
2019లో అధికారం మనదే: రమణ
టీడీపీ 2019లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తెలంగాణ టీడీపీ నేత ఎల్. రమణ చెప్పారు.
నారాయణపేట: టీడీపీ 2019లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తెలంగాణ టీడీపీ నేత ఎల్. రమణ చెప్పారు. సోమవారం టీటీడీపీ ప్రతినిధి బృందం మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించారు.
అనంతరం నారాయణపేటలో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో లేమన్న బెంగవద్దని, టీఆర్‌ఎస్ ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. ముఖ్యమ్రంతి కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని పథక రచన చేస్తే క్షేత్రస్థాయిలో అమలు కావన్నారు.