పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైయ్యారు.
మహబూబ్నగర్: పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట్లో చోటు చేసుకుంది. స్థానిక పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సదరు విద్యార్థినులు 10 వ తరగతి చదువుతున్నారు. కాగా ఉదయం స్కూల్కు వెళ్లిన వారు సాయంత్రం ఇంటికి చేరుకోలేదు.
దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ కుమార్తెల స్నేహితులతో వాకాబు చేయగా... తమకు ఏమి తెలియదని వారు వెల్లడించారు. దాంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.