేడు వికారాబాద్, నారాయణపేటలో సీఎం రేవంత్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి(Revanth Reddy) శుక్రవారం వికారాబాద్, నారాయణ పేట జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మధ్నాహ్నం 12 గంటలకు సీఎం వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు. పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరలో భాగంగా ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పక్‌పల్లి చేరుకుంటారు. అక్కడ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అప్పక్‌పల్లిలో మొదటి విడతగా గతనెల 26న మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నారాయణపేట మెడికల్ కాలేజీలో అకడమిక్ బ్లాక్‌తో పాటు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. -
ఊరంతా బంధువులే
నేటి ఆధునికయుగంలో బంధాలు.. అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అయితే ఆ గ్రామమంతా కలిసికట్టుగా ఉంటోంది. అన్నింట్లో పాలుపంచుకుంటున్న ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. దాదాపు 500 ఏళ్ల క్రితం వలస వచ్చిన ఓ కుటుంబం... ఇప్పుడు 228 ఇళ్లుగా మారి ఓ పంచాయతీగానే రూపాంతరం చెందింది. అదే నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ‘పల్లెగడ్డ’గ్రామం.మరికల్: ఒకే కులం.. ఒకే మాటతో గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా అన్న.. తమ్మి, మామ, అల్లుడు అని పలకరిస్తూ కలిసికట్టుగా పరిష్కరించుకుంటారు పల్లెగడ్డ వాసులు. ఒక ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అందరూ అక్కడే ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరైనా చనిపోతే ఊరంతా ఉపవాసం ఉండి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 500 ఏళ్ల క్రితం మరికల్ గ్రామంలో ముదిరాజ్ కులంలోని కట్టెకొండ గోత్రానికి చెందినవారు ఉండేవారు. వీరి వ్యవసాయ భూములు మరికల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన ప్రాంతంలో ఉండేవి.దీంతో కట్టెకొండ గోత్రానికి చెందిన ఓ వ్యక్తి మరికల్ నుంచి అక్కడకు వెళ్లి ఓ గుడిసె వేసి నివాసం ఏర్పరుచు కున్నాడు. కాలక్రమంలో ఈ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు పుట్టి మూడు తరాలుగా విడిపోయి ఇళ్లు నిర్మించుకోవడంతో ఒక చిన్న పల్లెగా అవతరించింది. ఆనాడు మరికల్ పరిధిలోనే ఈ గ్రామం ఉండటంతో పల్లెగడ్డగా పేరుగాంచింది. ఒక ఇంటిలో మూడు తరాలుగా విడిపోయిన అన్నదమ్ములే వారసత్వంగా కుటుంబాలు పెరిగి.. నేడు ఇక్కడ 228 ఇళ్లు నిర్మించుకున్నారు. గ్రామంలో ప్రస్తుతం 1,260 జనాభా ఉండటంతో మరికల్ నుంచి విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 349 మంది స్త్రీలు, 357 మొత్తం కలిపి 706 మంది ఓటర్లు ఉన్నారు.75 శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కుంటున్నారు. గ్రామ శివారులో 1,245 ఎకరాల వరకు భూమి ఉంది. ఇక్కడ 90 శాతం మంది వ్యవసా యంపై ఆధారపడి జీవనం సాగిస్తుండగా, 10 శాతం మంది మాత్రమే ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఆపద వస్తే సాయంగ్రామమంతా ఒకే కులంవారు ఉండటంతో అందరూ ఐక మత్యంతో ఉంటున్నారు. గ్రామంలో పెళ్లిళ్లు చేయడానికి దేవాలయం లేకపోవడంతో గ్రామస్తులు కలిసి చందాలు వేసుకొని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలను నిర్మించుకున్నారు. ఎవరికైనా ఆపద వస్తే సాయం చేస్తారు. ఆనందంగా ఉంది.. మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇప్పటికే ఏడు తరాలు దాటినట్టు తెలిసింది. ఒకే కులం పేరుతో ఇక్కడ నివసించడం ఆనందంగా ఉంది. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా, అందరూ కలిసి వారి బాధను పంచుకుంటాం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. – హన్మంతు శ్రీవారి సేవకులం15 ఏళ్ల నుంచి టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి దేవ స్థానంలో నిర్వహించే కార్య క్రమాలకు గ్రామం నుంచి మూడు టీంలుగా వెళతాం. అక్కడే వారం రోజులు ఉండి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు చేస్తాం. అన్నదానం, లడ్డూ్డ తయారీ, అఖండ భజన కార్యక్రమాలు నిర్వహించడంతో మా గ్రామానికి ప్రత్యేక గౌరవం దక్కింది. –శ్రీరామ్ -
మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
-
రష్యా ఆర్మీ చెర నుంచి విముక్తి
-
సాగుబడి: 15 నిమిషాల్లోనే.. ఎడ్ల బండితో పిచికారీ!
కూలీల సమస్యను అధిగమించడంతోపాటు పెట్టుబడి తగ్గించుకునే ఆలోచనతో ఓ యువరైతు వినూత్న స్ప్రేయర్‌ను రూపొందించారు. ఎడ్లబండిపై పెట్టుకొని ఉపయోగించుకునేందుకు ఈ స్ప్రేయర్ అనువైనది కావటం విశేషం. అందరి మన్ననలు అందుకుంటున్న మక్దుం అలీపై ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామానికి చెందిన మక్దుం అలీ(38)కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే చదువు ఆపేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. సాగునీటి ఇబ్బందులున్నప్పటికీ.. రెండెకరాల్లో కంది, ఆముదాలు, పత్తితోపాటు మరో ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరగడం, రాబడి తగ్గుతుండడంతో ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటారు. పురుగు మందులతోపాటు కూలీల ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఆవిష్కరణ వెలుగుచూసింది. ఎడ్ల బండిపై 5 హెచ్‌పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైఫర్ మోటర్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్లతో సుమారు రూ.45 వేల వ్యయంతో అలీ దీన్ని రూపొందించారు. ఎడ్ల బండిపై కూర్చున్న రైతు బండిని తోలుకెళ్తూ ఉంటే.. బండి వెనుక వైపు బిగించిన రెండు స్ప్రేగన్లు ఏకకాలంలో పిచికారీ చేస్తాయి. అటు 20 అడుగులు, ఇటు 20 అడుగుల (దాదాపు ఆరు సాళ్ల) వరకు పురుగుల మందును ఈ యంత్రం పిచికారీ చేస్తుంది. మనిషి అవసరం లేకుండానే రెండు స్ప్రేగన్లు, రెండు డ్రమ్ముల ద్వారా 15 నిమిషాల్లోనే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తాయి. ఎడ్లబండిపై కూర్చునే వ్యక్తికి, ఎద్దులకు మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో వెనుక వైపున పురుగుమందు పిచికారీ అవుతున్నందున ఇబ్బంది ఉండదు. అలీని కలెక్టర్ ప్రశంసించడమే కాకుండా ‘ఇంటింటా ఇన్నోవేషన్’కు ఎంపిక చేశారు. టీహబ్ అధికారులూ ప్రశంసించారు. – పెరుమాండ్ల కిషోర్ కుమార్, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, ఫొటోలు: సుదర్శన్‌గౌడ్, నర్వ స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ.. రసాయనిక వ్యవసాయంలో తెగుళ్ల బెడద ఎక్కువ. పంటలపై వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్క రోజులోనే పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించొచ్చు. నేను రూపొందించిన స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ చేయొచ్చు. దీంతోపాటు నిర్దేశించిన మేరకు ఖచ్చితత్వంతో ఎరువులు వేసేలా రూ.500 ఖర్చుతో పరికరాన్ని రూపొందించాను. కూలీలు అవసరం లేకుండా రైతు ఒక్కరే ఎరువులు వేసుకోవచ్చు. శాస్త్రవేత్త కావాలన్నది నా సంకల్పం. అయితే ఆర్థిక స్థోమత లేమి కారణంగా చదువు మధ్యలోనే ఆగింది. నాకున్న ఆలోచనతో స్ప్రేగన్ తయారు చేసిన. ప్రభుత్వ ప్రోత్సహించాలని కోరుతున్నా. – మక్దుం అలీ (97038 20608), యువ రైతు, కల్వాల్, నర్వ ► గుంటూరులో చిరుధాన్య వంటకాలపై శిక్షణ.. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10–5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666 / 95538 25532కు ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు తెలిపారు. ఇవి చదవండి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు! -
‘పేట’కు టెక్స్టైల్ పార్కు! : అమిత్ షా
సాక్షి, మహబూబ్‌నగర్/నారాయణపేట: ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు పెంచి.. జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు నారాయణపేట జిల్లాకేంద్రంలో చేనేత కార్మికుల కోసం టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువస్తే బీసీ సీఎం అవుతారని.. రాబోయే రోజుల్లో కేంద్రంలో నరేంద్రమోదీని మరోసారి పీఎం చేద్దామంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వారి జీవన పరిిస్థితులపై నరేంద్రమోదీ అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. మక్తల్‌లో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాలకు నోచుకోలేదని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నాయకులు మక్తల్‌లో భూ కబ్జాలు, దాందాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే భీమా ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఊట్కూర్ చెరువుతోపాటు జాయమ్మ చెరువుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు నెరవేరాలంటే జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మక్తల్‌లో మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, నారాయణపేటలో రతంగ్ పాండురెడ్డి, కొడంగల్‌లో బంటు రమేష్‌లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీతోనే సంక్షేమ పాలన! బీజేపీతోనే ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, మక్తల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా.. ఓడినా.. పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కోలార్ ఎంపీ మునిస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్ చైర్మన్ అఖిలారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బాల్‌రాంరెడ్డి, తిమ్మప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్, కనకరాజు, మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మలికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ కర్నిస్వామి, ఉపాధ్యక్షుడు సోంశేఖర్‌గౌడ్, నాగప్ప, కౌన్సిలర్లు కౌసల్య, సత్యనారాయణ, అర్చన, కొండయ్య, నాయకులు లక్ష్మణ్, ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు! -
పురుగుమందుల స్ప్రే కోసం ఓ యువరైతు వినూత్న ఆవిష్కరణ
-
బోరు నీరు తాగి.. బాలిక మృతి
మద్దూరు: బోరు మోటారు ద్వారా వచ్చే నీరు తాగి ఓ బాలిక మృతిచెందగా...మరో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని మోమినాపూర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో బోయిన, జీడివీధిలో ఉన్న బోరు మోటారు నీటిని స్థానికులు తాగుతున్నారు. ఈ క్రమంలో సోమవారం బోరు మోటారు ద్వారా వచ్చే నీటిని తాగిన బొయిన అనిత(16)కు సాయంత్రం విరేచనాలు కావడంతో ఆశ కార్యకర్త దగ్గరకు వెళ్లగా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చింది. రాత్రికి వాంతులు, విరేచనాలు తీవ్రమై అస్వస్థతకు గురవడంతో తండ్రి బోయిని కనకప్ప వెంటనే ద్విచక్రవాహనంపై నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఆ తర్వాత ఇదే వీధికి చెందిన వార్ల చంద్రప్ప, బండగొండ కనకప్ప, మంగమ్మ అస్వస్థతకు గురవడంతో మద్దూరు సీఎస్సీ సెంటర్‌కు, బసపోళ్ల శ్రీనివాస్, బసపోళ్ల రాములు, బోయిని కవితలు కూడా అస్వస్థతకు గురికాగా వారిని మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి, బసపోళ్ల హన్మమ్మ, అజయ్‌లను నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి, డీఎంహెచ్ఓ రాంమోహన్‌రావు గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. -
KTR: మోదీ ఓ అసమర్థ ప్రధాని.. కార్పొరేట్ల కోసమే పాలన
సాక్షి, నారాయణపేట: మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.12లక్షల కోట్లను మాఫీ చేసిందని.. ఇది నిజం కాకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం అంటారు.. అది నిజం కాదు. కేవలం అదానీ, అంబానీ కోసమే మోదీ పాలన కొనసాగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదలకు రావాల్సిన పైసలన్నీ మోదీ దోస్తులు అదానీ, అంబానీలకు చేరుతున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు రూ.12లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం చిత్తశుద్ధితో ఆలోచిస్తే దేశంలో రైతాంగానికి రూ.14.50 లక్షల కోట్లతో ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చన్నారు. మంగళవారం నారాయణపేటలో మంత్రులు మహముద్ అలీ, నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి రూ.196కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం సభలో కేటీఆర్ మాట్లాడుతూ దేశాన్ని ఏలిన 14 మంది ప్రధానమంత్రుల పాలనలో రూ.56 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశం రూ.వంద లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు మోపుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్ర బీజేపీ నేతలు జాతీయ హోదాను ఇప్పించాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నా.. కృష్ణాజలాలపై ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయితీ తెంపని అసమర్థత ప్రభుత్వం కేంద్రానిదేనని నిందించారు. ’’మహబూబ్‌నగర్‌లో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందంట కదా... తెలంగాణకు 500 టీఎంసీల నీటిని ఇవ్వాలనీ, ఈ ఏడాది కేంద్రబడ్జెట్లోనే నిధులు కేటాయిస్తూ పాలమూరు–రంగారెడ్డికి జాతీయహోదాను ఇప్పించాలని అక్కడి నుంచి కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపండి’’ అని సలహా ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతలకు వెన్నముక ఉంటే ఈ పనులు చేయాలని సవాల్ విసిరారు. ఆదాయం కాదు.. కష్టాలు డబుల్ అయ్యాయి ‘మోదీ పాలనలో రైతుల ఆదాయం డబుల్ అయిందని నిన్న ఓ పత్రికలో ప్రధాని ఆర్థిక సలహాదారు ఓ కథనం రాశారు. ఇది ఎంత దుర్మార్గం. ఎవరి ఆదాయాలూ డబుల్ కాలేదు. కష్టాలు, పెట్టుబడులు డబుల్ అయ్యాయి...’’ అని కేటీఆర్ అన్నారు. ఒక్క తెలంగాణలో మన పాలనలో రైతులకు ఆరేళ్లలో రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు..అని చెప్పారు. బేకార్ గాళ్లతో మనకు పంచాయితీ ఎందుకనీ కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్న చిల్లరగాళ్లు ఉన్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపించి హ్యట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దమోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. మోదీ ఓ అసమర్థ ప్రధాని ‘నరేంద్రమోదీ ఓ అసమర్థ, పనికి మాలిన ప్రధాని అని కేటీఆర్ ధ్వజమెత్తారు. క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ రూ.30లక్షల కోట్లు అదనంగా గుంజింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. ’’పీఎం కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటుండు. ఎంత హస్యాస్పదమండి... మోదీ చూ మంత్రం వేస్తే కరోనా వ్యాక్సిన్ తయారైందంట...శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నర్సులు వారంతా ఎందుకున్నట్లు.’ అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదాయం కాదు.. కష్టాలు డబుల్ అయ్యాయి ‘మోదీ పాలనలో రైతుల ఆదాయం డబుల్ అయిందని నిన్న ఓ పత్రికలో ప్రధాని ఆర్థిక సలహాదారు ఓ కథనం రాశారు. ఇది ఎంత దుర్మార్గం. ఎవరి ఆదాయాలూ డబుల్ కాలేదు. కష్టాలు, పెట్టుబడులు డబుల్ అయ్యాయి...’’ అని కేటీఆర్ అన్నారు. ఒక్క తెలంగాణలో మన పాలనలో రైతులకు ఆరేళ్లలో రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు..అని చెప్పారు. బేకార్ గాళ్లతో మనకు పంచాయితీ ఎందుకనీ కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్న చిల్లరగాళ్లు ఉన్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపించి హ్యట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దమోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నారాయణపేటలో సీనియర్ సిటిజన్లకో పార్కు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్ల కోసం నారాయపేట జిల్లాకేంద్రంలో ఓ పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 8వ వార్డు సత్యసాయికాలనీలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ పార్కును మంత్రి ప్రారంభించి అద్భుతమంటూ కితాబునిచ్చారు. ఈ పార్కును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు. పార్కులో ఉన్న ఓ చెట్టుకు విరగకాసిన చింతకాయలను చూస్తూ మంత్రి కేటీఆర్ భలే కాశాయని ముచ్చట పడ్డారు. అంతలోనే చెట్టు చింతకాయను ఓ ప్రజాప్రతినిధి తీసుకువచ్చి ఇవ్వగా కేటీఆర్ వాటిని తింటూ భలేగా ఉన్నాయంటూ అందరినీ ఊరించారు. -
వరసకు బాబాయ్! పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
కృష్ణ: వరసలు కలవకపోవడంతో తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంటలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పరిధిలోని కందానాటికి చెందిన మునికుమార్ (25), పారుపల్లికి చెందిన అనిత (16)ల కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం కుటుంబాలతో కలసి ఇటీవల కృష్ణ మండలంలోని చేగుంటలో పత్తి తీయడానికి వచ్చారు. అదే ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా మునికుమార్, అనిత ప్రేమించుకుంటున్నారు. అయితే మునికుమార్ అనితకు వరసకు బాబాయ్ అవుతాడు. వీరి విషయం తెలిసిన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తమ ప్రేమ ఫలించదని మనస్తాపానికి గురైన వారు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం రైల్వే గ్యాంగ్‌మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పంచనామా చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
50 రోజులు.. 1,300 కిలోమీటర్లు
(భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 7న కేరళలో ప్రారంభమైన యాత్ర గురువారం నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. రాహుల్ పాదయాత్ర గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఎలిగండ్లకు చేరుకుంది. మొత్తం 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లోని 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటివరకు మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో 1,325 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారు. తమిళనాడులో 2 జిల్లాలు, కేరళలో 7 జిల్లాలు, కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్‌లో 2 జిల్లాల్లో యాత్ర పూర్తి కాగా ప్రస్తుతం తెలంగాణలోని మొదటి జిల్లా (నారాయణపేట)లో యాత్ర జరుగుతోంది. రాష్ట్రంలో ఈ యాత్ర నవంబర్ 7 వరకు సాగనుంది. తెలంగాణలో యాత్ర పూర్తయితే 5 రాష్ట్రాలు, 26 జిల్లాల్లో 1,670 కిలోమీటర్ల మేర యాత్ర సాగినట్లవుతుంది. -
Rahul Gandhi: ఆ రెండు పార్టీలు దొందూ.. దొందే!
సాక్షి, నారాయణ్‌పేట: కాంగ్రెస్ దృష్టిలో టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో ఆయన ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. గురువారం సాయంత్రం నారాయణపేటలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీఆర్ఎస్లు ఒక్కటే. నాణేనికి బొమ్మాబొరుసుల్లాంటివి. ఢిల్లీలో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు కేసీఆర్ పార్టీ వంతపాడింది. రాజకీయాలను ఈ రెండు పార్టీలు ధనప్రమేయం చేశాయి. వ్యాపార సంస్థలుగా కొనసాగుతున్నాయి. రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ఇంకా బాధపడుతూనే ఉన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. పెట్రోల్ , డిజీల్ , గ్యాస్ ధరలు ప్రజలకు భారంగా మారాయి. ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ పని. తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్.. అత్యంత అవినీతి ప్రభుత్వం. మియాపూర్ స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టులే అందుకు నిదర్శనం. టీఆర్ఎస్పై రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసమే భారత్ జోడో యాత్ర. దాదాపు 3,500 కిలో మీటర్లు నడవటం ఆషామాషీ కాదు. కానీ, మీ శక్తిని ధారపోసి నాతో అడుగేస్తుంటే … కష్టం తెలియటం లేదు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
మాగనూర్: పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తిని 83 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో సోమవారం జరిగింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం చేయగా దాదాపు 83 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హెచ్ఎం నర్సింహులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పీ హెచ్‌సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మధ్యాహ్న భోజనం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపించారు. మరో ఏడుగురు విద్యార్థులకు వాంతులు తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. -
మాటల గారడీతో మోసం చేస్తున్నారు: షర్మిల
నర్వ: తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన సీఎం కేసీఆర్‌కు కాలం చెల్లిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా నర్వ మండలంలో పర్యటించిన ఆమె నర్వ, పెద్దకడ్మూర్, ఎల్లంపల్లి గ్రామాల్లో ప్రజలనుద్దేశించి మాట ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. నిరుద్యోగులు, దళితులు, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలు తప్పిన సీఎం కేసీఆర్‌ది ఇంతకు గుండెనా?.. బండనా? అని ప్రశ్నించారు. రైతుబంధు ద్వారా కేవలం రూ.5 వేలు ఇస్తే బ్యాంకు వడ్డీలకు సరిపోవడం లేదన్నారు. ఎరువుల ధరలు పెంచి, సబ్సిడీలు ఎత్తివేసి, రైతుల నడ్డి విరుస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఆగస్టు 15 వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా మొదటి సంతకం చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. తనను వైఎస్సార్ బిడ్డగా ఆదరిస్తే వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొస్తానన్నారు. -
ఎందరో త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం
నారాయణపేట: ఎంతోమంది త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని వైఎస్సార్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర సోమవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి చేరుకుంది. స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేనికి సేవ చేయడం గొప్ప గౌరవం అని, వైఎస్సార్ ఆఖరి నిమిషం వరకు ప్రజలకు సేవ చేస్తూనే చనిపోయారని గుర్తు చేశారు. దేశంలో మహిళలకు సమానత్వం లేదని ఇంకా చిన్నచూపే చూస్తున్నారని, మరియమ్మ అనే మహిళను జైల్లో పెట్టి చంపేశారన్నారు. మహిళలు అని చూడకుండా జైలో పెడుతున్నారని, మహిళలకు ఈ స్వతంత్ర దేశంలో గౌరవం లేదని, మద్యపాన నిషేధం అమలు చేయకుండా..మద్యం అమ్మకాల మీద రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే వైఎస్సార్ సుపరిపాలన తిరిగి అందిస్తానని హామీనిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిదన్నారు. అధికారం ఇస్తే ఉద్యమకారులను ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, ఉద్యమకారులకు ఇళ్లు, ఉద్యోగాలు, జీవితాంతం పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. -
Telangana: అక్కడ ముక్కోణపు పోటీ అనివార్యం
నారాయణ్‌పేట నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ అనివార్యం కానుంది. తెలంగాణ తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన రాజేందర్‌రెడ్డి తర్వాత గులాబీ దళంలో చేరారు. 2018లో టీఆర్ఎస్ తరపున బరిలో దిగి విజయం సాధించారు. ఈసారి కూడా కారు గుర్తు మీద రాజేందర్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్క్ చూపించారాయన. నారాయణపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయించగలిగారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడం ఆయనకు మైనస్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం డీసీసీ చీఫ్‌గా, నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న శివకుమార్‌రెడ్డి 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడారు. 2018లో కారు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి..వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గంలో తొలినుంచీ బీజేపీకి కొంత పట్టుంది. బీజేపీ నేత రతంగ్‌పాండు రెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో కూడా బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. సౌమ్యుడిగా పేరున్న రతంగ్పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. తెలంగాణ-కర్నాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నియోజకవర్గం ఓటర్లు ప్రతిసారీ భిన్నమైన తీర్పునిస్తున్నారు. బీజేపీ నేత డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున గెలిచి ఆ తర్వాత కారు పార్టీలో చేరారు. 2018లో కూడా కారు గుర్తు మీద నెగ్గి...మూడోసారి గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషాతో పాటుగా..పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ ఆసక్తి చూపిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే చిట్టెంకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే..తొలినుంచీ కేడర్ అండగా ఉన్నందున స్థానిక మున్సిపాలిటీని గెలుచుకోగలిగింది. అయితే తొలినుంచీ పార్టీలో ఉండి రెండుసార్లు పోటీ చేసి ఓడిన కొండయ్యకు, కొత్తగా చేరిన జలంధర్‌రెడ్డికి పొసగడంలేదు. ప్రజాసంగ్రామ యాత్రలో కూడా ఇద్దరు పోటా పోటీగా బలప్రదర్శన చేశారు. సీటు విషయంలో ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం వస్తే బీజేపీకి ప్లస్ అవుతుంది. లేదంటే కారు పార్టీకే మేలు జరుగుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే మారింది. ఎమ్మెల్యేగా గెలిచిన చిట్టెం టీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీకి సరైన నాయకత్వమే లేకుండా పోయింది. మాజీ జడ్పీటీసీ శ్రీహరి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ ఎన్నిక ఈసారి రసవత్తరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్...కాంగ్రెస్‌లో చేరి 2018లో ఓడిపోయారు. తర్వాత మల్కాజ్గిరి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పనుల విషయంలో అధికార టీఆర్ఎస్తో కొట్లాడి చేయించారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను టార్గెట్ చేసి ఓడించారు. కొడంగల్‌లో రేవంత్ సోదరుడు పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ గెలిస్తే సీఎం అవుతారనే ప్రచారం జరుగుతున్నందున కొడంగల్‌లో రేవంత్ విజయం ఖాయమని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. కారు గుర్తు మీద గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి...పార్టీ నేతలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. దీంతో వారంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగా నియోజకవర్గానికి చేసిన పనులు కూడా లేవు. కొడంగల్‌లో ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథరెడ్డి 2014లో కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో గులాబీ గూటికి చేరి పోటీ చేసి..రేవంత్ చేతిలో ఓడిపోయారు. గుర్నాథరెడ్డి ఇటీవల వైఎస్ విజయమ్మను కలవడంతో...వైఎస్ఆర్టీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఇక కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి అద్వాన్నంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక్కడ బీజేపీకి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంత శక్తి లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
కలెక్టర్ హరిచందనపై.. మక్తల్ ఎమ్మెల్యే మండిపాటు
నారాయణపేట: ‘జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ జీరోగా తయారైంది.. నా ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు.. నేనేంటో చూపిస్తా.. ఇక్కడ నియంత పాలన సాగదు’ అంటూ నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కలెక్టర్ దాసరి హరిచందనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ ఎజెండా చదువుతుండగా సమావేశానికి డీఈవో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘కలెక్టరే సమావేశాలకు రారు.. ఇక జిల్లా అధికారులు ఎందుకు వస్తార’ని అసహనం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సమావేశమంటే పిల్లలాటైంది.. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ పనికిమాలిన వాళ్లా.. వచ్చేసారి అందరం కలసి కలెక్టరేట్‌కు వెళ్లి జెడ్పీ మీటింగ్ పెట్టాలి’అని అన్నారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే, అక్కడ (కలెక్టరేట్లో) కలెక్టర్ రహస్య సమావేశాలు పెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ‘తెలంగాణ తెచ్చుకుంది.. జిల్లా వచ్చింది ఇందుకోసమేనా’ అని అసంతృప్తి వెళ్లగక్కారు. ఐదుగురు కనిపిస్తే కలెక్టర్‌కు బుగులు పుడుతుందని, వెంటనే పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తారని అన్నారు. సంగంబండ ముంపు బాధితులు కలెక్టరేట్‌కు వస్తే వారిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. మక్తల్ నుంచి ఓ మహిళా సర్పంచ్ సమస్య పరిష్కారం కోసం వస్తే అగౌరవపరిచారని, ఇదే కలెక్టర్ బిల్డింగ్‌పై నుంచి దూకి చస్తానని ఆమె తనతో ఫోన్లో చెప్పారన్నారు. జిల్లాకేంద్రంలో రూ.కోట్ల విలువైన ఎస్ఎల్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వానికి ఇస్తే తమ సొసైటీ బిల్డింగ్ దగ్గరికి ఆర్అండ్బీ అధికారులను పంపించి పెనాల్టీ కట్టాలని నోటీసులు పంపించారన్నారు. భారత్‌మాల కోసం దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ధర నిర్ణయించి తిరిగి నోటిఫికేషన్ వేసి భూములు తీసుకోవాలని కోరారు. (క్లిక్: టీఆర్ఎస్కు రాజయ్య గుడ్‌బై) -
Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ!
రాబోయేది పండగల సీజన్. సంప్రదాయ చీర కట్టులో భాగంగా వేడుకలో పట్టుకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. సౌత్ ఇండియన్ కాటన్స్తో సౌకర్యంగానూ, పండగ కళ పెంచేలా డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. మనవైన కాటన్స్ తలపునకు రాగానే ప్రముఖంగా మంగళగిరి, నారాయణ్ పేట్, పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, కలంకారీ.. వంటివి కళ్ల ముందు నిలుస్తాయి. అయితే, కాటన్ అనగానే చాలామంది ఈ సీజన్‌కి సరైనవి కావు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా మనవైన కాటన్స్ జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ ఉంటాయి. వాటిలో పండగల కాలంలో పట్టు కట్టకపోయినా ఏ మాత్రం వన్నె తగ్గని జరీ అంచు కాటన్ వినూత్నమైన కళను తీసుకువస్తాయి. వాటిలో చీరకట్టు మాత్రమే కాదు సౌకర్యంగా ఉండే కుర్తా సెట్, లాంగ్ అండ్ షార్ట్ గౌన్స్ కూడా ధరించవచ్చు. క్యాజువల్‌గానూ అదే విధంగా పార్టీవేర్‌గానూ ఎంపిక చేసుకోవచ్చు. అయితే, వీటిని రెడీమేడ్‌గా కాకుండా ఎవరికి తగినట్టుగా వారు డిజైన్ చేసుకోవచ్చు. సరైన డ్రెస్ అందుబాటులో లేదనుకుంటే మనదైన సంప్రదాయ జరీ అంచు కాటన్ దుపట్టా ధరించినా చాలు పండగ కళ వచ్చేస్తుంది. వీటికి సంప్రదాయ ఆభరణాలు లేదా టెర్రకోట, ఫ్యాబ్రిక్, సిల్వర్ జ్యువెల్రీ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఆభరణాల ఊసు లేకపోయినా అందంగానూ ఉంటాయి. చదవండి: Bindu Madhavi: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 45వేల పైమాటే! ప్రత్యేకత ఏమిటంటే! -
చీమూ నెత్తురుంటే బకాయిలు తెండి
నారాయణపేట: ‘తెలంగాణలోని గ్రామపం చాయతీలకు కేంద్రం నుంచి రూ.1,100 కోట్లు రావాల్సి ఉంది. ఆర్థిక సంఘం నుంచి జీఎస్టీ రూపంలో రూ.11 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. బీజేపీ నేతలకు చీము, నెత్తురూ ఉంటే ఈ బకాయిలన్నీ తీసుకురావాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. సోమవారం నారాయణ పేటలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి జిల్లా ఆస్పత్రిలో పలు యూనిట్లు ప్రారంభించడంతోపాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అప్పక్ పల్లి వద్ద బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లా డారు. పల్లె, పట్టణ ప్రగతి కోసం ఈ ఎనిమి దేళ్లలో రూ.11,711 కోట్లు వెచ్చించా మని, గత రెండేళ్లలో రూ.1,144 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వాస్తవాలు ఇలా వుంటే బిల్లులు రాలేదని నలుగురు బీజేపీ సర్పంచ్ లను వెంట బెట్టుకుని ఆ పార్టీ నేతలు దొంగ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ఎనిమిదేళ్లు అయినా విభ జన చట్టంలోని హామీలను నెరవేర్చలేద న్నా రు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, ఏపీ లో పోలవరం, మధ్య ప్రదేశ్‌లో మరో ప్రాజె క్టుకు జాతీయ హోదా ఇచ్చారంటూ.. పాల మూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకి వ్వడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు. బీజేపీ ఫెయిల్..టీఆర్ఎస్ పాస్: ‘రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో లేవు. అధి కారంలోకి రావు. వారు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. వారి మాటలు నమ్మొద్దు..’ అం టూ మంత్రి హరీశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ల్లో అమలు కాని పథకాలు ఇక్కడ ఎలా అవుతాయని ప్రశ్నించారు. రైతు బంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వం టివి ఆ రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అని నిలదీ శారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇప్ప టికే 40 లక్షల ‘ఆసరా’ పింఛన్లు ఇస్తున్నామని, త్వర లోనే 57 ఏళ్ల వయస్సు వారు పది లక్షల మం దికి అందించనున్నామని తెలిపారు. ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి టీఆర్ఎస్ ఇక్కడ పాసైతే, కర్ణాటకలో బీజేపీ ఫెయిలైందని హరీశ్ ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కులపిచ్చి, బీజేపీ నేత బండి సంజయ్‌కి మతపిచ్చి పట్టిం దని శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కులం ఓట్లతోనే రేవంత్‌రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అయ్యారా? అని ప్రశ్నించారు. కార్యక్ర మాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
‘నీకు పెళ్లయింది కదా’.. ‘నా భార్య మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’
పంజగుట్ట: ‘నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి తన భార్య త్వరలో చనిపోతుందని నన్ను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు తెలియకుండా ఫొటోలు తీసి వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు’అని బాధిత కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆవేదన చెందింది. శివకుమార్‌రెడ్డి అకృత్యాలపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి👉🏼 ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివకుమార్ రెడ్డికి అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు 2020లో పరిచయమైంది. పార్టీ కార్యకలాపాల కోసం ఆయన్ను కలిసేందుకు తరచూ సదరు మహిళ రాగా ఆమెపై కన్నేశాడు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రేమిస్తున్నానన్నాడు. ‘నీకు పెళ్లయింది కదా’ అని ఆమె ప్రశ్నించగా ‘నా భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’అని నమ్మబలికాడు. తనకో తోడు కావాలంటూ ఆమె మెడలో పసుపు తాడు కట్టి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయిందని చెప్పాడు. మాట్లాడుకుందామని పంజగుట్టలోని ఓ హోటల్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని నెట్లో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇప్పుడు దూరంగా ఉండటమే కాకుండా అనుచరులతో బెదిరింపులకు దిగుతున్నాడని ఆ మహిళ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి👉🏾 వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని.. -
ఫ్లిప్‌కార్ట్‌లో నారాయణపేట హస్తకళాకృతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నారాయణపేట స్వయం సహాయక సంఘాల మహిళలు, చేతివృత్తులు, చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశమంతటా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నారాయణపేటకు చెందిన ఆరుణ్య ప్రాజెక్టుతో ఫ్లిప్‌కార్ట్ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ‘టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్’పై మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా మహిళా చేతివృత్తులు, చేనేతకారులకు తరగతుల నిర్వహణ, క్షేత్రస్థాయి శిక్షణను అందించి.. వారు తయారుచేసే ఉత్పత్తులకు జాతీయస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలోని చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సమ్మిళిత అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మహిళల జీవనోపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం వంటివి తోడ్పడుతాయి’’అన్నారు. తెలంగాణ, ఆరుణ్యలతో భాగస్వామ్యం కావడం సంతోషకరమని.. మహిళలకు ఆర్థిక స్వా తంత్య్రం అందించడం, వారి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మార్కెటింగ్ అందించడం తమకు ఆనందాన్ని ఇస్తోందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పొరేట్ సంబంధాల అధికారి రజనీష్‌కుమార్ చెప్పారు. ఏమిటీ ఆరుణ్య? నారాయణపేటలో చేనేత, హస్తకళాకృతులకు ‘ఆరుణ్య’ ప్రసిద్ధమైన బ్రాండ్. కరోనా కాలంలో స్థానిక మహిళలకు ఉపాధి, వారు చేసే ప్రత్యేక ఉత్పత్తుల విక్రయం ద్వారా సాయపడేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మొదట పది మందితో మొదలై.. ఇప్పుడు కలంకారీ, బ్లాక్ పెయింటింగ్ అంశాల్లో మహిళలకు శిక్షణనిచ్చే స్థాయికి చేరుకుంది. -
Fashion: ఒక్కో బ్లవుజు ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు..!
ఏ ఇద్దరు మనుషులూ ఒక్కలా ఉండరు. ఏ ఇద్దరి అభిరుచులూ ఒక్కలా ఉండవు. మరి ధరించే దుస్తులు మాత్రం ఒకేలా ఎందుకుండాలి? దేనికది ప్రత్యేకంగా ఎందుకు ఉండకూడదు? ఇది ఓ సందేహం. చీరల కోసం వందలాది షోరూమ్‌లున్నాయి. బ్లవుజుకు ఒక్క షో రూమ్ కూడా ఉండదెందుకు? మరో సందేహం. అది లేదు... ఇది లేదు... అనుకోవడం కాదు, ఆ ఖాళీని నేనే ఎందుకు భర్తీ చేయకూడదు? ఇన్ని సందేహాలు, సమాధానాల మధ్య రూపుదిద్దుకున్న ఐడియా ‘డిజైనింగ్ ఐడియాస్, జస్ బ్లవుజ్’. హైదరాబాదీ డిజైనర్ వర్షామహేంద్ర ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఓ కొత్త ఆలోచన ఆ తర్వాత వందలాది మందికి ఉపాధి మార్గంగా మారింది. వర్షామహేంద్రది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. హైదరాబాద్, సెయింట్ ఫ్రాన్సిస్ నుంచి బి.ఎ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ‘‘మా నాన్న వ్యాపారి. అమ్మ స్కూల్ టీచర్. నాకు డెస్క్ జాబ్ నచ్చేది కాదు. నాన్నలాగ బిజినెస్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలని ఉండేది. అదే సమయంలో కెరీర్ సృజనాత్మకంగా, నాకంటూ ప్రత్యేకమైనదిగా ఉండాలనే కోరిక కూడా ఉండేది. దాంతో డిగ్రీ పూర్తయిన తర్వాత ముంబై, జేడీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఏడాది డిప్లమో కోర్సు చేశాను. పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్లడం నా లక్ష్యాన్ని సులువు చేసింది. అక్కడ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. నా పెళ్లి చీరలు, బ్లవుజ్‌ల అనుభవంతో కోర్సులో చేరినప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టితో ఫ్యాషన్ ప్రపంచాన్ని గమనించగలిగాను. ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్డీసీ) కోసం పని చేయడం నాకు మంచి అవకాశం. వర్షామహేంద్ర క్లోతింగ్‌లో అనేక ప్రయోగాలు చేశాం. కలెక్షన్ ఆఫ్ డిజైన్స్ నా బలం. అలాగే సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన వడపోతలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఆరువందల మందిలో ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో నేనూ ఉండడంతో నాకు సొంతంగా నా బ్రాండ్‌ను విజయవంతం చేయగలననే నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతోనే 2010లో హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సొంత స్టార్టప్ ప్రారంభించాను. ఇండియన్ బిజినెస్ స్కూల్– గోల్డ్మాన్సాచె ఫెలో పదివేల మంది మహిళల్లో స్థానం లభించడం నాకు మంచి సోపానం అయింది. ఇంటర్న్‌షిప్ కోసం న్యూయార్క్‌కి వెళ్లే అవకాశం వచ్చింది. క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆహ్వానం అందింది. దాదాపుగా రెండు నెలలు అక్కడ క్రాఫ్ట్మెన్ను, విద్యార్థులను సమన్వయం చేస్తూ వాళ్లతో కలిసి పని చేసే అవకాశం ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. 2014లో యునైటెడ్ నేషన్స్ కార్యక్రమానికి హాజరయ్యాను. అది నా ఫస్ట్ ఫ్యాషన్ షో. న్యూయార్క్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొన్నాను. ఇన్ని వేదికల మీద విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత ... కేవలం బ్లవుజ్‌ల కోసమే ఒక వేదికకు రూపకల్పన చేస్తూ నేను స్టార్టప్ ప్రారంభించడం తెలివైన నిర్ణయమే అని అనిపించింది. మార్కెట్ స్టడీ చేయలేదు మామూలుగా స్టార్టప్ ప్రారంభించే ముందు మార్కెట్ స్టడీ చేయాలి. కానీ నేను మార్కెట్లో ఉన్న గ్యాప్‌ని గుర్తించగలిగాను. అదే నా విజయ రహస్యం. నాతోపాటు ఇద్దరు ఉద్యోగులతో మొదలైన స్టార్టప్ ఇప్పుడు డెబ్బై మందితో పని చేస్తోంది. వెయ్యి నుంచి పన్నెండు వందల బ్లవుజ్‌లు ఒక చోట దేనికది ప్రత్యేకంగా ఉంటే ఇంకేం కావాలి. ఒక్కో బ్లవుజ్ ధర రెండున్నర వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది. ఒకప్పుడు చీర కొనుక్కుని బ్లవుజ్ కోసం మ్యాచింగ్ సెంటర్లకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు నచ్చిన డిజైనర్ బ్లవుజ్ కొని ఆ తర్వాత దానికి సరిపడే సింపుల్ చీరను సెలెక్ట్ చేస్తున్నారు. బ్లవుజ్ హైలైట్ కావడమే ఫ్యాషన్ ట్రెండ్‌గా చేయగలిగాను. ఇది ఫ్యాషన్ రంగానికి నా కంట్రిబ్యూషన్ అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రెండు దశాబ్దాలుగా నేను ఫ్యాషన్ రంగంలో ఉన్నాను. దేశవిదేశాల ఫ్యాషన్ వేదికలను చూశాను. మన భారతీయ వస్త్రధారణలోనే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇక నా స్వీయ అనుభవంలోకి వస్తే... నా పెళ్లికి హెవీ చీర కొనేశాను. బ్లవుజ్ కుట్టించుకోవడానికి పెద్ద–చిన్న టైలర్ల చుట్టూ తిరిగాను. ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. నా అసంతృప్తి నుంచి నేను డిజైన్ చేసుకున్న ఫ్యాషన్ ఇది. నేను సృష్టించుకున్న కెరీర్ ఇది. అప్పుడు నేను సృష్టించిన ట్రెండ్ వందలాది మందికి ఉపాధి మార్గం అయిందంటే ఎంతో సంతోషంగా కూడా ఉంది’’ అన్నారు వర్షామహేంద్ర. ఎల్లలు దాటిన మన నేత మన సంప్రదాయ నేతకు ఆదరణ తగ్గి నేతకారుల ఇంటి కొత్త తరం ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్న రోజుల్లో వర్ష వీవింగ్ ఫ్యూజన్‌కు తెర తీశారు. నేతకారుల జీవిక కోసం సహాయం చేస్తున్న యూకేలోని ఎన్జీవోతో కలిసి పోచంపల్లి నేతకారుల కోసం పని చేశారామె. అలాగే ఇప్పుడు పైథానీ, కంచిపట్టు, నారాయణపేట, చీరాల, లక్నో నేతకారులు, ఉదయ్‌పూర్–జైపూర్ బ్లాక్ ప్రింటింగ్ కళాకారులు, కోల్‌కతా రేషమ్ కళాకారులతో కలిసి ఒక చీరలో రెండు – మూడు రకాల సమ్మేళనానికి రూపమిస్తున్నారు. ‘‘ఒక చీరను విదేశీ వేదిక మీద ప్రదర్శించినప్పుడు దాని గురించి వివరించడానికి బోలెడంత సమాచారం ఉంటుంది. మన వస్త్ర విశేషం అదే’’ అన్నారామె. చీరకు చక్కటి కట్టు అందాన్ని తెస్తుంది, బ్లవుజ్‌కి చక్కటి కుట్టు అందాన్ని తెస్తుంది. ఈ రెండింటినీ మేళవించడంలో సక్సెస్ అయ్యారు వర్ష. – వాకా మంజులారెడ్డి చదవండి👉🏾Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
24 గంటల్లో పెళ్లి.. ఇంతలో వధువు ఆత్మహత్య
మక్తల్: తెల్లారితే బాజాభజంత్రీలు మోగాల్సిన ఇల్లు. మరో 24 గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే వధువు ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడి వేధింపులు తాళలేక ఉరేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్‌లో ఈ ఘటన జరిగింది. చందాపూర్ వాసి భీమేశ్వరి (19)కి మక్తల్ మండలం దండుకు చెందిన ఓ యువకుడితో వారం రోజుల క్రితం నిశ్చితార్థమైంది. ఈనెల 3న ఉదయం 9.55 గంటలకు వరుడి ఇంట్లో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా చందాపూర్‌కు చెందిన నర్సిములు (లిక్కి) కొన్నాళ్లుగా ప్రేమ పేరిట భీమేశ్వరిని వేధించసాగాడు. ‘నీకు వేరే వ్యక్తితో పెళ్లి కాకముందే ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటా’నని తరచూ బెదిరించేవాడు. ఆ బాధ ఎవరితోనూ చెప్పుకోలేక ఆ యువతి సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. లిక్కి వేధింపులు తాళలేక పెళ్లికి ముందే నేను చనిపోతున్నాను అని సూసైడ్ లెటర్ రాసింది. ఉదయం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పద్మమ్మ, వెంకటప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రాములు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం చేసి యువతి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సాయంత్రం కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ‘అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి బదులు మట్టి వేయాల్సి వచ్చింది’అంటూ కుటుంబీకులు, బం ధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లండి.. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అతను మేజర్.. ఆమె మైనర్.. ఇంట్లో చెప్పలేక..
సాక్షి, కోస్గి (నారాయణపేట): అతను మేజర్.. ఆమె మైనర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పలేక ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. బాలిక కుటుంబీకులు యువకుడిపై కిడ్నాప్, డబ్బు దొంగతనం కేసు పెట్టారు. మూడ్రోజులు గడిచింది. విడిపోయి బతకలేమనుకున్నారో ఏమో చెట్టుకు ఉరేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం బోగారం శివారులోని అమ్లికుంటలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం హుస్సేన్‌పూర్‌కు చెందిన యువకుడు శివకుమార్ (20) తల్లిదండ్రులు వెంకటయ్య, పద్మమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని నాగులపల్లికి చెందిన పదో తరగతి బాలిక (15) ప్రేమలో పడ్డాడు. ఈ నెల 27న ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబీకులు వాకబు చేయగా ప్రేమ విషయం బయటపడటంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో మైనర్ కిడ్నాప్‌తో పాటు డబ్బులు దొంగతనం జరిగినట్టు శివకుమార్, అతని కుటుంబీకులపై ఫిర్యాదు చేశారు. చదవండి: (యువతికి రూ.50 వేలు బురిడీ.. వైన్ ఆర్డర్ చేసి అగచాట్లు) ఇరు కుటుంబాలు రాజీ చేసుకొని రెండ్రోజుల్లో బాలికను అప్పగిస్తామని లిఖిత పూర్వకంగా రాసుకున్నారు. ఇంతలో గురువారం సాయంత్రం కోస్గి మండలంలోని బోగారం చెరువు సమీపంలో అమ్లికుంటకు చెందిన ఓ రైతు పొలంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్టు కొందరు రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి ప్రాథమికంగా విచారించగా సదరు ప్రేమజంటనే అని తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Narayanpet Sarees: కరక్కాకాయ, నల్లబెల్లం, తుప్పుముక్క, దానిమ్మ తొక్కలు.. రంగురంగుల చీరలు!
తెలంగాణలో నారాయణపేట పేరు వినగానే అక్కడి చేనేత చీరలు కళ్లముందు నిలుస్తాయి. వాటి ఘనత గురించి కాసేపయినా మాట్లాడుకోకుండా ఉండలేం. మగువల మనసులను అకట్టుకునే విధంగా నేతకారులు మగ్గాల పై పట్టు, కాటన్ చీరలను నేయడంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇక నుంచి నారాయణపేట చేనేతలకే కాదు, తమ ప్రాంత చిత్రకళా వైభవాన్ని చెప్పుకునేలా కృషి చేస్తూ తమ కలలకు కళానైపుణ్యాన్ని జత చేస్తున్నారు ఇక్కడి మహిళలు. భారతీయ హస్తకళలో కలంకారీ చిత్రకళ ప్రాచీనమైనది. ఇప్పటి వరకు ఈ కళ గురించి ప్రస్తావన వస్తే ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం, శ్రీకాళ హస్తి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ప్రపంచ మార్కెట్లో కలంకారీ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నారాయణపేటలో మహిళలు శిక్షణ పొందుతున్నారు. వస్త్రాలపై కలంకారీ పెయింటింగ్‌తో పాటు బ్లాక్ ప్రింటింగ్ కూడా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. మహిళల ప్రతిభ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినవారు నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. నాబార్డు సహకారంతో, డీఆర్డీఏ ఆధ్వర్యంలో కలంకారీలో 60 మంది మహిళలకు 80 రోజుల పాటు హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ శిక్షణ ఇస్తోంది. బ్లాక్ ప్రింటింగ్‌పై 30 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. రంగులు అద్దుతున్నారిలా... వెదురు పుల్లలకు దూది చుట్టి బ్రష్‌లా చేసుకొని.. చింతపుల్లలను కాల్చి, నల్లబెల్లం వాడుతూ, పాలు, పటిక పొడి కలిపిన ద్రావణంలో వస్త్రాన్ని నానబెట్టి, జాడించి, సబ్బునీళ్లలో ఉతికి ఆరబెడతారు. తొలిసారి చిత్రణ పూర్తయ్యాక పారుతున్న నీళ్లలో ఆరవేసినట్టుగా ఆ వస్త్రాన్ని పట్టుకుంటారు. మొదటి దశలో ఎరుపు, నలుపు రంగులను వాడుతారు. ఆ తర్వాత డిజైన్‌కు సంబంధించిన రంగులన్నీ ఉపయోగిస్తారు. అన్నీ సహజమైన రంగులే! కలంకారీ డిజైన్‌లో ప్రధానంగా వాడే నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల కోసం తుమ్మజిగురు, కరక్కాకాయ, నల్లబెల్లం, తుప్పుముక్క, దానిమ్మ తొక్కల ద్వారా తీసిన సహజమైన రంగులను వాడుతున్నారు. ఆకట్టుకుంటున్న వస్త్రాలు యువతులు, మహిళలు ఎంతో ఉత్సాహంతో చేస్తున్న ఈ ప్రక్రియతో కలంకారీ పెయింటింగ్స్, బ్లాక్ ప్రింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతామని మహిళలు, యువతులు చెబుతున్నారు. దుపట్టాలు, చీరలు, టేబుల్ క్లాత్స్, బ్యాగ్స్ పై ఈ పెయింటింగ్‌తో అందమైన డిజైన్లను రూపొందిస్తున్నారు. కలంకారీ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు, యువతులు సర్టిఫికేట్లను అందుకోవడంతో పాటు ఈ కళలో నిమగ్నమయ్యారు. నారాయణపేట చేనేతలకు ప్రసిద్ది. ఇక్కడి చేనేత కార్మిక మహిళలు, యువతులు చదువుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవాలనే లక్ష్యంతో కలంకారీ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్‌పై శిక్షణ ఇస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాంత మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న కలంకారీ, బ్లాక్ ప్రింటింగ్ చీరలు మార్కెట్లోకి వస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతిని సాధించనున్నారు. – దాసరి హరిచందన, జిల్లా కలెక్టర్, నారాయణపేట ఉపాధికి ఊతం నేను మెహిందీ డిజైనర్‌ని. డ్రాయింగ్‌తో పాటు చీరలపై ఫ్యాబ్రిక్ పెయింట్ చేస్తుంటాను. దీంతో కలంకారీ చిత్రణ నేర్చుకోవడం నాకు చాలా సులభమైంది. ఇప్పటికే కలంకారీ కాటన్, పట్టు చీరల వ్యాపారం చేస్తున్నాను. ఈ డిజైన్ చీరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. స్వయంగా డిజైన్ చేసి నారాయణపేట చీరలంటే మరింత ఆదరణ పొందేందుకు కృషి చేస్తున్నాను. – అశ్విని కళ్యాణి, నారాయణపేట మంచి భవిష్యత్తు నేను డిగ్రీ చేస్తున్నాను. వస్త్రాలపై డిజైనింగ్‌కు అంతటా మంచి ఆదరణ ఉండటంతో చదువుతో పాటు కలంకారీ పెయింటింగ్ నేర్చుకుంటున్నాను. ఇది నా భవిష్యత్తును మరింత కళగా మార్చుతుందని ఈ పెయింటింగ్‌లో మెళకువలు తెలుసుకున్నాక అర్ధమైంది.– వైష్ణవి ప్రత్యేకమైన డిజైన్ నేను పీజీ పూర్తిచేశాను. వస్త్రాలపై రకరకాల డిజైన్లు వేయడం కొన్నేళ్లుగా చేస్తున్నాను. నా ‘కళ’కు ఇప్పుడీ కలంకారీ శిక్షణ తోడవడంతో మెరుగైన ఫలితాలు పొందుతానన్న పూర్తి నమ్మకం వచ్చేసింది. ఇక్కడి నుంచి ప్రపంచమార్కెట్లోకి మరింత విస్తృతంగా వెళ్లగలం. – లత, నారాయణపేట శిక్షణ ఇస్తున్నా! నేను బీఎస్సీ చదివాను. బ్లాక్ పెయింటింగ్ నేర్చుకున్నా. కాటన్, పట్టు వస్త్రాలపై అద్దకం డిజైన్లు మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నాను. స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి శిక్షణ ఇచ్చేవిధంగా సిద్ధమైనందుకు ఆనందంగా ఉంది. – శ్వేత, నారాయణపేట – కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, నారాయణపేట, సాక్షి చదవండి: Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
పైశాచిక ఘటన.. కాలిన గాయాలతో యువతి దుర్మరణం
సాక్షి, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన దివ్యాంగ యువతి(21) చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపగా.. యువతి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక బాధితురాలిపై వెంకట్రాములు అనే యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని గమనించిన స్థానికులు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఆమె కన్నుమూసింది. బాధితురాలిది మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామం కాగా, వెంకట్రాములుది కోయిల్ కొండ మండలం ఇంజమూరు గ్రామంగా తెలుస్తోంది. వీళ్లిద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లో వలస కూలీలుగా ఉన్నాయి. నిందితుడు ఉప్పర్‌పల్లిలో చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. బాధిత యువతి రాజేంద్రనగర్‌లోని పిన్ని ఇంట్లో ఉంటూ దివ్యాంగుడైన సోదరుడిని చూసుకుంటోంది. అయితే ప్రేమిస్తున్నానని నమ్మబలికి.. ఫిబ్రవరి 13న ఆ దివ్యాంగ యువతిని, యువకుడు అపహరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు కూడా నమోదు అయ్యింది. అయితే లైంగిక దాడికి పాల్పడి.. ఆపై ఆమెను కాల్చి చంపాలని ప్రియుడి ప్రయత్నించి ఉంటాడని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని కోస్గీ సర్కిల్ ఎస్సై జనార్ధన్ గౌడ్ వెల్లడించారు. -
ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి..
శామీర్‌పేట్(హైదరాబాద్)/ధన్వాడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్న కుమారుడు నరసింహ (23) బీఎస్సీ (బయో టెక్నాలజీ) పూర్తి చేశాడు. కొద్దికాలంగా శామీర్‌పేటలోని ఓ రూంలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యో గం చేస్తున్నాడు. అయితే నరసింహ స్వగ్రామానికి వెళ్లిన ప్రతిసారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు సాధిస్తావు అంటూ అడుగుతుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. గత కొంతకాలంగా తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోయానంటూ బాధపడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యో గం చేసిన వాల్లే మనుషులా..ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి గత నెల 27న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో తోటి మిత్రులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సోమవారం ఉదయం లాల్‌గడి మలక్‌పేట గ్రామంలోని మల్క చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అరుదైన ‘మిడత’
కోస్గి: నారాయణపేట జిల్లా కోస్గి మండలం బొల్వోన్‌పల్లి శివారులోని ఓ పొలంలో గులాబీరంగులో గొల్లభామ (మిడత) కనిపించింది. ఆదివారం ముశ్రీఫా జెడ్పీహెచ్ఎస్ సైన్స్ క్లబ్ విద్యార్థి మహేష్ ఈ కీటకాన్ని గుర్తించి ఉపాధ్యాయుడు మల్లేశానికి చెప్పారు. కాగా, అర్థో పోడా వర్గానికి చెందిన ఆర్చిలిమమ్ వల్గెర్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే గడ్డి మైదానాల మిడతల్లో జన్యు ఉత్పరివర్తనాల ప్రభావంతో చాలా అరుదుగా ఇలా గులాబీరంగు సంతరించుకుంటాయని ఉపాధ్యాయుడు తెలిపారు. ఇలాంటి గులాబీ రంగు మిడతలు మొదటిసారి అమెరికాలోని టెక్సాస్, ఆస్టిన్లోని ఓక్‌హిల్ ప్రాంతంలో గుర్తించారన్నారు. -
రాజ్యాధికారం వస్తేనే బీసీల అభివృద్ధి
కోస్గి: రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీలలో వెనుకబాటుతనానికి పాలకుల స్వార్థ రాజకీయాలే కారణమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. బీసీలకు రాజ్యాధికారం వస్తేనే అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీసీ గౌరవ సభకు ఆమె ముఖ్యఅథితిగా హాజయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ జనాభాలో 56 శాతం, రాష్ట్ర జనాభాలో 52 శాతం బీసీలున్నప్పటికీ అటు కేంద్రంలో నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతికి చేసిన కృషి శూన్యమేనన్నారు. జనాభాలో 0.5 శాతం ఉన్న వెలమలు రాజ్యమేలితే సగానికి పైగా ఉన్న బీసీ కులాలు మాత్రం కులవృత్తుల అభివృద్ధి పేరుతో జరుగుతున్న కుట్రలో బర్రెలు, గొర్రెలు, చేపలు పెంచుకొని తాతలనాటి తరానికి వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. బీసీల కోసం 2018లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి రూ.4 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 2019లో మరో వెయ్యి కోట్లు కేటాయించినా రూ.5 కోట్లే ఖర్చు చేశారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. బీసీల అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ.. చట్టాలు సవరించాలన్నారు. వైఎస్సార్టీపీ అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించడమే తమ లక్ష్యమన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తమ్మలి బాల్‌రాజ్, జెట్టి రాజశేఖర్ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. -
భూమి లాక్కున్నారని రైతు ఆత్మహత్య
నారాయణపేట: పల్లె ప్రకృతి వనం కోసం తన భూమిని లాక్కున్నారన్న మనస్తాపంతో ఓ దివ్యాంగ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. శేర్నపల్లికి చెందిన జట్రం మల్లప్ప (55)కు గతంలో ప్రభుత్వం 2 ఎకరాల అసైన్డ్ భూమిని ఇచ్చింది. ఆయనకు మరో ఎకరా 35 గుంటల పట్టాభూమి కూడా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన భూమి జాజాపూర్ పంచాయతీ శివారులో ఉండటంతో.. ఆ భూ మిలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. మంగళవారం ఆ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అర ఎకరా తీసుకొని, మిగతాది వదిలిపెట్టాలని మల్లప్ప కాళ్లావేళ్లా పడినా వారు వినలేదు. మనస్తాపం చెందిన మల్లప్ప ఇంటికి వచ్చిన తర్వాత పురుగుల మందు తాగాడు. గ్రామస్తులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన శేర్నపల్లి గ్రామస్తులు, రైతులు జిల్లా కేంద్రానికి చేరుకుని రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అంతటా నాగుల పంచమి.. కానీ అక్కడ మాత్రం తేళ్ల పంచమి
శుక్రవారం అందరూ నాగుల పంచమి వేడుకలు చేసుకుంటే.. నారాయణపేట జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరులో భక్తులు తేళ్ల పంచమి నిర్వహించారు. గ్రామ సమీపంలోని కొండపై కొండమవ్వను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై ఏ చిన్నరాయిని తొలగించినా తేళ్లు కనిపించడంతో పట్టుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపారు. పంచమి నాడు వాటిని చేతితో తాకినా, పట్టుకున్నా, శరీరంపై పాకించినా కుట్టవని భక్తుల నమ్మకం. తేళ్లను తమ ముఖం, చేతులు, మెడపై వేసుకుంటూ వారు ఆనందపడ్డారు. ఏటా నాగులపంచమి రోజే తేళ్ల పంచమి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. కాగా తేళ్లను తాకితే మంచి జరుగుతుందని భక్తులు అంటుండగా.. వాతావరణ పరిస్థితులు, వనమూలికల కారణంగా ఆ తేళ్లు కుట్టవని కొందరు విద్యావేత్తలు చెబుతుంటారు. – నారాయణపేట ప్రాణముందని.. ప్రేమను పంచి మహబూబ్‌నగర్ పట్టణం బండ్లగేరిచౌరస్తాలో.. ఎద్దులు బండిని లాగుతుండగా దాని మీద రైతు నిల్చున్నట్లుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే, శుక్రవారం అటుగా వెళ్తున్న ఓ ఆవు.. బొమ్మ ఎద్దులు నిజమైనవి అనుకొని ఇలా వాటి వద్దకు వెళ్లి మూగ ప్రేమను పంచడం చూపరులను ఆకట్టుకుంది. – ‘సాక్షి’ సీనియర్ ఫొటోగ్రాఫర్, మహబూబ్‌నగర్ జనసంద్రమైన నాగోబా ఆలయం.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం శుక్రవారం జనసంద్రంగా మారింది. నాగులపంచమి కావడంతో భారీసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులకు జొన్నగట్కాతో అన్నదానం చేశారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం రేణుక పూజల్లో పాల్గొన్నారు. – ఇంద్రవెల్లి(ఖానాపూర్) -
‘పాలమూరు–రంగారెడ్డి’పై ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండోదశలో చేపట్టే పనులకు పర్యావరణ అనుమతులపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ, నారాయణపేటలో కార్యక్రమం జరిగింది. ముందుగా అధికారులు ప్రాజెక్టు అవశ్యకత, లాభాలు, వ్యయాల వం టివి ప్రొజెక్టర్ ద్వారా రైతులకు వివరించారు. అనంతరం వారి అభిప్రాయాలు స్వీకరించారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పోలీసులు తనిఖీచేసి అనుమ తించారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించలేదు. ప్రతి కేంద్రం వద్ద 200 నుంచి 300 మంది పోలీసులు మోహరించారు. వెల్దండలో కలెక్టర్ శర్మన్ అధ్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 8 మండలాల రైతులు పాల్గొన్నారు. తమకు పర్యావరణంపై అవగాహన లేదని, నష్టపరిహారంపైనే ఆందోళన ఉందని రైతులు చెప్పారు. నారాయణపేటలో కలెక్టర్ దాసరి హరిచందన అధ్యక్షతన 9 మండలాల రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రైతుల పేర్లను చిట్టీల్లో రాసి డిప్తీస్తూ ఒక్కొక్కరితో మాట్లాడించారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారి పేర్లే తీశారనే ఆరోపణలొచ్చాయి. -
ఉద్రిక్తతంగా మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లా పర్యటన
-
'ఇది రేషన్ దుకాణమా.. బూత్ బంగ్లానా..?'
నారాయణపేట: నారాయణపేట జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ రేషన్ డీలర్ల ఆలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నుంచి జూన్ నెలకు సంబంధించి ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం అయింది. దీంతో ఆయన ఆదివారం జిల్లాలోని మరికల్, సమీప గ్రామాల్లో ఉన్న రేషన్ దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీలర్లు నిర్వహిస్తున్న రేషన్ కేంద్రాలు బూజు, చెత్త చెదారంతో ఉండడం చూసి .. '' బాబు ఇది రేషన్ దుకాణమా.. లేక బూత్ బంగ్లానా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. దుకాణాల నిర్వహణ విషయం లో అలసత్వం ఏమాత్రం ఉపెక్షించేది లేదన్నారు. మాట వినక పోతే వేటు తప్పదని హెచ్చరించారు. నిత్యం ఎంతో మంది ప్రజలకు నిత్యావసర సరుకులను అందించే చౌక దుకాణాల ను అపరిశుభ్ర వాతావరణం లో నడపడం డీలర్లకు భావ్యం కాదని స్పష్టం చేశారు. సూక్ష్మ విషయాలే కొన్ని సందర్భాల్లో ప్రధాన అంశాలుగా పరిగణించాల్సి వస్తుందని, అందుకే డీలర్లు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకునే ఆలోచన చేయకూడదని స్పష్టం చేశారు. -
గంటల వ్యవధిలో ముగ్గురు.. తల్లి.. కొడుకు.. తండ్రి!
సాక్షి, దామరగిద్ద: కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు, తండ్రిని బలి తీసుకుంది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మొగుల్‌మడ్కకు చెందిన జంగం భద్రయ్యస్వామి (65), శశికళ (60) భార్యాభర్తలు. వీరికి కుమారులు నాగరాజు, శంభులింగం, శాంతయ్య, ఓ కుమార్తె ఉన్నారు. భద్రయ్య ఆర్ఎంపీగా పనిచేశాడు. రెండో కుమారుడు శంభులింగం కూడా అదే వృత్తిలో ఉన్నాడు. పెద్దకుమారుడు చిన్నచిన్న కాంట్రాక్టులు చేస్తుండగా.. చిన్న కొడుకు మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న వారి జీవితాలను ఒక్కసారిగా కరోనా వైరస్ దెబ్బకొట్టింది. ఇరవై రోజుల క్రితం శంభులింగం (42)కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయితే అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల క్రితం భద్రయ్యస్వామి కూడా కరోనా బారిన పడడంతో మహబూబ్‌నగర్‌లోని జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో భద్రయ్య భార్య శశికళ భర్త, కుమారుడిని చూసేందుకు మూడు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌కు వెళ్లింది. అప్పటికే ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడన్న ఆందోళన, భర్త కూడా ఆస్పత్రిలో చేరాడన్న బెంగతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత మృతి చెందింది. మరోవైపు తల్లి మృతి చెందిన ఆరు గంటల వ్యవధిలోనే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు శంభులింగం పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం 8 గంటలకు చనిపోయాడు. భద్రయ్య పెద్ద కుమారుడు నాగరాజు తల్లి, తమ్ముడి మృతదేహాలను అంత్యక్రియల కోసం ఇంటికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి భద్రయ్య కూడా మృతి చెందినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు. దాంతో మొదట తల్లి, సోదరుడి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత తండ్రి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. కరోనా కారణంగా గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా శంభులింగం ప్రాణాలు దక్కలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Fashion: చేనేతలతో సీజన్ వేర్
విధుల్లో వినూత్నం సౌకర్యంలో సమున్నతం సింప్లీ సూపర్బ్ అనిపించే చేనేతలదే ఈ సీజన్ అంతా! కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. తప్పనిసరి అనుకున్న సంస్థల్లో ఉద్యోగులు తమ విధులను నిర్వరిస్తున్నారు. ఇది వేసవి కాలం కూడా. సీజన్‌కి తగ్గట్టు చికాకు కలిగించని క్లాత్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ధరిస్తే మేనికి హాయిగా ఉంటుంది. అలాగే, మాస్క్, శానిటైజర్ వంటివి వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు డ్రెస్సుల మీదకు దుపట్టా లాంటివి ధరించాలన్నా కొంత ఇబ్బందే. వీటన్నింటికి పరిష్కారంగానే ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరీ ఆంధ్ర చేనేత బొబ్బిలి, తెలంగాణ చేనేత నారాయణ్‌పేట్ చీరలతో చేసిన డ్రెస్ డిజైన్స్ ఇవి. సింపుల్‌గా, ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు ఇలా బ్లేజర్ స్టైల్ లాంగ్ కుర్తా డిజైన్ని రెడీ చేసుకోవచ్చు. నారాయణ్‌పేట్ శారీస్‌కి బార్డర్ ఉంటుంది. దీనిని కూడా డిజైన్‌లో భాగం చేసుకోవచ్చు. చేతుల చుట్టూ అలాగే ఒక వైపు కుర్తా లెంగ్త్ బార్డర్‌ను జత చేసుకుంటే డ్రెస్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. డ్రెస్ ప్రత్యేకతలు ►బ్లేజర్ స్టైల్ లాంగ్ కుర్తా. ►మాస్క్, చిన్న శానిటైజర్ బాటిల్, ఫోన్ వంటివి క్యారీ చేయడానికి పాకెట్స్. ►మోచేతుల భాగంలో హ్యాండ్ స్లిట్స్ ►స్ట్రెయిట్ కట్ పాయింట్ ఉద్యోగినులకు, టీనేజర్స్‌కి ఈ స్టైల్ సూట్స్ ప్రత్యేకమైన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. -హేమంత్ సిరీ, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
రథం తరలిస్తుండగా విషాదం..ఇద్దరు మృతి
దామరగిద్ద/ నారాయణపేట: ఆలయానికి కొత్త రథం తీసుకొస్తుండగా విద్యుత్ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నారాయణపేట జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం..దామగిద్ద మండలంలోని బాపన్‌పల్లి గ్రామానికి 4 కి.మీ. దూరంలో వెంకటేశ్వర గుట్టపై పురాతన దేవాలయం ఉంది. భక్తులు ఈ ఏడాది రథోత్సవం కోసం కొత్త ఇనుప రథాన్ని చేయించారు. శుక్రవారం రథసప్తమి కావడంతో రథాన్ని గుడి వద్దకు తీసుకువస్తుండగా విద్యుత్‌వైర్లు రథం పైభాగానికి తగిలాయి. దీంతో 18 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దిడ్డిమూతుల హన్మంతు (34), సంజనోళ్ల చంద్రప్ప(37) మృతి చెందారు. కృష్ణాపురం వెంకటప్ప అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
విషాదం : మరణంతో ఒకటవుదాం..
ప్రేమ సాక్షిగా ఒక్కటవ్వాలని బాస చేసుకున్నారు.. చేతిలో చెయ్యేసి జీవితాంతం సంతసించాలని కలలు కన్నారు.. కానీ ప్రేమించిన వారిని కాదని పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేశారు.. ప్రేమించిన వాడికి దూరం కావడం తట్టుకోలేకపోయారు.. దీంతో ఇష్టమైన వాడితో కలసి జీవించలేకపోయారు.. కనీసం తనతో కలసి తనువైనా చాలించాలని నిర్ణయించుకున్నారు.. తమ ప్రేమను బతికించుకునేందుకు బలవన్మరణానికి సిద్ధపడ్డారు. మామునూరు/దేవరకద్ర/ఖమ్మంక్రైం: వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మన్నె సాయికుమార్(23) ఢిల్లీలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బసవపురం గ్రామానికి చెందిన తాటిపాముల అశ్విని(21) కూడా అదే కాలేజీలో చేరింది. అక్కడ వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అశ్విని తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాదు 5 నెలల కింద అశ్వినికి ఓ యువకుడితో పెళ్లి చేశారు. పెళ్లయినా కూడా తాను ప్రేమించిన సాయికుమార్‌ను అశ్విని మరిచిపోలేకపోయింది. తరచూ అతడితో ఫోన్లో మాట్లాడుతూ ఆవేదన చెందేది. అయితే గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సాయికుమార్‌ను కలిసేందుకు సిద్దిపేట నుంచి వరంగల్ చేరుకుంది. ఆ తర్వాత సాయికుమార్ తన స్నేహితుడి బైక్ తీసుకుని నక్కలపల్లి గ్రామానికి దూరంగా వెళ్లారు. గురువారం రాత్రి వరకు అక్కడే ఉండి, శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలోని ఐన కృష్ణస్వామికి చెందిన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇరువురూ విడిపోకుండా చున్నీని ఇద్దరూ తమ చేతులకు కట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కృష్టస్వామి బావి వద్దకు వెళ్లగా ఒడ్డున మంగళసూత్రం, రెండు ఫోన్లు, చెప్పులు, బైక్ ఉండటంతో మామునూరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా, బావిలో మృతదేహాలు కనిపించాయి. ఆ తర్వాత అశ్విని, సాయికుమార్ మృతదేహాలను బయటికి తీయించారు. మరో జంట ఆత్మహత్యాయత్నం.. ఖమ్మం పట్టణంలోని మహిళా పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రఘునాథపాలెం మండలం చిమ్మపూడికి చెందిన వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియటంతో సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి ఆమెకు పెళ్లి చేశారు. అయినా ఆ యువతి వెంకటేశ్వర్లును మర్చిపోలేకపోయింది. ఈ క్రమంలో వారం కిందట వెంకటేశ్వర్లు ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో యువతి భర్త మునగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అప్పటినుంచి వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే శుక్రవారం ఆ జంట.. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఖమ్మం మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఉన్న సీఐ కాసేపటి తర్వాత మాట్లాడుదామని చెప్పారు. అంతలోనే వారు తమతో పాటు తెచ్చుకున్న మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పగా, వారిద్దరినీ వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పురుగుల మందు తాగి.. తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని లంకాలకు చెందిన ఉప్పరి శేఖర్ (23), బోయ అనూష (14) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 16 ఉదయం ఇంటి నుంచి ఇద్దరూ వెళ్లిపోయి.. చిన్నచింతకుంట మండలం ఉంద్యాల శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం అటువైపు వెళ్లిన కొందరు వీరి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిద్దరూ పురుగుల మందు తాగి చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మినీ ఇండియా.. కృష్ణా
నారాయణపేట జిల్లా సరిహద్దులో ఉన్న కృష్ణాలో విభిన్న సంస్కృతులు, వివిధ ప్రాంతాలు, కులాలు, మతాలు, ఆచార అలవాట్లు, సంస్కృతి, వేషధారణలు ఉన్న వారు నివసిస్తుంటారు. ఇలాంటి వారు ఒకేచోట, ఒకే గ్రామంలో కనిపించడం చాలా అరుదు. ఈ గ్రామంలోని వారంతా వలస వచ్చిన వారే కావడం విశేషం. అందుకే ఈ గ్రామాన్ని ’మినీ ఇండియా’గా అభివర్ణిస్తారు. సాక్షి, కృష్ణా: ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు 1907లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కృష్ణానదిపై వంతెన నిర్మించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రా నుంచి ఇటువైపు ఉన్న కర్ణాటక, తమిళనాడు వరకు రైలు సౌకర్యం ఏర్పడింది. అదే సమయంలో ఇటువైపు ఉన్న తెలంగాణలోనూ ఓ రైల్వేస్టేషన్ ఉండాలనే తలంపుతో నది పక్కనే ఏర్పాటుచేశారు. జిల్లాలోనే ఈ రైల్వేస్టేషన్ మొదటిది. ఉమ్మడి ఆంధ్రద్రదేశ్‌లో సికింద్రాబాద్ తరువాత రెండో అతిపెద్ద రైల్వేస్టేషన్, బ్రాడ్‌గేజ్ కలిగిన స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో అప్పట్లో ఊరు, ఇళ్లు లేదు. కేవలం రైల్వే ఉద్యోగులు మాత్రమే ఇక్కడ నివసిస్తుండేవారు. వారిలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉండటం, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగ విరమణ తరువాత కూడా ఇక్కడే ఉండటంతో కాలక్రమేణ అది ఓ గ్రామంగా, కృష్ణానది ఒడ్డున ఉండటంతో అది కాస్త కృష్ణా గ్రామంగా మారిందని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. 1911లో హైదరాబాద్ మొదటి తాలుక్దార్ (కలెక్టర్) గోవింద్‌నాయక్ తన భార్య రంగుబాయి జ్ఞాపకార్థం తిరుపతి నుంచి ఓ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి కృష్నానది ఒడ్డున ప్రతిష్ఠించాడు. పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మహదేవ్ దీక్షిత్, నారాయణభట్, రాఘవేంద్రచారి, గణపతిభట్, భీమాచారి అనే బ్రాహ్మణులను నియమించి వారి భృతి కోసం కొంత భూమిని కేటాయించారు. ఆ కుటుంబాలకు చెందిన వారే ఇప్పుడు వందల సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ కర్మకాండలు, నిత్యకర్మ, సావత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీరు నివసించే వీధిని ధర్మశాలగా పిలుస్తున్నారు. కర్మకాండలకు ప్రసిద్ధి చెందిన వాటిలో మొదటిది వారణాసి (కాశి) కాగా రెండోది కృష్నాగా చెప్పవచ్చు. రోజు వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో కర్మకాండలు, అస్తికలు, చితాభస్మం నదిలో కలిపేందుకు ఇక్కడకు వస్తుంటారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అస్థికలను కూడా ఇక్కడే నిమజ్జనం చేశారు. జైనులు, రాజ్‌పుత్‌లు, మరాఠాలు.. 70 ఏళ్ల క్రితం జైనులు రాజస్థాన్ నుంచి ఇక్కడకు వ్యాపార నిమిత్తం వలస వచ్చారు. 25 ఏళ్ల క్రితం 100 మంది ఉంటే ఈ రోజు రెండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో తాము ఇతర రంగాల వైపు వెళ్లాల్సి వచ్చిందని ఆ కుటుంబాలవారు చెబుతున్నారు. రాజ్‌పుత్‌లు మహారాష్ట్ర నుంచి ఇక్కడకు రైల్వే ఉద్యోగులుగా 75 ఏళ్ల క్రితం వచ్చారు. ఒక్క కుటుంబం నుంచి సుమారు 10 కుటుంబాలు అయ్యాయి. 20 ఏళ్ల క్రితం 100కు పైగా ఉండగా ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారు. మరాఠాలు కూడా రైల్వే ఉద్యోగులుగా వచ్చారు. కొందరు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తుండగా మిగిలిన వారు కిళ్లి కొట్టు, సప్లయింగ్ కంపెనీ తదితర వ్యాపారాలు చేస్తున్నారు. అగర్వాల్స్, ముస్లింలు అగర్వాల్స్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి 80 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం వచ్చారు. హోటల్స్, స్వీట్ దుకాణాలు, ధాన్యం కొనుగోలు తదితర వ్యాపారం చేసేవారు. 30 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ముస్లింలు రజకార్ల పాలనలో వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చారు. అప్పట్లో సుమారు 800 మంది ఉండగా ప్రస్తుతం 400 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లారని అంటున్నారు. -
అడ్డొస్తే ట్రాక్టర్లతో తొక్కేస్తాం!
మరికల్ (నారాయణపేట): ‘ఇసుక ట్రాక్టర్లకు అడ్డువస్తే వాటితోనే తొక్కించుకుంటూ వెళ్తాం..’అంటూ గ్రామస్తులను ఇసుక మాఫియా హెచ్చరించింది. అయితే.. వారి తాటాకు చప్పుళ్లకు భయపడకుండా గ్రామస్తులు తిరగబడడంతో ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ఈ సంఘటన శనివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారంలోని మన్నెవాగు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. మన్నెవాగు నుంచి నెల రోజుల నుంచి ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. సమీపంలోని మన్నెవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపుతో చుట్టుపక్కల వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పడిపోతోంది. కాగా, శనివారం ఉదయం ఇసుక కోసం ఈ వాగులోకి వచ్చిన సుమారు పది ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. రెచ్చిపోయిన ఇసుక వ్యాపారులు ‘మంచి మాటలతో చెబుతున్నాం. అడ్డు రాకండి.. అడ్డొస్తే ట్రాక్టర్లతో తొక్కిస్తాం..’అంటూ బెదిరించారు. అయితే గ్రామస్తులు తిరగబడటంతో ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ఈ క్రమంలో వాగులోని నీటిగుంతలో కొన్ని వాహనాలు ఇరుక్కుపోయాయి. ఈ విషయాన్ని తహసీల్దార్, పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరు అక్కడికి రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాగులో నుంచి ఇసుకను అమ్ముకుంటున్న వారితో పాటు అనుమతి లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న వారిపైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతువేదికలు, శ్మశానవాటికలకు మాత్రమే ఇసుకకు అనుమతి ఇచ్చాం. ఒకవేళ ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామస్తులను భయాందోళనలకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, మరికల్ -
కృష్ణా నదిలో పుట్టి మునక.. నలుగురు గల్లంతు
సాక్షి, నారాయణపేట : జిల్లాలోని మక్తల్ మండలం పసుపుల గ్రామం వద్ద సోమవారం కృష్ణానదిలో పుట్టి మునిగిన దుర్ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. పుట్టిలో ప్రయాణించిన వారు కర్ణాటకలోని కురంగడ్డ ప్రాంతానికి చెందినవారు. నిత్యావసర సరకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న పుట్టి మునిగింది. గల్లంతైనవారు సుమలత, రోజా, చిన్నక్క, నర్సమ్మగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ చేతన ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. (వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు) భారీ వర్షాలతో కృష్ణానదిలో రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గల్లంతైన వారి ఆచూకీపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదే ప్రాంతంలో వల్లభాపురం దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం నిత్యం భక్తులు పుట్టిల్లోనే ప్రమాదకర ప్రయాణం కొనసాగిస్తుంటారు. -
మెరిసిన ‘పేట’ తేజం
నారాయణపేట రూరల్/జడ్చర్ల టౌన్ : వలసలు.. వెనుకబాటుకు మారుపేరుగా ఉన్న నారాయణపేట జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. తాజాగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో పేటకు చెందిన రాహుల్ ఆలిండియాలో 272వ ర్యాంకు సాధించారు. రిటైర్డ్ పీఈటీ నర్సింహులు, హిందీ టీచర్ శశికళ దంపతుల కుమారుడైన రాహుల్ పదో తరగతి వరకు నారాయణపేటలోనే విద్యాభ్యాసం చేశారు. 2016లో ఏఈగా ఎంపికైనా ఆయన సివిల్స్ సాధించేందుకు రెండేళ్లు లాంగ్‌లీవ్ పెట్టి అనుకున్నది సాధించారు. మరోవైపు జడ్చర్ల మండలం చాకలిగడ్డతండా వాసి శశికాంత్‌కు 764వ ర్యాంక్ వచ్చింది. -
ఇక టెలీ మెడిసిన్..
నారాయణ పేట: లాక్డౌన్ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా టీ కన్సల్ట్ ప్రాజెక్టు ద్వారా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సమగ్ర టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ కన్సల్ట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును శ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రారంభించి కలెక్టర్ దాసరి హరిచందనకు ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేస్తూ శ్రీకారం చుట్టారు. టీటా నేతృత్వంలో.. జిల్లాలో ఇప్పటికే టీటా వివిధ కార్యక్రమాలను చేపట్టింది. జిల్లాలోని ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో తమ జిల్లాలో టెలీమెడిసిన్ సేవలు ప్రవేశపెట్టాలని కలెక్టర్ హరిచందన టీటా గ్లోబల్ ప్రసిడెంట్ సందీప్‌కుమార్‌ను కోరడంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా.. రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను అందించేందుకు టెలీ మెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ మండలంలో 39 గ్రామాలు ఉండగా.. అందులో ఇదివరకు 17 గ్రామాల్లో సేవలు కొనసాగుతున్నాయి. వైద్య సేవలు ఇలా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో వ్యక్తులు బయటికి రావొద్దని ఆదేశాలు ఉండటంతో వాటిని గౌరవించడంతో పాటుగా మెరుగైన వైద్య సేవలు సామాన్యులకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా చేరువ కానున్నాయి. టెలీమెడిసిన్ సేవలు అందించడంలో భాగంగా ఆన్లైన్ విధానం ద్వారా సంబంధిత ప్రత్యేక అధికారులు తమ అందుబాటులోని సమయం పేర్కొంటారు. దానికి అనుగుణంగా ప్రజలు అపాయింట్మెంట్ పొందుతారు. అనంతంర సంబంధిత డాక్టర్, గ్రామస్తుడు ఆన్లైన్ ద్వారా కన్సల్ట్ అవుతారు. వీరిద్దరి మధ్య జరిగిన టెలీ మెడిసిన్ ప్రక్రియ అనంతరం ప్రిస్కిప్షన్ సైతం ఆన్లైన్ ద్వారా సంబంధిత గ్రామస్తులకు వాట్సాప్ ద్వారా చేరుతుంది. నోడల్అధికారి పంచాయతీ కార్యాలయంలో ఉంటూ సేవలు అందిస్తారు. ఈ వీడియో కనెక్ట్ ప్రక్రియకు సమన్వయం చేస్తారు. క్లినికల్స్ సంస్థ టెక్నాలజీ సాయంతో.. దేశంలోనే పూర్తిస్థాయిలో మొదటిసారిగా ఒక మండలాన్ని టెలీమెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన క్లినికల్స్ సంస్థ టెక్నాలజీ సాయం అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పంచాయతీ కార్యాలయం నోడల్ కార్యాలయంగా ఉండగా.. పంచాయతీ కార్యదర్శి నోడల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. అందుబాటులో 96 మంది డాక్టర్లు వివిధ రోగాలను ప్రజలకు ఆన్లైన్లో నివృత్తి చేస్తూ.. వైద్య సేవలను అందించేందుకు 96 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. గైనకాలజిస్ట్, డెంటిస్ట్, న్యూరాలజిస్ట్, ఈఎన్టీ, కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, డయాబెటిస్, గ్రాస్టాలజిస్ట్, తదితర ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. జిల్లా అంతటా విస్తరింపజేస్తాం.. మక్తల్ మండలంలో ప్రాజెక్టు ఫలితాలు అధ్యయనం చేసిన తర్వాత జిల్లాలోని మిగతా 10 మండలాల్లో విస్తరింపజేసేందుకు కృషిచేస్తాం. మక్తల్ ప్రజలు ఈ సేవలు అందుకునేందకు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలి. కరోనా నియంత్రణకు ఇంటినుంచి బయటికి రాకుండా ప్రతిఒక్కరూ సహకరించాలి. లాక్డౌన్ సమయంలో ఈ సేవలు చాలా ప్రయోజనకరంగా ఉంది. – హరిచందన, కలెక్టర్, నారాయణపేట ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా.. లాక్డౌన్లో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా టెలీ మెడిసిన్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మక్తల్ మండలంలో 250 మందికి వైద్య సేవలను అందించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. పల్లె సీమల్లోని ప్రజలకు ఈ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం. – సందీప్ కుమార్ మక్తాల, టీటీ గ్లోబల్ ప్రసిడెంట్ -
కేసీఆర్ ముస్లిం నమ్మక ద్రోహి: డీకే అరుణ
సాక్షి, నారాయణపేట: మక్తల్, నారాయణపేటలో బీజేపీకి గట్టి పట్టు ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అందుకే మక్తల్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని సోమవారం బీజేపీ కైవసం చేసుకుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం సహజమన్నారు. సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల ముందు బీజేపీ గెలిచే స్థానాల్లో ముస్లింల ఓట్లు రాబట్టుకునేందుకు.. ఎన్ఆర్సీ, సీఏఏల పేరు తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. (బీజేపీ నైతికంగా విజయం సాధించింది) సీఎం కేసీఆర్‌కు దేశం గురించి గాని, దేశ భద్రత గురించి అవసరం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఎన్ఆర్సీ చట్టం తీసుకుచ్చిన తర్వాత ముస్లింల గురించి మాట్లాడున్నాడంటే కేసీఆర్ ఎంత నమ్మక ద్రోహి అనేది ముస్లింలు గమనించాలి. బైంసా సంఘటన జరిగినప్పుడు సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని అరుణ ప్రశ్నించారు. ప్రజలు తలలు పగలగొట్టుకున్నా, చచ్చినా తనకు సంబంధం లేనట్లు వ్యవహరించారని ఆమె ధ్వజమెత్తారు. అప్పుడు నోరుమెదపని కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఎందుకు మాట్లాడారని అరుణ సూటిగా ప్రశ్నించారు. -
మహబూబ్‌నగర్ ఆస్పత్రి వద్ద క్షణం క్షణం ఉత్కంఠ
సాక్షి, మహబూబ్‌నగర్: క్షణం క్షణం ఉత్కంఠ భరితం. కుయ్... కుయ్ అంటూ మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రికి చేరుకుంటోన్న అరగంటకో వాహనం.. ఏ వాహనంలో ఎవరు..? ఎప్పుడొస్తున్నారో తెలియదు. ప్రతి వాహనంలో వస్తున్న పోలీసు అధికారులకు స్థానిక డీఎస్పీ, ఇతర అధికారుల సెల్యూట్. గేటు ముందు వాహనాలు నిలిపి.. ఆస్పత్రిలోకి వెళ్లిన అధికారులు. కొందరు ఫోరెన్సిక్ నిపుణులంటే.. ఇంకొందరు ఇంటెలిజెన్స్ అధికారులని పోలీసుల చర్చలు. ఆస్పత్రి చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు. ఇంతకు జిల్లాస్పత్రిలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గుమికూడిన జనం..! జిల్లా ఆస్పత్రి వద్ద జనం ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.40గంటల వరకు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన పోలీసులు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుల మృతదేహాలకు పూర్తయిన పోస్టుమార్టం. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రి ముందు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు నడిచిన హైడ్రామా. ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’ నిందితుల పోస్టుమార్టం ఉమ్మడి జిల్లా పోలీసులకే కాదూ హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసు అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎప్పుడు ఏమవుతుందో అనే ఉత్కంఠతో పోలీసులు అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించారు. అక్కడా..? ఇక్కడా..? రంగారెడ్డి షాద్‌నగర్ చటాన్‌పల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని ప్రసార మాద్యమాల్లో తెలుసుకున్న పాలమూరు ప్రజలు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున జిల్లాస్పత్రికి చేరుకున్నారు. దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి.. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో సుమారు వంద మంది పోలీసులతో గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పోలీసు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రధాన ద్వారం నుంచి పోస్టుమార్టం వరకు ఉన్న మార్గాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్న పోలీసులు ఎవరినీ అటు వైపు వెళ్లనీయలేదు. రెండు గంటల ప్రాంతంలో నిందితులకు ఎన్కౌంటర్ స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. మృతుల తల్లిదండ్రులను ఓదారుస్తున్న వనపర్తి ఎస్పీ అపూర్వరావు సాయంత్రం 3.10 గంటలకు జిల్లాస్పత్రికి చేరుకున్న ఎస్పీ మృతదేహాలను మహబూబ్‌నగర్‌కే తీసుకువస్తున్నారని.. అందరూ సిద్ధంగా ఉండాలని పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో ఉదయం నుంచి అప్పటి వరకు ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులు, మృతదేహాలు వస్తే ఏవైనా శాంతిభద్రతలు తలెత్తుతాయా..? అలాంటి పరిస్థితి రాకుండా ఇంకేం చేద్దామని డీఎస్పీలతో చర్చించారు. 3.40 గంటల ప్రాంతంలో ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న సాధారణ జనంతో పాటు మీడియాను సైతం ప్రధాన గేటు బయటికి పంపించేశారు. ఆస్పత్రి అంతా పోలీసుల హడావిడి మొదలవడం.. మీడియా రోడ్డుపైకి రావడంతో ఆ మార్గాన వెళ్లే జనం ‘దిశ’ నిందితుల మృతదేహాలను చూసేందుకు ఆగింది. దీంతో తేరుకున్న పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గుమికూడిన జనాన్ని బలవంతంగా అక్కడ్నుంచీ పంపించేశారు. సుమారు 40మీటర్ల వరకు పోలీసులు పహారాగా నిలిచారు. మరోవైపు పోస్టుమార్టం నిర్వహించే సమయంలో జిల్లాకు చెందిన వైద్యులను పోలీసులు అనుమతించలేదు. -
ఎన్‌కౌంటర్‌తో జక్లేర్, గుడిగండ్లలో ఉలిక్కిపాటు
సాక్షి, నారాయణపేట: వారం రోజుల ముందు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు పట్టికుపోయిండ్రు తండ్రో.. మళ్లీ శుక్రవారం తెల్లవారుజామునే పోలీసుల ఎన్కౌంటర్లో చేతిలో సచ్చి శవమైతిరో బిడ్డో.. అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దిశను హత్య చేసిన నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో హతమవడంతో దేశమంతా ప్రజలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా.. నిందితుల స్వగ్రామాలైన మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్‌లో ఒక్కసారిగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నిశ్శబ్దం.. విచారంతో కూడిన గంభీరమైన వాతావరణం కనిపించింది. మృతిచెందిన ఆ నలుగురి ఇళ్ల దగ్గర కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కుటుంబాలను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఆ నలుగురిని పట్టుకొని వెళ్లినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో కుటుంబీకులు ఉన్నారు. ఆ నలుగురు చేసిన పాడుపనితో జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు చెడ్డపేరు వచ్చిందని, ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం.. ఆడపిల్లలకు భవిష్యత్‌కు భద్రత కల్పిస్తుండడంతో స్వాగతిస్తున్నామంటూ పలువురు బహిరంగంగానే హర్షం వ్యక్తపరిచారు. ఆ నలుగురు కుటుంబాల తల్లిదండ్రులు తప్ప ఇతరులు అయ్యో పాపం అన్న పాపానపోలేదు. సెల్యూట్.. పోలీస్ నారాయణపేట: పశువైద్యురాలు ‘దిశ’ను అత్యంత అమానవీయంగా హతమార్చిన దుర్మార్గులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా మృగాళ్లకు సరైన శిక్షే పడిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నిందితుల స్వగ్రామాల్లోనూ ప్రజలు ఈ ఘటనను స్వాగతిస్తుండగా.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం ఒకింత ఆవేదనకు గురయ్యారు. నిందితులు మహ్మద్‌పాషా అలియాస్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్‌కుమార్, చింతకుంట చెన్నకేశవులు ఎన్కౌంటర్ అయ్యారని శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తెలియడంతో మక్తల్ మండలంలోని జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో చర్చనీయాంశమైంది. టీవీలు, వాట్సప్‌లో ఈ వార్త రాగానే వారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆ నలుగురి కుటుంబీకులు రోదించసాగారు. మా కొడుకులతో ఒక్కసారైనా మాట్లాడకుండా.. చూడకుండా చంపేశారా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. గ్రామాలకు చేరుకున్న పోలీసులు గుడిగండ్లలో నిందితుల ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితి.. నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, నారాయణపేట డీఎస్పీ మధుసూదన్‌రావుతోపాటు పోలీస్ అధికారులు గుడిగండ్ల, జక్లేర్‌కు హుటాహుటిన చేరుకున్నారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దామరగిద్ద, మక్తల్, కృష్ణ, మాగనూర్, వనపర్తి, మరికల్, నారాయణపేటల నుంచి ప్రత్యేక వాహనాల్లో పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాల్లో భారీగా సిబ్బంది రావడంతో ఆయా గ్రామాల్లో జనం ఎక్కడికక్కడే చూస్తూ మిన్నంకుండిపోయారు. శవాల వద్దకు కుటుంబీకులు దిశ హత్యలో నిందితులైన జక్లేర్ మహ్మద్‌పాషా అలియాస్ ఆరీఫ్ తండ్రి హుస్సేన్‌ను పోలీసులు ప్రత్యేక వాహనంలో పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉందని షాద్‌నగర్‌కు తరలించారు. అలాగే గుడిగండ్లలోని నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మయ్యలను సైతం తీసుకెళ్లారు. పీనిగెలు తెచ్చి మా చేన్లో పూడ్చొద్దు మాకు ఉన్నదే రెండు ఎకరాల పొలం. పీనిగెలు మా పొలంలోనే పోతయి. అక్కడ తెచ్చి పూడుస్తామంటే ఊరుకోమంటూ గుడిగండ్ల గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పెద్దలతో మ్యాకల వెంకటమ్మ వాదనకు దిగింది. మేం పంటలు ఎలా పండించుకోవాలి చెప్పండి అంటూ వాపోయింది. ఊరూరికి పీనిగెలు పెట్టేందుకు శ్మశాన వాటిక ఉంది. ఈ ఊర్లో మాత్రం లేదు. మా పొలంలోనే పూడుస్తరు. గుంతలు తవ్వినా పూడ్చివేస్తానంటూ తేల్చిచెప్పింది. దీంతో గ్రామపెద్దలు ఆమెను సముదాయించి అక్కడ పూడ్చరు అని చెప్పడంతో శాంతించి వెళ్లిపోయింది. క్షణం.. క్షణం శివ ఇంటి వద్ద పరిస్థితి: వనపర్తి ఎస్పీ అపూర్వరావు 11.13 గంటలకు వనపర్తి ఎస్పీ అపూర్వరావు పోలీస్ బందోబస్తుతో గుడిగండ్ల గ్రామానికి చేరుకున్నారు. 11.20 గంటలకు నిందితుడు శివ ఇంటికి చేరుకొని వారి తల్లిదండ్రుల గురించా ఆరా. తండ్రి రాజప్ప గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నారని తెలుసుకుని ఆయనను తీసుకెళ్లి పోలీస్ వాహనంలో కూర్చోబెట్టాలని పోలీసులకు సూచన. 11.25 గంటలకు గుడిగండ్ల ప్రధాన రహదారిపై చేరుకున్న ఎస్పీ. గ్రామంలో పరిస్థితిపై నిశిత దృష్టి. గ్రామంలోని పెద్దలు ఏమంటున్నారో డీఎస్పీ మధుసూదన్‌రావుతో వివరాల సేకరణ. 11.30 గంటలకు చెన్నకేశవులు తండ్రి కుర్మన్న, గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న రాజప్పను పోలీస్ వాహనంలో ఎక్కించి ముందుగా మరికల్ పోలీస్‌స్టేషన్ తరలింపు. 11.35 గంటలకు నిందితుడు నవీన్ ఇంటికి ఎస్పీ చేరుకొని తల్లి లక్ష్మికి ఓదార్పు. అనంతరం ప్రత్యేక బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో షాద్‌నగర్‌కు తరలింపు. 11.40 గంటలకు గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు పర్యవేక్షించాలని డీఎస్పీ, సీఐలకు ఎస్పీ సూచన. అనంతరం మరికల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎస్పీ. మాట్లాడాలని ఉండే.. నేను అయినా ఆడపిల్లనే కదా. తప్పు చేసిన శివతోపాటు ఆ ముగ్గురిని పోలీసులు శిక్షించిన తీరు బాగానే ఉంది. కానీ, మా అమ్మానాన్న మణెమ్మ, రాజప్పలకు ఒక్కసారి మా తమ్ముడు జొల్లు శివతో మాట్లాడాలని ఆశ ఉండే. చూడండి.. గత వారం రోజులుగా తిండి తిప్పలు మాని అనారోగ్యం బారినపడ్డారు. మానసికంగానూ ఎంతగానో కుంగిపోయారు. ఇప్పుడు మా తల్లిదండ్రులను పట్టించుకునేదెవరు. మా తమ్ముడుని కనడమే వీరు చేసిన పాపం అయినట్టుంది. ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. – రాజేంద్రమ్మ, శివ అక్క మంచి నిర్ణయం దిశను దారుణంగా హత్య చేసిన ఆ నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం మంచి నిర్ణయమే. చెడ్డపని చేస్తే ఇలాంటి చర్యలు ఉంటాయని యువతకు బాగా తెలిసివచ్చింది. – జక్కప్ప, గుడిగండ్ల, మక్తల్ మండలం ఇది గుణపాఠం.. ఆడపిల్లలపై అఘాయిత్యాలు, మహిళలపై అత్యాచారాలు చేస్తే చట్టరీత్యా కఠిన శిక్షలు పడుతాయనే దానికి ఇదే నిదర్శనం. దిశను కిరాతకంగా పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన స్థలంలోనే ఆ నలుగురిని తీసుకెళ్లి విచారిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం సబబే. చెడు ఆలోచనలు చేసే వారికి ఇది ఒక గుణపాఠం కావాలి. – వెంకటయ్యగౌడ్, జక్లేర్, మక్తల్ చెడ్డపేరు తెచ్చారు.. దిశపై అత్యాచారం చేసి హత మార్చిన మహ్మద్‌పాషా, నవీన్, శివ, చెన్నకేశవులు చేసిన పనికి జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు చె డ్డపేరు వచ్చింది. తప్పించుకుపోయేందుకు ప్రయత్నించిన ఆ నలుగురిని పోలీసులు కాల్చిచంపడం స రైందే. ఇకపై యువత ఇలాంటి పనులకు దూరంగా ఉండేందుకు ఈ ఎన్కౌంటర్ గుణపాఠమైంది. – నర్సింహులు, సర్పంచ్, జక్లేర్, మక్తల్ మాకు ధైర్యం వచ్చింది నాకు ఇద్దరు ఆడపిల్లలు. హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఆడపిల్లలపై అత్యాచారం, హత్య చేస్తే వారిని అంతే దారుణంగా పోలీసులు కాల్చి చంపుతారనే ఆ నలుగురి ఎన్‌కౌంటర్‌తో ద్వారా ధైర్యం వచ్చింది. ఇప్పుడైనా ఆడపిల్లలపై ఇలాంటి పాడుపనులకు పాల్పడవద్దని కోరుకుంటున్నా. – లక్ష్మి, జక్లేర్, మక్తల్ -
ఉలిక్కిపడ్డ నారాయణపేట
నారాయణపేట/మక్తల్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని హత్య చేసిన నిందితులు నారాయణపేట జిల్లా వాసులుగా తేలడంతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్లకు చెందినవారే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని టీవీలు, సోషల్ మీడియాలో రావడంతో అక్కడి జనం విస్తుపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంట లకే మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్లకు వెళ్లిన షాద్‌నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం విషయం తెలియడంతో నవీన్, చెన్నకేశవులు కుటుంబ స భ్యులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. గుడిగండ్లకి చెందిన నవీన్, చెన్నకేశవులు, శివ కలిసి తిరిగేవారు. నవీన్‌కుమార్ ద్విచక్రవాహనంపై డేంజర్ అనే సింబల్ ఉంటుంది. ఈ హత్య గురించి తెలియడంతో ‘ఆ డేంజర్ గాళ్లా.. ఈ పని చేసింది’ అని గ్రామంలో చర్చించుకుంటున్నారు. బంక్‌లో పనిచేస్తూ లారీ డ్రైవర్‌గా పాషా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన హుస్సేన్, మౌలానీబీ దంపతుల కుమారుడు మహ్మద్ పాషా అలియాస్ ఆరిఫ్ పదో తరగతి వరకు చదివాడు. తొలుత పెట్రోల్ బంకులో పనిచేశాడు. తర్వాత హైదరాబాద్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస అయ్యాడు. ప్రియాంకను హత్య చేసిన తర్వాత గురువారం రాత్రి పాషా జక్లేర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ పోలీసులు వచ్చి పాషాను లేపి అదుపులోకి తీసుకున్నా రు. ఎందుకు తీసుకెళ్తున్నారని తల్లిదండ్రులు అడగడంతో.. ‘లారీకి యాక్సిడెంట్ జరిగింది.. అందుకే తీసుకెళ్తున్నారంటూ పాషానే చెప్పినట్టు అతడి తల్లిదండ్రులు తెలిపారు. మధ్యాహ్నం ప్రియాంకను మీ కుమారుడే హత్య చేశాడని గ్రామస్తులు చెప్పడంతో.. ‘మా వాడు మంచోడు.. ఎవరో ఇలా చేశారు’అంటూ విలపించారు. జులాయిగా నవీన్.. గుడిగండ్లకు చెందిన నవీన్ తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి నవీన్ జులాయిగా తిరిగేవాడని గ్రామస్తులు తెలిపారు. నవీన్ తన బైక్‌ను స్పోర్ట్స్ బైక్‌లా మార్చుకోవడంతోపాటు హెడ్‌లైట్ తీసేసి ఆ ప్లేస్‌లో డేంజర్ అని బొమ్మ వేసుకున్నాడు. చెన్నకేశవులు, శివలతో కలిసి జులాయిగా తిరిగేవాడు. కుటుంబ పోషణ భారం కావడంతో పాషాతో కలిసి నవీన్ కూడా లారీ క్లీనర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ఈ పాడు పనేంటి చెన్నకేశవా? గుడిగండ్లకు చెందిన జయమ్మ, కుర్మయ్యల ఒకే ఒక్క కుమారుడు చెన్నకేశవులు. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నవీన్‌తో పాటు చెన్నకేశవులు కూడా లారీ డ్రైవర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నకేశవులు భార్య గర్భిణి. పెళ్లయి ఇంట్లో భార్యను పెట్టుకుని ఈ పని చేశాడేంటి అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. జీతం తెస్తాడనుకుంటే జైలుకెళ్లాడు.. గుడిగండ్లకు చెందిన రాజప్ప, మణెమ్మ రెండో కుమారుడు శివ. నవీన్‌కుమార్, చెన్నకేశవులు, జక్లేర్‌కు చెందిన పాషాలు డ్రైవర్లు కావడంతో రెండు నెలల క్రితం వారి వద్ద క్లీనర్‌గా చేరాడు. కర్ణాటకలో గొర్రెల కాపరిగా పనిచేసే శివ తండ్రి ఈనెల 26న ఇంటికి వచ్చాడు. జీతం ఏమైందంటూ శివను అడగ్గా.. రెండు, మూడు రోజుల్లో తెస్తానని చెప్పి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. తిరిగి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. మావాడు జీతం తెచ్చి ఉంటాడని ఆ తల్లిదండ్రులు అనుకోగా.. తెల్లవారుజామున పోలీసులు వచ్చి తీసుకెళ్లడంతో హతాశులయ్యారు. -
ప్రియాంక హత్య కేసు; నిందితుల్లో ఒకడిది లవ్‌మ్యారేజ్
సాక్షి, మక్తల్: డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు కారణంగా తమ గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ వాసులు అంటున్నారు. తమ గ్రామానికి చెందిన ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ కుమార్ ఇంత ఘాతుకానికి పాల్పడ్డారంటే నమ్మలేకపోతున్నామని గ్రామస్తులు చెప్పారు. ఈ ముగ్గురు సొంతూరిలో బాగానే ఉండేవారిని, వారిపై ఎటువంటి ఫిర్యాదులు లేవని వెల్లడించారు. ఊళ్లో ఎక్కువగా కనబడేవారు కాదన్నారు. వీరి తల్లిదండ్రులు మంచివాళ్లేనని, కూలిపని చేసుకుని జీవిస్తున్నారని చెప్పారు. చెన్నకేశవులు ఐదు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. గుడిగండ్ల గ్రామంలో 60 మంది వరకు లారీల మీద పనిచేస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్య కేసులో లారీ నంబర్ ఆధారంగానే నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్ పాషాది గుడిగండ్ల పక్క గ్రామైన జక్లేర్. అతడి దగ్గర చెన్నకేశవులు, శివ, నవీన్ పనిచేస్తున్నారు. ఈ నలుగురు ప్రియాంక స్కూటర్ టైర్‌ను పథకం ప్రకారం పంక్చర్ చేసి తర్వాత ఆమెను ట్రాప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని గుడిగండ్ల, జక్లేర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. రెండు నెలల నుంచి లారీ క్లీనర్ పనిచేస్తున్నాడని శివ తండ్రి తెలిపాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వచ్చి పోలీసులు తమ కుమారుడిని తీసుకెళ్లారని చెప్పాడు. ఊరిలో మంచిగానే ఉండేవాడని, ఎటువంటి చెడు పనులు చేయలేదని వివరించాడు. ఆవారా తిరుగుతుండటంతో తాను తిట్టేవాడినని, దాంతే మహ్మద్ పాషా వద్ద క్లీనర్‌గా చేరాడని వెల్లడించాడు. తన కొడుకు మైనర్ అని, అతడి వయసు 17 ఏళ్లు మాత్రమేనని తెలిపాడు. ప్రియంకారెడ్డి హత్యకేసులో ఉన్న నిందితుల్లో ఒక్కొక్కరిది ఒక్క భిన్న మనస్తత్వం కలిగి ఉన్నారు. నిందితుల్లో ముగ్గురు 20 సంవత్సరాలు కూడా దాటని వారున్నారు. ఇందులో నవీన్ కుమార్ ఓ భిన్నమనస్తత్వం కలిగి ఉన్నాడు. తన మామూలు బైక్ ను స్పోర్ట్స్ బైక్‌లా మార్చుకున్నాడు. అంతే కాదు హెడ్ లైట్ తీసేసి దాని స్థానంలో డేంజర్ అని బొమ్మ వేసుకున్నాడు. ఇక టైగర్ బొమ్మలతో పాటు, వివిధ క్యాప్షన్లతో బైక్ తయారు చేసుకుని, రంద్రాలు పెట్టిన సైలెన్సర్ సౌండ్‌తో గ్రామంలో హల్ చల్ చేసేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. సంబంధిత వార్తలు... ప్రియాంక హత్య.. గుండె పగిలింది నమ్మించి చంపేశారు! భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! -
లిఫ్ట్ ఇస్తానని నమ్మించి..
సాక్షి, మరికల్ (నారాయణపేట): బైక్‌లపై లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికి..అనంతరం కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్న సైకోలతో మండలంలో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల వారి నుంచి ఇద్దరు విద్యార్థులు తప్పించుకున్న సంఘటనలు మండలంలో కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వెంకటాపూర్‌కి చెందిన జి.రాకేష్ అనే విద్యార్థి మరికల్‌లోని ఓ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల వదిలిన తర్వాత బస్సులో వెళ్లి వెంకటాపూర్ స్టేజీ దగ్గర దిగగా.. అక్కడే కాపు కాచుకొని ఉన్న ఓ వ్యక్తి మోటర్ సైకిల్‌పై వచ్చి ఊర్లోకి వెళ్తున్నా.. లిఫ్ట్ ఇస్తా రమ్మంటూ బైక్‌పై ఎక్చించుకొని.. మాయమాటలు చెప్పి తన బైక్‌ను ముళ్లచెట్లలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ విద్యార్థి దుస్తులను విడిపించి కత్తి తీసి చంపేందుకు యత్నించాడు. రాకేష్ అరుపులు కేకలు వేస్తూ.. ఆ వ్యక్తి నుంచి బలవంతంగా తప్పించుకొని నగ్నంగా రోడ్డుపైకి పరుగులు పెట్టి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇది గమనించిన పక్కనే ఉన్న రైతులు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడని రైతులు తెలిపారు. ఈ ఘటనతో విద్యార్థి భయాందోళనకు గురై కళాశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఆర్నెళ్ల క్రితం మరో ఘటన గత ఆర్నెళ్ల క్రితం సైతం మరికల్‌కు చెందిన కేశవ్ అనే విద్యార్థిని మరికల్ పెట్రోల్ బంకు దగ్గర బైక్‌పై ఎక్కించుకొని సంపత్ రైస్‌మిల్ పక్కన ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి దుస్తులను విడిపించి చంపేందుకు యత్నించాడు. దీంతో కేశవ్ ధైర్యం చేసి ఆ వ్యక్తిని కిందకు తొసి రైస్‌మిల్ ప్రహరీ దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ రెండు సంఘటనలు ఒకే విధంగా జరగడంతో ఇదంతా చేస్తుంది ఒక్కరేనా.. లేక పిల్లలను కిడ్నప్‌కు చేసే ముఠా ఉందా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మా దృష్టికి రాలేదు ఇద్దరు విద్యార్థులను సైకోలు ఎత్తుకెళ్లి హత్యకు యత్నించారన్న విషయంపై బాధితులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదు. అనుమానితులు ఎవరైనా గ్రామాల స్టేజీ దగ్గర కానీ, ఎక్కడైనా సరే బైక్‌లు ఎక్కమని అడిగితే విద్యార్థులు, బాలికలు ఎవరు కూడా ఎక్కరాదు. అలాంటి వ్యక్తులు ఎదుట పడితే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలి. – జానకిరాంరెడ్డి, ఎస్ఐ, మరికల్ -
లక్ష్యం చేరని చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం
ఎగువ పరీవాహక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు కావాల్సినంత నీరు వచ్చి చేరింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ఎత్తిపోతల పథకాలు విజయవంతంగా సాగుతున్నాయి. దీంతో ఆయకట్టు దారులు ఈ ఏడాది రెట్టింపు సాగు చేశారు. కానీ నర్వ మండలంలోని చంద్రఘడ్ ఎత్తిపోతలను పాలకులు, అధికారులు విస్మరించడంతో ఈ ప్రాంత రైతులకు నిరాశే మిగిలింది. సాక్షి, నారాయణపేట: రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం డీలా పడిపోయింది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా సాగునీరుకు నోచుకోక వేల ఎకరాలన్ని బీడు భూములుగా మారాయి. మండలానికి మంజూరైన ప్రధాన ఎత్తిపోతలు చంద్రఘడ్, కొండాదొడ్డి ఎత్తిపోతల పథకాలు కాంట్రాక్టుల కక్కుర్తికి ఏడాది కూడా నడవని పరిస్థితి దాపురించింది. కొండాదొడ్డి మూత పడగా, చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం పరిస్థితి కూడా అలాగే అయ్యేలా ఉంది. ముచ్చటగా మూడు లిఫ్టులు.. చంద్రఘడ్ ఎత్తిపోతలలో ప్రధానంగా మూడు లిప్టులు ఉన్నాయి. ఇందులో చంద్రఘడ్ కింద 5 వేల ఎకరాలు, నాగిరెడ్డిపల్లి కింద 5 వేలు, బెక్కర్‌పల్లి కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 2005 సంవత్సరంలో వీటి పనులను చేపట్టారు. ఇందుకుగాను ఒక్కో ఫేజుకు 5 వేల ఎకరాలతో 15 వేల ఎకరాల లక్ష్యంతో పనులను రూ.58 కోట్లు కేటాయించగా ఇందులో నాబార్డు ద్వారా రూ.36 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.18 కోట్లతో అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 18 నెలల గరిష్ట గడువుతో ఓ ప్రముఖ కంపెనీ పనులను చేపట్టింది. ఇందులో నాబార్డు ద్వారా రూ.36 కోట్లు మంజూరుకాగా ఈ నిధులతో పనులను చేపట్టిన కంపెనీ కృష్ణానది నిల్వ నీటి వద్ద పంప్‌హౌస్ నిర్మాణం, విద్యుత్ ఉపకేంద్రం, చంద్రఘడ్ పథకం మూడు దశలకు అందజేసే పంప్‌హౌస్‌కు పైప్‌లైన్ పనులు చేపట్టింది. అప్పట్లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రధాన కంపెనీ పనులు నాసిరకంగా చేయడంతో ప్రారంభంలో ట్రయల్ రన్‌లోనే చాలా చోట్ల పైపులు పగిలిపోయాయి. నిధుల అడ్డంకితో.. నాబార్డు ద్వారా మంజూరైన రూ.36 కోట్లను సింహబాగం పైప్‌లైన్ కొనుగోలు కోసం ఖర్చుచేశారు. చిన్న నీటి పారుదల సంస్థ నుంచి నిధులు విడుదల జాప్యంతో కాంట్రాక్టర్లు పనుల కోసం అదనపు నిధులు వ్యయం చేశారు. దీం తో ఐడీసీ అధికారులు అనేక మార్లు నిధుల విడుదల కోసం ప్రతిపాదనలు పంపినా ఏడేళ్ళ వరకు నిధుల కేటాయింపులే లేవు. దీంతో అదనపు కేటాయింపులు లేక పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెనకాడారు. తదనాంతరం ప్రభుత్వం నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలకు రూ.4.76 కోట్లు, చంద్రఘడ్‌కు రూ.4.95 కోట్లు, బెక్కర్‌పల్లికి రూ.5.66 కోట్ల చొప్పున నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ గతంలో అదనపు పనుల చేసిన వాటికి బిల్లులు పోను మిగిలిన నిధులతో పనులను ప్రారంభించారు. 15 వేల నుంచి 9,770 ఎకరాలకు.. జీఓ ఆర్టి 986 ప్రకారం నవంబర్ 4, 2012న ప్రభుత్వం ఈ మూడు లిఫ్టుల ఆయకట్టును 15 వేల నుంచి 9,770 ఎకరాలకు తగ్గించింది. ఇందులో 9,770 ఎకరాల భూమి ఐడీసీ స్కీం, రాజీవ్‌భీమ లిఫ్టు సంగంబండ రిజర్వాయర్, భూత్పూరు రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్నదని గ్రహించి రెండు శాఖల సమన్వయం లేనందున ఈ జీఓ ద్వారా రాజీవ్ భీమ లిఫ్టు ఆధీనంలో కాలువలు పూర్తిచేసి ఐడీసీ వారికి ఇచ్చేందుకు ఆదేశాలు జారిచేసింది. రాజీవ్ భీమానా..? ఐడీసీనా..? రైతులు ఉన్న 9,770 ఎకరాల భూమికి ఐడీసీ నుంచో రాజీవ్ లిఫ్టు నుంచి నీరు కోరుకుంటే ఇందులో ఒక తిరకాసు ఉంది. ఐడీసీ నుంచి కాలువలు ఏర్పాటైతే పంట కాలువలకు భూమి నష్ట పరిహారం చెల్లించరు. రాజీవ్ లిఫ్టు నుంచి నీరు కోరుకుంటే రైతుల పొలాలకు నష్ట పరిహారం వస్తుంది. దీంతో రైతులు రాజీవ్‌లిఫ్టు వైపే మొగ్గు చూపారు. కానీ ల్యాండ్ యాక్వేషన్ లేకపోవడంతో నష్టపరిహారం రాదని పిల్లకాల్వల తవ్వేందుకు రైతులు ఉత్సాహం చూపడం లేదు. మేజర్ ఇరిగేషన్లో కలపాలి 1500 హార్స్‌పవర్స్ కలిగిన మోటర్లను రైతులే నిర్వహణ చేయాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ పథకాన్ని మేజర్ ఇరిగేషన్లో కలిపితేనే నిర్వాహణ సాధ్యమవుతుంది. కనీసం ఒక్క మాన్‌సూన్‌లోనైన పూర్తి ఆయకట్టుకు నీరు ఇవ్వలేక పోతున్నాం. దీంతో రైతులు నిర్వాహణకు డబ్బులు కట్టడం లేదు. ఎమ్మెల్యే నిధులను వాడుకునేందుకు అధికారులు ఎస్టిమేషన్ వేయడంలేదు. దీంతో అడుగడుగున లీకేజీలతో ఈ ఖరీఫ్‌లో సాగు కష్టమే అనిపిస్తుంది. – సత్యనారాయణరెడ్డి అధ్యక్షుడు, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకం -
ఎమ్మెల్యే పట్టించుకోరూ జర చెప్పన్నా..?
సాక్షి, నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రం వ్యవహర తీరుపై జిల్లాలోని ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అ న్నదాతలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మ ద్దతు ధరను ఇచ్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పా టు చేస్తే దళారులకు దారులు వేస్తారా అంటూ మార్క్‌ఫెడ్, ఊట్కూర్ సింగిల్ విండో అధికారులతో పాటు మార్కెట్ యార్డు అధికారులకు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే డైరెక్ట్‌గా ఫోన్ చేసి ఆ గ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఊట్కూర్ మండలంలో పెసర పంట ఏ మేరకు వేశారో తె లుసా.. ఆ మండలంలో పెసర ధాన్యం ఎంత వచ్చిందో వివరాలను పంపించాలని సదరు అధికారులకు హెచ్చరించినట్లు తెలిసింది. మీ రు తిరిగి కొనుగోలు కేంద్రం తెరిచినా దాదాపు 200 బస్తాల వరకు బోగస్ పెసర ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చినట్లు సమాచారం అందిందని మీరు ఏమి చేస్తున్నరంటూ అధికారులపై మండిపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని విచారణ చేపడుతున్న అధికారుల బృందంతో కట్టుదిట్టంగా చేయాలని కోరినట్లు సమాచారం. దళారులకు దారులు తెరిచిందెవరు? నారాయణపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఊట్కూర్ విండో ఉండడంతో మార్కెట్ పాలకవర్గంలో స్థానం కల్పించారు. విండో ప్రతినిధి సభ్యుడిగా ఉండడంతో వారికి పెసర కొనుగో లు కేంద్రం నిర్వహించేందుకు ఆదేశించారు. అయితే మార్కెట్ పాలకవర్గంలోని ఓ బడా ప్రతినిధితో పాటు మరో డైరక్టర్ వారికి సంబం ధం లేకున్నా కొనుగోలు కేంద్రంలో పెత్తనం చేలాయిస్తూ రైతుల అవతారమెత్తి విక్రయించేందుకు వచ్చిన దళారులకు దారులు తెరిచినట్లు ఆరోపణలున్నాయి. మార్కెట్‌యార్డు లోని ఓ డైరెక్టర్ మరో డైరెక్టర్‌తో చేతులు కలి పి వారి బంధువులు, శ్రేయోభిలాషుల పేరిటా పెసరను విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వీడియో హల్చల్పై ఎమ్మెల్యేల ఆరా వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలోని ప్రతినిధి చాంబర్లో చోటు చేసుకున్న వ్యవహరంపై ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. ఆ వీడియోలో ఏముంది.. అసలు మార్కెట్ యార్డులోని పెసర కొనుగోలు కేంద్రంలో ఏం అవుతుందని జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆరా తీసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో సైతం ఎమ్మెల్యేల దృష్టికి చేరింది. మన ఎమ్మెల్యే పట్టించుకోరూ జర చెప్పన్నా..? మన ఎమ్మెల్యే పట్టించుకోనేటట్లు లేరన్నా.. మీరైనా జర చెప్పండంటూ మార్కెట్ పాలకవర్గంలోని ఓ ప్రతినిధి మార్కెట్ మాజీ ప్రతినిధితో రాయబారం చేసినట్లు సమాచారం. మీరు చెబితే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే సైతం వింటారాన్న.. మీరు ఒక్కసారి ఈ హెల్ప్ చేయండంటూ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు మాజీ ప్రతినిధి సైతం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆ వ్యవహరం అంతే వదిలేయండి అంటూ సున్నితంగా తిరస్కరించినట్లు వినికిడి. పక్క ఎమ్మెల్యేకు ఈ విషయం తెలిపినా ఓ బాత్ చోడ్దేవ్.. దూస్రాబాత్ క్యాహై బోలో అన్నట్లు సమాచారం. పెసర కొనుగోలు కేంద్రం వ్యవహార తీరుపై ఎమ్మెల్యేలు గుర్రుమీదున్నట్లు తెలుస్తుంది. సీల్డ్ కవర్లో నివేదికలు పెసర కొనుగోలు కేంద్రంలో చోటు చేసుకున్న వ్యవహరతీరుపై కలెక్టర్ ఎస్.వెంకట్రావు రెండు దఫాలుగా ఐదేసి బృందాలను నియమించి జిల్లాలోని గ్రామాల్లో విచారింపజేశారు. అయితే అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేకరించిన నివేదికలను బృందాల వారిగా ఎవరికి వారు కలెక్టర్‌కు సీల్డ్ కవర్లో అందజేయాలని సూచించినట్లు సమాచారం. నివేదించే వివరాలతో దళారుల గుట్టు రట్టు అవుతుందా.. విచారణ తుస్సుమంటుందో వేచి చూడాల్సిందే. నేడు మార్కెటింగ్ డైరెక్టర్ రాక రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి బుధవారం నారాయణపేటకు వస్తున్నారు. అయితే పేటలో కొనసాగుతున్న పెసర కొనుగోలు కేం ద్రం వ్యవహర తీరుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆతర్వాత పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తారు. -
పెసర దళారుల్లో దడ
సాక్షి, నారాయణపేట: స్థానిక మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రంలో కొందరు దళారులు రైతుల్లా అవతారమెత్తి పెసర ధాన్యాన్ని విక్రయించినట్లు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కలెక్టర్ వెంకట్రావ్ సీరియస్‌గా తీసుకుని లోతుగా, పారదర్శకంగా విచారించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అయిదు బృందాలను నియమించి నేటినుంచి రంగంలోకి దించనున్నారు. ఈ విషయం తెలిసి తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. రైతుల పేర విక్రయాలు అరుగాలం కష్టించి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పెసర కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు గిట్టుబాటు ధర పొందుతూ లాభాలు పొందుతుండటం చూసిన దళారులు సహించ లేక వారు కూడా రైతుల్లా అవతారమెత్తారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తక్కువ ధరకు పెసరను కొనుగోలు చేసి పేటకు వచ్చి ఎక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించారు. తెలిసిన రైతుల కు నయనో భయానో డబ్బులు చెల్లిస్తూ వారి పట్టాపాసుపుస్తకాలపై పెసరను విక్రయించారు. ఆనోటా ఈనోటా విషయం కాస్త కలెక్టర్ దృష్టికి వెళ్లగా అధికారులను అప్రమత్తం చేయడంతో వారి బోగోతం బయటపడింది. ఈ విషయాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులను కదిలించారు. నాలుగు రోజులుగా పెసర కొనుగోలు కేంద్రంలో జరిగి న విక్రయాలపై వారు ఆరా తీయిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు విచారణ మొదలెట్టారు. 416 మంది పత్రాల పరిశీలన కొనుగోలు కేంద్రానికి రైతులు పెసర ధాన్యాన్ని తీసుకొని వెళ్లే సమయంలో గ్రామ రెవెన్యూ, గ్రామ వ్యవసాయశాఖ అధికారిలతో ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లాలి. దళారి రైతులు పంటలు వేసినా.. వేయకపోయినా.. ధ్రువీకరణ పత్రాలపై సదరు అధికారులను బెదిరిస్తూ సంతకాలు చేయించుకొని తీసుకెళ్లినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాలతో సోమవారం నుంచి ఇద్దరు ఏఈఓలు, ఒక వీఆర్వో, మార్కెట్ అధికారులు సైతం రైతులు తెస్తున్న పెసర ధాన్యాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించ సాగారు. దీంతో దళారుల బాగోతం ఒక్కొక్కటి బయటపడుతోంది. తహసీల్దార్ రాజు, జిల్లా మార్కెటింగ్ అధికారిణి పుష్పామ్మ పరిశీలించి అక్కడ ఉన్న తమ సిబ్బంది విచారణలో తెలిన బోగస్ పెసర 37 బస్తాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఇప్పటిరకు 8 వేల బస్తాల పెసరను విక్రయించిన 416 మంది వివరాలను పూర్తి స్థాయిలో అధికారులు సేకరించారు. వాటిని గురువారం నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నేటి నుంచి గ్రామాల్లోకి బృందాలు కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం నుంచి గ్రామాల్లోకి అధికారుల బృందాలు పర్యటించేందుకు సిద్ధమయ్యారు. పెసర ధాన్యం విక్రయాలపై వి చారించేందుకు గాను కలెక్టర్ ఐదు బృందాలను నియమించారు. బృందంలో వ్యవసాయశాఖ అ ధికారి, డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు గ్రామా లకు వెళ్లే సమయంలో ఆ గ్రామ రెవెన్యూ అ ధికారి, ఏఈఓ, వీఆర్ఏలను తీసుకెళ్తారు. రైతులు వేసిన పంటలపై సమగ్ర సర్వే రిపోర్టును వారి వెంబడి తీసుకెళ్లనున్నారు. ఆ సర్వేలో రైతులు పంటవేయకుండా విక్రయించినట్లు తెలితే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడొద్దని కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దళారుల గుండెల్లో దడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతుల అవతారమెత్తి దళారులు విక్రయించిన పెసరపై పూర్తిస్థాయిలో విచారించి నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఐదు బృందాలను ఏర్పాటుచేయడంతో దళారుల గుండెలో దడ పుడుతోంది. ఆ బృందాలు ఈ నెల 28 వరకు క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు చెరుకొని వివరాలను సేకరించనున్నారు. వీఆర్వో, వీఏఓలతో రైతులు వేసిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఒక వేళ పంటను వేయకుండా పెసరను విక్రయించినట్లు తెలితే వాటిని సీజ్ చేయడంతో పాటు డబ్బులు వేయకుండా చూడాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఏదేమైనా ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
బడియా.. బారా?!
నారాయణపేట/ మాగనూర్ (మక్తల్): అక్కడ పొద్దున ఆ పాఠశాల గేట్లు తెరిస్తే చాలు మద్యం ఖాళీ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడం విద్యార్థులు.. ఉపాధ్యాయులకు వంతైంది. ఉదయం శుభ్రంగా ఉంటే రాత్రి మాత్రం మందుబాబులకు అడ్డాగా మారింది. మద్యం తాగి ఖాళీ బాటిళ్లను పడేసిపోతున్నారు. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు వాపోతున్నారు. ఇదీ నారాయణపేట జిల్లాలోని మాగనూర్ జెడ్పీహెచ్ఎస్ పరిస్థితి. ఈ పాఠశాలకు ప్రహరీ, గేటు ఉన్నా వాచ్‌మన్‌ను మాత్రం నియమించలేదు. అలాగే ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటంతో గోడ దూకి రాత్రివేళ మందుబాబులు ఇక్కడికి వచ్చి తమ పని కానిచ్చేస్తున్నారు. పక్కనే మద్యం విక్రయాలు బడి అంటేనే ఓ పవిత్రమైన స్థలం.. అలాంటిది మందుబాబులు తమను ఎవరూ ఏమీ చేయలేరని అనుకుంటున్నారేమో మరి.. ఈ పాఠశాల ఆవరణలో తాగుడు.. మద్యం బాటిళ్లను పడేసుడు.. అంతే! ఖాళీ బాటిళ్లను ఎత్తేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు రోజురోజుకూ విసుగు చెందుతున్నారు. గ్రామంలోని బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. వారి కంట పడకుండా ఇలా చీకటి దాందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మాగనూరులోని ఓ వ్యక్తి గుడి దారిలో బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్నాడు.. అతనే ఈ పాఠశాల పక్కన ఉన్న తన స్వగృహంలో రాత్రివేళ మద్యం విక్రయిస్తున్నాడు. దీనిపై విద్యార్థి సంఘాలు, గ్రామ యువకులు పలుసార్లు ఆందోళనలు చేపట్టినా అధికారులు, పాలకుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు మాగనూర్‌లో బెల్ట్ దుకణాలు పెట్టి మద్యం విక్రయిస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటిది మా దృష్టికి వస్తే చట్టారీర్యా చర్యలు తీసుకుంటాం. – నాగేందర్, ఎక్సైజ్ సీఐ, నారాయణపేట -
డబ్బుల కోసమే హత్య.. పట్టించిన ఫోన్ కాల్
నారాయణపేట: డబ్బుల కోసమే నారాయణను దారుణంగా హతమార్చారని ఎస్పీ చేతన తెలిపారు. హ్యత కేసును సీఐ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం కాల్ క్లూతో కూపీ లాగి కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కార్యాలయ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దామరగిద్ద మండలంలోని నర్సాపూర్‌కు చెందిన కొమ్మూరు నారాయణ బియ్యం వ్యాపారం చేసేవాడు. ఈ నెల 10న బియ్యం వ్యాపారానికి సంబంధించిన రూ.7.68 లక్షల డబ్బులను గుల్బర్గా నుంచి వసూలు చేసుకొని వస్తున్నారు. డబ్బులు తీసుకువస్తున్నట్లు తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు నారాయణ కదలికలను గమనిస్తూ వచ్చారు. గుర్మిట్కల్ చేరుకున్న నారాయణ ద్విచక్రవాహనంపై బయలుదేరి నర్సాపూర్‌కు వస్తుండగా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామ శివారులోని ఎర్రగుట్ట దగ్గర మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు గండీడ్ మండలానికి చెందిన చించాటి వీరేశ్(20), నీరటి మహేశ్(23)లు వారి బొలెరో వాహనంతో ఢీకొట్టారు. అక్కడికక్కడే నారాయణ మృతిచెందిన విషయాన్ని గమనించి ద్విచక్రవాహనాన్ని, నారాయణ మృతదేహాన్ని తీసుకెళ్లి రోడ్డుకు వంద మీటర్ల దూరంలో ఎర్రగుట్ట దగ్గర ముళ్ల పొదాల్లో పడేసి.. డబ్బులతో పరారయ్యారు. కాల్ క్లూతో కూపీ.. హత్యకు గురైన నారాయణ సెల్‌ఫోన్‌తోనే నింది తులు ఓ వ్యక్తికి ఫోన్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అదే చివరి కాల్. ఆ వ్యక్తి ఫోన్ కాల్ డాటాతో హంతకులను కేవలం రెండు రోజుల్లోనే పోలీసు బృందం పట్టుకుందని ఎస్పీ తెలిపారు. నారాయణతో తీసుకెళ్లిన డబ్బులను ఇద్దరూ చేరి సగం వాటాలుగా పంచుకున్నారని, ఆ డబ్బులను రికవరీ చేసేందుకు ఈ సమయం పట్టిందన్నారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. హత్య కేసును ఛేదించిన సీఐ సంపత్‌కుమార్, దామరగిద్ద ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు భాస్కర్, భీమప్ప, హరీశ్, టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుళ్లు నరేందర్, రాంకుమార్, నాగరాజుగౌడ్, ఆంజనేయులను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. -
సర్పంచ్ సోదరుడి దారుణ హత్య
సాక్షి, దామరగిద్ద (నారాయణపేట): డబ్బులతో ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సీఐ సంపత్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ వీరప్ప సోదరుడు కొమ్మూరు నారాయణ (26) కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్లో బియ్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గుర్మిట్కల్‌లోని నరేందర్ అనే వ్యక్తికి బియ్యం విక్రయించగా వచ్చిన డబ్బులు తీసుకువచ్చేందుకు బుధవారం నర్సాపూర్ నుంచి ద్విచక్రవాహనం పై వెళ్లాడు. అక్కడ నరేందర్ దగ్గర బియ్యం విక్రయించగా వచ్చిన డబ్బుల సంబంధించి రూ.7.68 లక్షల చెక్కు తీసుకున్నాడు. చెక్కు గుల్బర్గా బ్యాంకుకు సంబంధించినది కావడంతో నేరుగా డబ్బులు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి గుల్బర్గా వెళ్లాడు. బ్యాంకులో చెక్కు డ్రా చేసుకొని నగదుతో గుర్మిట్కల్కు తిరుగు ప్రయాణమయ్యాడు. సాయంత్రం 4.30 గంటలకు తన భార్యకు ఫోన్ చేసి గుల్బర్గా నుంచి డబ్బులు తీసుకొని వస్తున్నట్లు చెప్పాడు. సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో తన చిన్న సోదరుడు వెంకటప్ప ఫోన్ చేయగా గుర్మిట్కల్ నుంచి బయలుదేరినట్టు చెప్పాడు. అయితే 7.30 గంటల వరకు కూడా ఇంటికి రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. రాత్రంతా వెతికినా.. నారాయణ ఎంతకూ ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతో ఆందో ళన చెందిన సోదరులు సర్పంచ్ వీరప్ప, వెంకటేష్, బుగ్గప్పలు రహదారిపై ఎక్కడైనా ప్రమాదం జరిగిందేమోనని భావించి రాత్రంతా వెతికినా ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున కాన్కుర్తి శివారులో రహదారిపై రక్తపు మరకలు కనిపించడంతో చుట్టు పక్కల వెతకగా పొదల్లో నారాయణ మృతదేహం లభ్యమైంది. విగతజీవిగా మారిన తమ సోదరుడిని చూసి అన్నదమ్ములు గుండెలు బాదుకున్నారు. డబ్బుల కోసం యువకుడిని దారుణంగా హత్య చేసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నారాయణకు గత 45 రోజుల క్రితమే దౌ ల్తాబాద్ మండలం కుదురుమల్లకు చెందిన ఓ యువతితో వివాహమైంది. కాన్కుర్తి శివారులో శవమై.. ద్విచక్రవాహనంపై వస్తుండగా యానాగుంది సరిహద్దులోని కాన్కుర్తి శివారులో గల ఎర్రగుట్ట సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుకు దూరంగా ఉన్న పొదల్లో పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్రవాహనాన్ని సైతం రోడ్డుకు దూరంగా పొలంలో పడేశారు. ఈ ఘటనపై మృతుడి నారా యణ సోదరుడు వెంకటప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమారం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ చేతన పరిశీలించారు. ఆమె వెంట సీఐ సంపత్‌కుమార్‌తోపాటు స్థానిక ఎస్ఐ రాంబాబు ఉన్నారు. -
దర్జాగా ఇసుక దందా
సాక్షి, మరికల్: అక్రమ ఇసుక వ్యాపారులు అధికారుల అండదండలతో పాలమూరు ఇసుక రావాణాకు తుట్లు పొడుస్తున్నారు. వారి కన్నుసన్నల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారిపై దాడులకు దిగుతున్నారు. మండలంలోని పూసల్‌పహాడ్ సమీపంలో ఉన్న కోయిల్‌సాగర్ వాగులో జోరుగా అక్రమా ఇసుక రవాణా జరుగుతుంది. ట్రాక్టర్‌కు రూ.4500 నుంచి రూ.5వేల మధ్య ఇసుకను విక్రయిస్తుంటారు. పూసల్‌పహాడ్ గ్రామంలోని పలువురు వ్యక్తులు అక్రమ ఇసుక వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. అధికారులకు మామూళ్ల ముట్టచెబుతూ వారి దందాను దర్జాగా సాగిస్తున్నారు. దీంతో వారు ఆడిందే ఆట పాడిదే పాటగా మారింది. పూసల్‌పహాడ్ నుంచి మరికల్, మాధ్వార్, తీలేర్, పల్లెగడ్డ, తధితర గ్రామాలకు ఇసుక ఆర్డర్లు వస్తే చాలు అధికారులకు ఫోన్ కొట్టిన తర్వాతనే వాగులోకి ఇసుక కోసం ట్రాక్టర్లను తీసుకెళ్తారు. వారు కాదంటే ట్రాక్టర్ ముందుకు కదలదు. ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ.3వేల చొప్పున అధికారులకు ఇస్తూ ఇసుకను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపొవడంతో గ్రామస్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అడ్డొచ్చిన వారిపై దాడులు కోయిల్‌సాగర్ వాగు నుంచి గుట్టు చప్పుడుగా ఇసుకను తరలిస్తున్న వారిని అడ్డుకుంటే వారు ఎంతటికైనా తెగిస్తారు. అడ్డుకున్న వారు ఎవరని చూడకుండా దాడులు చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఏడాది క్రితం అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న వీఆర్ఓ మైబన్నను చితకబాది ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. ఇసుక వ్యాపారంలో ఉన్న లాభాలకు అలవాటు పడ్డ కొందరు వ్యాపారులు ప్రస్తుతం కూడా వారి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అసలే వర్షాలు లేక బోర్లలో భూగర్బజల్లాలు అడుగంటిపోతున్న తరుణంలో కోయిల్‌సాగర్ వాగుల్లో నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం వల్ల వాగు పరివార ప్రాంతం సమీపంలో ఉన్న బోర్లలో భూగర్బజల్లాలు అడుగంటిపొతుండటంతో ఇటీవల కొందరు రైతులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రైతులను సైతం విడిచిపెట్టకుండా దాడులు చేశారు. తమ పై దాడులు చేశారు కోయిల్‌సాగర్ వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యాపారులను అడ్డుకుంటే తమపై దాడులు చేసి గాయపర్చారు. తమ వ్యాపారానికి అడ్డు రావొద్దని భయపెట్టిస్తున్నారు. గ్రామంలో దర్జాగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. – ఆంజనేయులు, రాంరెడ్డి, పూసల్‌పహాడ్ చర్యలు తీసుకుంటాం అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. పాలమూరు ఇసుక రవాణా కా కుండా దొడ్డిదారిన ఎవరైన సరే అక్రమంగా ఇసుక రవాణా చేస్తే సహించం. అక్రమంగా ఇసుక తరలించేందుకే వీలులేదు. తప్పనిసరిగా అనుమతి పొందాల్సిందే. అధికారులచే తనిఖీలు చేపడుతాం. ఇసుక వ్యాపారులతో అధికారులు డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – నాగలక్ష్మి, తహసీల్దార్, మరికల్ -
ఒక్కరోజులోనే అమ్మకానికి!
నారాయణపేట: రాష్ట్రంలోని గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడు రూ.25 వేలు చెల్లిస్తే.. ప్రభుత్వం రూ.75 వేలు వెచ్చించి 21 గొర్రెలను అందిస్తోంది. వీటితో ఆయా లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. నారా యణపేట జిల్లాలోని మరికల్‌కు చెందిన గొర్రెల కాపరులకు సోమవారం పశుసంవర్ధకశాఖ అధికారులు 64 యూనిట్లకు గాను లబ్ధిదారులు ఒక్కొక్క యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొటేలు చొప్పున అందజేశారు. అయితే కాపరులు గొర్రెలను పొంది ఒకరోజు సైతం తమ వద్ద పెట్టుకోకుండా దళారులతో కుమ్మక్కై బేరం చేసుకోవడంతో వాటిని ప్రత్యేక వాహనంలో నల్లగొండ జిల్లా మల్లెపల్లి ప్రాంతానికి తరలిస్తుండగా జడ్చర్ల వద్ద పట్టుబడడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. పక్క రాష్ట్రాల నుంచి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేసేందుకు పశుసంవర్ధకశాఖ అధికారులు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఆ సమయంలో మధ్యవర్తి సాయం తీసుకుంటున్నారు. అక్కడే గొర్రెకు పోగువేసి జిల్లాకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల వద్ద గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువచ్చి మరికల్లో కాపరులకు అందజేశారు. దళారులచే విక్రయాలు ప్రభుత్వ సబ్సిడీతో కొనుగోలు చేసిన గొర్రెలను ఎక్కడ పెంచుకుంటాం.. ఒక్కసారే అమ్మితే పోలా అంటూ కాపరులు అధిక సొమ్ముకు ఆశపడి దళారులతో కుమ్మక్కై గొర్రెలను విక్రయించేస్తున్నారు. ఒక్కో యూనిట్లో దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు వచ్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ గొర్రెలు ఒక్కసారిగా విక్రయాలు చేయడంతో దళారులకు కాసుల పంటనే చెప్పవచ్చు. 64 యూనిట్లు అంటే 1344 గొర్రెలు. ఒక్కొక్క యూనిట్‌కు రూ. 50 వేల చొప్పున అధికంగా విక్రయించిన రూ.32 లక్షల లాభం వస్తుంది. ఇందులో లబ్ధిదారులకు సగం ఇచ్చినా.. మిగతా సగం దళారుల సొంతమవుతుంది. ఇందులో అధికారుల చేతివాటం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొర్రెలు అమ్మితే సభ్యత్వం రద్దు మరికల్ (నారాయణపేట): గొర్రెల కాపరుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను అక్రమంగా అమ్మి న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పశు సంవర్ధక శాఖ జేడీ దుర్గయ్య అన్నారు. మరికల్లో డీడీలు కట్టిన వారికి 64 యూనిట్లను మం జూరు చేశామని, ఈ మేరకు అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేసిన రోజు రాత్రికే చట్టానికి విరుద్ధంగా గొర్రెలను మాచర్ల కొనుగోలుదారులకు అమ్మిన లబ్ధిదారుల ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామన్నారు. అలాగే ఆ గ్రామాన్ని సైతం బ్లాక్ లిస్టులో పెట్టి మిగతా లబ్ధిదారులకు కూడా గొర్రెలను నిలిపివేస్తామన్నారు. దీంతోపాటు సం ఘం అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తామన్నారు. పట్టుబడిన గొర్రెలను డీడీలు కట్టిన ఇతర గ్రామాల లబ్ధిదారులకు అందజేస్తా మన్నారు. అక్రమంగా గొర్రెలను కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేశామని, ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభు త్వ సబ్సిడీ గొర్రెలను దొడ్డిదారిన అమ్మితే ఎంతటి వారైనా సరే కేసులు తప్పవని హెచ్చరించారు. -
3 జిల్లాలకు నాన్–కేడర్ కలెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలతోపాటు వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నాన్ కేడర్ అధికారులకు పదోన్నతులిస్తూ ఈ నియామకాలు చేపట్టారు. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషాకు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. నల్లగొండ జిల్లా జేసీగా ఉన్న సి.నారాయణరెడ్డిని కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా కలెక్టర్‌గా, మహబూబ్‌నగర్ జేసీ ఎస్.వెంకటరావును మరో కొత్త జిల్లా నారాయణపేట కలెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లుగా నియమితులైన ముగ్గురూ నాన్ ఐఏఎస్ అధికారులే. ప్రస్తుతం వీరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) హోదాను కలిగి ఉన్నారు. వీరికి ఐఏఎస్ హోదా కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించిందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిపోయిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించేందుకు సరిపోయే సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో లేరు. కొందరు ఐఏఎస్‌లు కొన్నేళ్లుగా అప్రధాన్య పోస్టుల్లో కొనసాగుతున్నారు. పోస్టింగ్‌ల విషయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి నాన్ ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమించడం గమనార్హం. ఐఏఎస్ కాని వారిని కలెక్టర్లుగా నియమించడం ఇదే తొలిసారి అని, ఇంతకు ముందు నాన్ ఐపీఎస్ అధికారులను జిల్లా ఎస్పీలుగా నియమించడంతో ఈ సంప్రదాయం ప్రారంభమైందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. బి.జనార్దన్ రెడ్డికివిద్యాశాఖ బాధ్యతలు విద్యాశాఖ కార్యదర్శిగా బి.జనార్దన్‌రెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన పురపాలక శాఖ డైరెక్టర్‌గా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లుగా పనిచేశారు. గత కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. -
కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణపేట జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లా కలెక్టర్‌గా సి. నారాయణరెడ్డి, నారాయణపేట్ జిల్లా కలెక్టర్‌గా ఎస్.వెంకట్రావును నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన బీ జనార్థన్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శిగా, మస్రద్‌ఖాన్ అయేషా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వెంకట్రావ్ ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో ఆయన జిల్లా పాలనాధికారిగా నియమితులైనారు. కాగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీ మేరకు రెండు నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
నారాయణపేటలో నవశకం
ఏళ్ల నాటి కల ఫలించింది.. అందరితో పాటు తమ ప్రాంతం జిల్లాగా మారలేదన్న బెంగ ఇన్నాళ్లు వెంటాడినా ఇప్పుడు అది సాకారం కావడంతో నారాయణపేట వాసుల్లో సంబరాలు మిన్నంటాయి.. కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లా ఆదివారం ఉదయం మనుగడలోకి వచ్చింది.. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్, ఎస్పీగా రొనాల్డ్‌రోస్, రెమారాజేశ్వరి బాధ్యతలు స్వీకరించగా.. జెడ్పీ చైర్మన్ భాస్కర్, నారాయణపేట, కొడంగల్, మక్తల్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రాంమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని కార్యాలయాలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ‘పేట’లో పండగ వాతావరణం నెలకొంది. నారాయణపేట: వలసలకు మారుపేరుగా.. అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న నారాయణపేటలో నవశకం ఆరంభమైంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన నూతన జిల్లాగా నారాయణపేట మనుకగడలోకి వచ్చింది. ఈ మేరకు కలెక్టరేట్‌ను ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఇన్చార్జి కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ రెమా రాజేశ్వరిలు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, నారాయణపేట, మక్తల్, కొడంగల్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు ఆయా కార్యాలయాల ముందు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సందడి వాతావరణం నెలకొనగా జిల్లా కేంద్రానికి చెందిన ప్రజలు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మార్కెట్ చైర్మన్ సరాఫ్ నాగరాజు, నారాయణపేట ఎంపీపీ మణెమ్మ, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాసులుతో పాటు వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. కాగా, జిల్లా ప్రారంభానికి సూచకగా పలువురు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెక్కులు అందజేశారు. ప్రజల వద్దకు పాలన సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజల వద్దకు ప్రభుత్వ పాలనను అందించాలనే సంకల్పంతోనే నారాయణపేట కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలు అభివృద్ధికి అమడదూరంలో నిలిచిపోయాయి. సాగునీటికి నోచుకోలేని ప్రాంతాలు. కేసీఆర్ జన్మదిన కానుకగా ఇచ్చిన జిల్లాను అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతాం. చెరువులకు సాగునీరు అందించి ఈ ప్రాంతం పచ్చదనంతో నిండిపోయేలా కృషి చేస్తాం – పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొడంగల్ వలసలు ఆగిపోవాలి నారాయణపేట నూతన జిల్లా తొలి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. కొత్త జిల్లాలో కొత్త సర్పంచ్‌లు అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. మహబూబ్‌నగర్ జిల్లా అంటేనే వలసలకు పెట్టింది పేరు కాగా.. నారాయణపేట డివిజన్ నుంచే అధికంగా వలసలు వెళ్లారని చెబుతారు. ఇకపై నూతన జిల్లా ఏర్పాటుతో వలసలు అగిపోవాలి. అభివృద్ధిలో దూసుకెళ్లి నారాయణపేటకే వలసలు వచ్చేలా పనిచేయాలి. చేనేత జిల్లా కార్యాలయాల ఏర్పాటుతో కార్మికుల కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వరకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నందున సర్పంచ్‌లు చొరవ చూపాలి. – రొనాల్డ్‌రోస్, ఇన్చార్జ్ కలెక్టర్ అన్ని రంగాల్లో అభివృద్ధి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన నారాయణపేట జిల్లా పుట్టింది. కొత్త జిల్లాగా ఏర్పాటైన నారాయణపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశముంది. అప్పుడే పుట్టిన బిడ్డను ఎలా తీర్చిదిద్దుకుంటామో జిల్లాను కూడా అలాగే చూసుకోవాలి. ప్రజల సహకారంతో ముందుకు సాగుతూ జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తాం. ఫ్రెండ్లీ పోలీస్ విధానం ద్వారా ఎలాంటి నేరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తాం. వెనకబడిన నారాయణపేట జిల్లాలో ఇకపై ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశముంది. – రెమా రాజేశ్వరి, ఇన్చార్జ్ ఎస్పీ కేసీఆర్ జన్మదినం... జిల్లాకు శుభదినం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున నారాయణపేట జిల్లా ఏర్పాటుకావడం ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు శుభదినం. గతంలో జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడే నారాయణపేట జిల్లా కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో జరగలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నారాయణపేట జిల్లా ప్రజలకు జిల్లాను కేసీఆర్ వరంగా ఇచ్చారు. ఇది చరిత్రలో నిలిపోయే దినం. ఇకపై నారాయణపేట భవిష్యత్ మారిపోతుంది. నారాయణపేటకు వచ్చేందుకు ఉద్యోగులు దూరంగా భావించొద్దు. కలెక్టర్ తమిళనాడు నుంచి, ,ఎస్పీ కేరళ నుంచి వచ్చి పనిచేస్తున్నప్పుడు నారాయణపేట ఏమీ దూరం కాదు. పాకిస్తాన్ బార్డర్‌కు వెళ్లడం లేదు కదా(నవ్వుతూ)?. ఉద్యోగులు సమష్టి కృషితో అభివృద్ధిలో జిల్లాను పరుగులు తీయించాలి. – బండారి భాస్కర్, జెడ్పీ చైర్మన్ -
జిల్లాలు.. 33
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భౌగోళిక స్వరూపం మళ్లీ మారుతోంది. మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుపై నెల రోజులుగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించే ప్రక్రియ జరిగింది. బుధవారంతో ఇది ముగిసింది. ప్రాథమిక నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు లేకుండానే ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు పూర్తి కానుంది. ఒకట్రెండు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఈ రెండు జిల్లాలు మనుగడలోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన మొదలైంది. 2016, అక్టోబర్ 11న కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటయ్యాయి. తాజాగా రెండు జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుపై డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ భూపాలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టర్లు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు, సూచనలు ఇచ్చే గడువు పూర్తయ్యింది. ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రానట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ కానున్నాయి. మరో నాలుగు మండలాలు... రెండు కొత్త జిల్లాలతోపాటు నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ నెల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో చండూరు, మోప్రా, మేడ్చల్ జిల్లాలో మూడుచింతలపల్లి, సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. అలాగే ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేలా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపైనా ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 585 మండలాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన సమయంలో ప్రభుత్వం కొత్తగా 125 మండలాలను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు మండలాలతో కలిపి రాష్ట్రంలోని మొత్తం మండలాల సంఖ్య 589కి పెరగనుంది. అలాగే రాష్ట్రంలో మొదట 38 రెవెన్యూ డివిజన్లు ఉండేవి. జిల్లాల పునర్విభజన సమయంలో వీటి సంఖ్య 69కి పెరిగింది. ఇదిలా ఉండగా... కొత్తగా కోరుట్ల, జోగిపేట, కొల్లాపూర్, ఖానాపూర్ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ములుగు జిల్లా: ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం(కె), వాజేడు మండలాలు. ప్రస్తుతం ఇవి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నాయి. నారాయణపేట జిల్లా: దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, కృష్ణ, మద్దూరు, మాగనూరు, మక్తల్, మరికల్, నారాయణపేట, నర్వ, ఊట్కూరు, కోయిల్‌కొండ మండలాలు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. -
రొట్టె కొడతా..
మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి సోమవారం నారాయణపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాలవాడలోని ఓ ఇంట్లో మహిళ వంట చేసుకుంటుండగా అక్కడికి వెళ్లి స్వయంగా జొన్నరొట్టె కొట్టి ఆకట్టుకున్నారు. ఆమె కట్టెల పొయ్యి వద్ద కూర్చొని ఓపికగా రొట్టె చేయడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. – నారాయణపేట రూరల్ -
షార్ట్ సర్క్యూట్‌తో వ్యక్తి సజీవ దహనం
నారాయణపేట రూరల్: గాఢ నిద్రలో ఉండగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. గుజరాత్‌కు చెందిన నంజీలాల్ పటేల్ (62) కుటుంబం కొన్నేళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని యాద్గీల్ రోడ్లో నంజీలాల్ ఫ్లైవుడ్ షాపును ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నాడు. రోజులాగే శనివారం కూడా షాపులో నిద్రపోయాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో గాఢనిద్రలో ఉన్న నంజీలాల్ స్పృహ తప్పి మంటల్లో కాలిపోయాడు. తెల్లవారిన తర్వాత గమనించిన స్థానికులు వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి దుకాణం తెరిచి చూడగా నంజీలాల్ ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఘటనలో రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ఎస్సై వెల్లడించారు. నంజీలాల్‌కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె పెళ్లి వచ్చే నెలలో జరగనుండటం.. ఇంతలోనే తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు -
తవ్వేస్తున్నారు!
డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు అసాధ్యాలను సైతం సుసాధ్యాలుగా మార్చుకుంటున్నారు.. పర్యావరణానికి పెను ప్రమాదం అని తెలిసినా పచ్చని చెట్లను నేలమట్టం చేస్తున్నారు.. ఎర్రగుట్టను తవ్వేసి దర్జాగా దందా సాగిస్తున్నారు. ఇంతజరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ధన్వాడ : అనుమతులు లేకుండా గుట్టను తవ్వి కొందరు దందా చేస్తున్నారు. మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ధన్వాడ మండల కేంద్రనికి రెండు కిలోమీటర్ల దూరంలో భారత గట్లు నుంచి గత కొంత కాలంగా జేసీబీలతో తవ్వి ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇది తమ పట్టా భూమి అంటూ ఇటుక బట్టీలను పెట్టుకొని వాడుకుంటున్నారు. బోర్డు ఏర్పాటుచేసినా.. ఆ స్థలంలో ఫారెస్ట్ ఏరియాను సూచించే బోర్డును అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినా అవేవీ పట్టించుకోకుండా తవ్వకాలు జరిపారు. అంతే కాకుండా పచ్చని చేట్లను నరికేస్తున్నారు. మట్టిని భూమి సమాంతరంగా తవ్వి వాటిని తమ పొలంలోకి కలిపేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అటు ఫారెస్ట్ శాఖ అధికారులుగాని, ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దర్జాగా ఇటుక దందా.. ఎక్కడి నుంచో ఇటుకకోసం మట్టిని తె చ్చుకుంటూ వాటికి డబ్బులు ఎందుకు ఖర్చు పెటలనుకున్నారో ఏమో ఏకంగా గుట్ట దగ్గరే మకాం పెట్టేశారు. ఇటుక బ ట్టీ యజమనులు వ్యాపారం మూడు పు వ్వులు ఆరు కాయలుగా ఉంది. ఒక ఇ టుకకు రూ.5 నుంచి రూ.15వరకు అ మ్ముతున్నారు. అంటే వేయ్యి ఇటుకలకు రూ.5వేలు పలుకుతుంది. మండలంలో దాదాపు నాలుగు ఇటుక బట్టీలు ఏర్పా టు చేసుకున్నారు. వీటికి ఎక్కడా అనుమతులు తీసుకోవడంలేదు. ప్రధాన రా హదారులకు పక్కనే ఉన్నా అధికారులు అటునుంచే రాకపోకలు చేస్తున్నారు. ఎర్రమట్టిని తవ్వేస్తున్నారు మండలంలో ఎక్కడా ఎర్రమట్టి కావాల్సినా భారత గుట్టనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక్క ట్రాక్టర్ ట్రీప్‌కు రూ.400 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారు. పొలాలకు వేళ్లే రాహదారిని తవ్వడంతో బాటలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. పరిశీలిస్తాం ఈ వ్యవహారం మా దృష్టికి రాలేదు. అధికారులను పంపించి వివరాలు సేకరిస్తాం. ఎవరైన హద్దులు దాటి అటవీప్రాంతం మట్టిని తరలిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – గంగారెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్ఓ) -
తీలేర్‌లో మొసలి కలకలం
మరికల్ (నారాయణపేట) : మండలంలో ని పర్ధీపూర్ చెరువులో నుంచి దారి తప్పి వచ్చిన భారీ మొసలిని శుక్రవారం తీలేర్ గ్రామ రైతులు ప ట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి సమయం లో జాతీయ రహదారి దాటుతున్న మొసలిని గ మనించిన ఓ లారీ డ్రైవర్ తన వాహనాన్ని నిలి పి చూస్తుండగా, వెనకలే కారులో వచ్చిన సీఐ శ్రీకాంత్‌రెడ్డి మొసలిని గమనించి రోడ్డును దా టించారు. అనంతరం దాని ఆచూకీ కోసం ప్ర యత్నించగా కనిపించకపోవడంతో చుట్టుపక్క ల గ్రామాల రైతులకు మొసలి సంచరిస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శుక్రవా రం మధ్యాహ్న సమయంలో తీలేర్ పెద్ద చెరువు కింద ఉన్న డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి వ్యవసాయ పొలం పక్కలే ఉన్న ఓ కాల్వలో నిద్రిస్తున్న మొ సలిని గమనించిన్న రైతులు వెంటనే పోలీసుల కు, అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు వచ్చేలోపు గ్రామస్తులు వలలో మొసలిని బంధించి గ్రామ పంచాయతీ దగరకు తీసుకువచ్చారు. ఎస్ఐ జములప్ప గ్రామస్తులు పట్టుకున్న మొసలిని వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మొసలిని గమనించిన బీట్ ఆఫీసర్ విజయ్‌రాజ్ మాట్లాడుతూ రెండేళ్ల వయస్సు, 5 ఫీట్ల పొడవు ఉంటుందన్నారు. దీని మహబూబ్‌నగర్ పిల్లలమర్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సవారన్న, ఎంపీటీసీ తిరుతపమ్మ, అశోక్, బసన్న, కుర్మన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
దామరగిద్ద (నారాయణపేట): బియ్యం అక్రమ రవాణ చేపట్టే వారిపై అధికారులు తరచూ కేసులు నమోదు చేస్తున్నా.. అక్ర మ రవాణ ఆగడం లేదు. దొరికితే సరే.. లేదంటే తక్కువ రేటుకు కొన్న బియ్యం వందశాతం లాభంతో పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని గురిమిట్కల్లో ఓ రైస్‌మిల్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సోమవారం మద్దూరు మండలానికి చెందిన దినేష్ అనే ఓ వ్యాపారి మద్దూరులో కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని టాటా ఏస్ వాహనం లో కర్ణాటకకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. అధికారుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సినీఫక్కీలో ఓవర్ స్పీడ్‌లో వెళ్తూ యానాగంది స్టేజీ దగ్గర బోల్తా పడింది. సంఘటనకు సంబంధించి అధికారుల కథనం ప్రకారం.. సినీఫక్కీలో తప్పించే యత్నం.. సోమవారం ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఓ విలేకరి ద్వారా బియ్యం అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న తహసీల్దార్ బాలాజీ గ్రామంలోని వీఆర్ఏలను పురమాయించారు. దీంతో వారు వెళ్లి వాహనాన్ని అడ్డుకోవడంతో అక్కడే నిలిపారు. డ్రైవర్ బియ్యం ఓనర్ దినేష్‌కు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకునే లోపు డ్రైవర్‌ను తప్పించి వారు వాహనం నడిపారు. అడ్డుకున్న గ్రామసేవకులపెకి వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో కాశప్ప మరో ఇద్దరు కావలికార్లు కిందపడగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి వచ్చిన ఆర్ఐ కుమారస్వామి, వీఆర్ఓ హన్మంతు, వీఆర్ఏ దుర్గయ్య బియ్యం వాహనాన్ని వెంబడించారు. రెండు కిలోమీటర్లు అతివేగంగా వెళ్లి యానాగుంది స్టేజీ సమీపంలో బోల్తాపడింది. వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం. తహసీల్దార్ దామరగిద్ద పోలీసులకు సమాచారం ఇవ్వగా కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని.. కర్ణాటక శివారు కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటకకు చెందిన మోదెల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ తహసీల్దార్ రిపోర్టు ఆధారంగా దాదాపు 50 సంచుల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం గ్రామంలో ఉన్న శ్రీనివాస బిన్ని మాడల్ రైస్‌మిల్‌పై రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈసందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ విశ్వనాథం విలేకరులతో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు బిన్ని మాడల్ రైస్‌మిల్‌ను దాడులు చేపట్టామన్నారు. ఇందులో 4,030 క్వింటాళ్ల బియ్యాన్ని రైస్‌మిల్లులోకి సరఫరా చేశారన్నారు. 4 వేల క్వింటాళ్లు మళ్లీ ప్రభుత్వానికి మిషన్ ఆడించి పంపించినట్లు గుర్తించామన్నారు. 12 వేల క్వింటాళ్ల వడ్లను మిషన్‌లో ఆడించారని, 11 వేల క్వింటాళ్ల లెవీ బియ్యాన్ని తయారు చేశారన్నారు. 43 వేల క్వింటాళ్ల బియ్యం రైస్‌మిల్లులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి చెందిన బియ్యాన్నే తీసుకొచ్చి రైస్ మిల్లులో సన్నగా చేసి మళ్లీ ప్రభుత్వానికే విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మొత్తం మిల్లు తనిఖీ చేయగా 30.50 క్వింటాళ్ల బియ్యం దొరికాయని, వాటిని సీజ్ చేశామన్నారు. ఈ మేరకు రైస్‌మిల్ యజమాని శ్రీనివాస్‌పై 6–ఏ రిపోర్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సీఈ యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి అధికారులకు రెఫర్ చేస్తామని, పోలీస్ కేసు సైతం పెడతామన్నారు. దాడుల్లో సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, తహసీల్దార్ కమాల్పాష, సీఐ రాములు, జిల్లా అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి ఎండీ ఫైసల్, ఎస్ఐ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
తాగునీటి కోసం రాస్తారోకో
► సబ్ కలెక్టర్ హామీ ఇస్తేనే విరమిస్తాం ►5గంటలపాటు పేటలో ఆందోళన నారాయణపేట రూరల్: పాలకుల నిర్లక్ష్యంతోనే పట్టణంలో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని.. తమ వార్డు కౌన్సిలర్ ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని.. మున్సిపాలిటీ పాలకపక్షంపై నమ్మకం లేదని.. సబ్ కలెక్టర్ వచ్చి నీటి ఎద్దడి తీరుస్తామని హామీ ఇచ్చేవరకు వెనక్కితగ్గే ప్రసక్తి లేదని పట్టణంలోని 23వ వార్డు ప్రజలు రాస్తారొకో చేపట్టారు. మండుటెండలో 5గంటలపాటు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 8గంటలకు సుభాష్‌రోడ్డుకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, పక్కనే ఉన్న 1, 20వార్డు ప్రజలు అక్కడికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. కాలనీవాసులు మాట్లాడుతూ చాలారోజులుగా నీటి సమస్య ఉందని, పాలకుల నిర్లక్ష్యం, తప్పుడు నిర్ణయాలతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని విమర్శించారు. 15రోజుల నుంచి ఒక్కసారి కూడా నీళ్లు ఇవ్వలేదని, దాతల సహకారంతో నడుస్తున్న ట్యాంకర్లు సైతం పక్కవార్డులకు సరఫరా చేసి తమకు పంపడంలేదని వాపోయారు. మున్సిపాలిటీ నుంచి ఎవరు వచ్చి చెప్పినా వినేదిలేదని, సబ్ కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే రాస్తారొకో విరమిస్తామని తేల్చి చెప్పారు. విషయం తెలుకుని కౌన్సిలర్ అక్కడికి చేరుకోగా పోలీసులతో కలిసి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కాలనీవాసులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆయన చేసేదిలేక వారితో కలిసి రాస్తారోకోలో కూర్చున్నాడు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి జోక్యం చేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి మున్సిపల్ చైర్పర్స¯ŒS గందె అనసూయ ఆమె భర్త చంద్రకాంత్‌తో కలిసి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. వారం రోజులు సమయం ఇవ్వాలని సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో సత్యనారాయణ చౌరస్తాలో ఆందోళన చేద్దామని, దీనికి తాను ముందుండి పోరాడుతానని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. -
కందుల కథ కంచికే!
నారాయణపేట : గత నెల 11న నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ కేంద్రంలో ఓ హమాలీ రైతు అవతారమెత్తాడు. 58బస్తాల కందులను అక్రమ మార్గంలో విక్రయించేందుకు ప్రయత్నించి అధికారులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో సరుకు సంబంధించిన పట్టదారు పుస్తకం వివరాలను యార్డు అధికారులు ప్రశ్నించగా సదరు హమాలీ ఆ సరుకును అక్కడే వదిలి చిత్తగించారు. అ తర్వాత తమ సరుకు అని పేర్కొంటూ యార్డు అధికారులను సంప్రదిస్తే నీ పూర్తిస్థాయి భూమి ఎంత సర్వే నెంబర్ వివరాలను సమర్పించాల్సిందిగా సూచించారు. ఆరోపణలు ఎదురుకుంటున్న సదరు కమిషన్ ఏజెంట్‌కు యార్డు అధికారులు నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పట్టుబడిన రోజేమో ఆ కందులు సంబంధిత యార్డు కమిషన్ ఏజెంట్‌వేనని పేర్కొంటూ వచ్చిన మార్కెట్ అధికారులు, తీరా నెలరోజుల తర్వాత ప్లేటు ఫిరాయించారు. మరో విధంగా సమాధానం ఇస్తుండటం మరిన్నీ అనుమానాలకు దారితీస్తోంది. ఇదండీ మార్కెట్ అధికారుల పనితీరు ఈ నెలరోజుల వ్యవధిలో సరుకును న్యాయబద్ధంగా విక్రయిస్తున్నట్లు అటు యార్డు అధికారులు, ఇటు సంబంధిత కమిషన్ ఏజెంట్ తెర వెనుక పావులు కదిపి ఆలస్యంగా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారిచే ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, మార్కెట్ అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సంబంధిత రైతుకు సంబంధించిన సరుకు ఉన్నట్లయితే ఇన్ని రోజులు తమ సరుకుయార్డులో ఉంచరు. నెల రోజుల వ్యవధిలో కేవలం రెవెన్యూ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా మార్కెట్ అధికారులు మొత్తం 58 బస్తాల్లో 50 బస్తాలు ఇద్దరు రైతులకు సంబంధించినవిగా మిగతా 8 బస్తాలు కమిషన్ ఏజెంట్‌గా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈ వ్యవహరం నడిచేందుకు నెలరోజుల సమయం ఎందుకు పట్టిందనే విషయంపై ఆ అధికారులే స్పష్టం చేయాలి. మరో విషయమేమిటంటే ఆ రోజున మొత్తం 58బస్తాలు రైతులవి కావని.. ఇప్పుడేమో 50బస్తాలు రైతులవని, 8 బస్తాలు కమిషన్ ఏజెంట్‌వని పేర్కొనడం గమనార్హం. ఎన్నో అనుమానాలకు తావిస్తున్న ఈ 58బస్తాల కందుల వ్యవహారంపై పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న 50 బస్తాలు సంబంధిత రైతులకు, 8 బస్తాలను కమిషన్ ఏజెంట్‌కు తిరిగి ఇచ్చేశామని మార్కెట్ కార్యదర్శి గోపాల్ చల్లగా సమాధానం దాటవేశారు. సంతకం చేశాను.. నాకేం తెలియదు నేను ఎక్లాస్‌పూర్‌లో పనిఒత్తిడిలో ఉన్న సమయంలో ఏమరుపాటు చేసి గ్రామస్తులు కొందరు ఆ కాగితాలపై సంతకం తీసుకున్నారు. గంజ్‌లో జరిగిన వ్యవహారం గురించి నాకు తెలియదు. గ్రామంలో రైతులకు పంట వేసే సమయంలో తాము ఏవిధంగా అయితే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామో అలాగే సంతకం చేశా. ఇందులో నా ప్రమేయం ఏమిలేదు. – అనంత్‌రెడ్డి, ఎక్లాస్పూర్ వీఆరోఓ -
పాలమూరులో ‘విభజన’ మంటలు
* యువకుడి ఆత్మహత్యాయత్నం * మరికల్లో అంతర్రాష్ట్ర రహదారి దిగ్బంధం నారాయణపేట/మక్తల్: జిల్లాల పునర్విభజన మంటలు పాలమూరులో ఎగిసిపడుతున్నాయి. నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతమైంది. రెండోరోజు మరికల్లో అంతర్రాష్ర్ట రహదారిని అఖిలపక్షం నాయకులు దిగ్బంధిం చారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రాజీనామాకు మద్దతుగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎం.జ్యోతి, లక్ష్మి, అమీరుద్దీన్, కాకర్ల నారాయణమ్మ, తరుణబేగం, విజయలక్ష్మి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మక్తల్‌ను మహబూబ్‌నగర్‌లోనే కొనసాగించాలని రామకృష్ణ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలం కోసం టవరెక్కి.. వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేటను మండలంగా ప్రకటించకపోవడంతో గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు ఆరుగురు యువకులు సెల్‌టవరెక్కి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై బైఠారుుంచడంతో ఇరువైపులా 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. యువకులతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చినా వారు ససేమిరా అన్నారు. మండల సాధన సమితి నేతలు దీక్షకు కూర్చున్నారు. గ్రామ పంచాయతీ వాటర్‌మన్ సతీష్ ఆగ్రహంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. -
నారాయణపేటలో విద్యార్థినులు అదృశ్యం
మహబూబ్‌నగర్: పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్‌లో చోటు చేసుకుంది. స్థానిక పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సదరు విద్యార్థినులు 10 వ తరగతి చదువుతున్నారు. కాగా ఉదయం స్కూల్‌కు వెళ్లిన వారు సాయంత్రం ఇంటికి చేరుకోలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ కుమార్తెల స్నేహితులతో వాకాబు చేయగా... తమకు ఏమి తెలియదని వారు వెల్లడించారు. దాంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
2019లో అధికారం మనదే: రమణ
నారాయణపేట: టీడీపీ 2019లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తెలంగాణ టీడీపీ నేత ఎల్. రమణ చెప్పారు. సోమవారం టీటీడీపీ ప్రతినిధి బృందం మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం నారాయణపేటలో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో లేమన్న బెంగవద్దని, టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. ముఖ్యమ్రంతి కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని పథక రచన చేస్తే క్షేత్రస్థాయిలో అమలు కావన్నారు. -
సారీ.. ! టైం లేదు
జోరుగా ‘పుర’పోరు ప్రచారం ముఖ్యనేతలు మాత్రం దూరం అసెంబ్లీ టికెట్ వేటలో బిజీబిజీ గాడ్పాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు ఎన్నికల వేళ అభ్యర్థుల్లో అయోమయం సాక్షి,మహబూబ్‌నగర్: ప్రస్తుతం జిల్లాలో ని మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి మునిసిపాలిటీతో పాటు నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, కల్వకుర్తి, అయిజ నగర పంచాయతీలకు ఎన్నికలు జ రుగుతున్నాయి. ఈనెల 14 వరకు పుర నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. 18న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థులకు గుర్తులు కే టాయించడ ంతో ప్రచారపర్వం కూడా ముమ్మరమైంది. ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ప్రారంభమై ఐ దురోజులు గడుస్తున్నా..కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎవరూ ప్రచారంలో పాల్గొనడం లేదు. కారణమేమంటే వచ్చే నెల 2వ తేదీ నుంచి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తుంచడంతో టికెట్లు దక్కించుకునేందుకు ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గాంధీభవన్, ఎన్టీఆర్ భవన్, తెలంగాణ భవన్.. ఇలా ఆయా పార్టీల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం అనుచరులతో కలిసి మాత్రమే ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించుకోవాల్సి వస్తోంది. నగర పంచాయతీల్లో అయితే అభ్యర్థులు చోటామోటా నాయకులను తమవెంట తిప్పుకోవాల్సి వస్తోంది. పుర నామినేషన్ల ఘట్టం మొదలు కాకముందే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గద్వాలలో సభ నిర్వహించి జిల్లాలో లాంఛనంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టివెళ్లారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంఐఎం నేతలు మినహా ప్రధానపార్టీలు నేతలు ఎవరు కూడా జిల్లాలో పర్యటించలేదు. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో 41 వార్డులు ఉన్నాయి. ప్రచారం ప్రారంభంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు తమ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాత్రం తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం లోపాయికారీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక మిగతాపార్టీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. గద్వాలలో టీడీపీ అభ్యర్థుల పక్షాన స్థానిక నేత డీకే సమరసింహారెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి తమపార్టీ అభ్యర్థుల తరఫున మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నారాయణపేటలో స్థానిక ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరిన తరువాత ఇప్పటివరకు ఆ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారంలో పాల్గొనలేదు. టీడీపీ అభ్యర్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. కల్వకుర్తిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసేవారే కరువయ్యారు. మాజీమంత్రి జె.చిత్తరంజన్‌దాస్, చల్లా వంశీచందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్‌ను దక్కించుకునే పనిలో ఉండటంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.దీంతో స్థానిక నాయకులే ఇంటింటా ప్రచారం నిర్వహించుకుంటున్నారు. అలాగే షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారంలో పాల్గొనలేదు. అయిజ నగరపంచాయతీలో అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చల్లా వెంకట్రామిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం మధ్య అసెంబ్లీ టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను పట్టించుకోవడం లేదు. టికెట్ కోసం ప్రదక్షిణలు అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న నేతలంతా..ఢిల్లీ, హైదరాబాద్‌లో తమ గాడ్పాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఒక్కో నియోజక వర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు ముగ్గురి నుంచి ఆరుగురు వరకు ఉండగా, మిగతా పార్టీల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ నుంచే పోటీ తక్కువగా ఉందని చెప్పొచ్చు.