మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
నర్వ: తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన సీఎం కేసీఆర్‌కు కాలం చెల్లిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా నర్వ మండలంలో పర్యటించిన ఆమె నర్వ, పెద్దకడ్మూర్, ఎల్లంపల్లి గ్రామాల్లో ప్రజలనుద్దేశించి మాట ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు.
నిరుద్యోగులు, దళితులు, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలు తప్పిన సీఎం కేసీఆర్‌ది ఇంతకు గుండెనా?.. బండనా? అని ప్రశ్నించారు. రైతుబంధు ద్వారా కేవలం రూ.5 వేలు ఇస్తే బ్యాంకు వడ్డీలకు సరిపోవడం లేదన్నారు. ఎరువుల ధరలు పెంచి, సబ్సిడీలు ఎత్తివేసి, రైతుల నడ్డి విరుస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.
కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఆగస్టు 15 వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా మొదటి సంతకం చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. తనను వైఎస్సార్ బిడ్డగా ఆదరిస్తే వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment