నారాయణపేటలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
నారాయణపేట: ఎంతోమంది త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని వైఎస్సార్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర సోమవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి చేరుకుంది. స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేనికి సేవ చేయడం గొప్ప గౌరవం అని, వైఎస్సార్ ఆఖరి నిమిషం వరకు ప్రజలకు సేవ చేస్తూనే చనిపోయారని గుర్తు చేశారు.
దేశంలో మహిళలకు సమానత్వం లేదని ఇంకా చిన్నచూపే చూస్తున్నారని, మరియమ్మ అనే మహిళను జైల్లో పెట్టి చంపేశారన్నారు. మహిళలు అని చూడకుండా జైలో పెడుతున్నారని, మహిళలకు ఈ స్వతంత్ర దేశంలో గౌరవం లేదని, మద్యపాన నిషేధం అమలు చేయకుండా..మద్యం అమ్మకాల మీద రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే వైఎస్సార్ సుపరిపాలన తిరిగి అందిస్తానని హామీనిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిదన్నారు. అధికారం ఇస్తే ఉద్యమకారులను ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, ఉద్యమకారులకు ఇళ్లు, ఉద్యోగాలు, జీవితాంతం పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment