
గురువారం సాయంత్రం గుడిగండ్ల గ్రామంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇంటివద్ద అల్పా హారం తీసుకుంటున్న రాహుల్. చిత్రంలో భట్టి, రేవంత్, సంపత్, ఉత్తమ్ తదితరులు
(భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 7న కేరళలో ప్రారంభమైన యాత్ర గురువారం నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. రాహుల్ పాదయాత్ర గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఎలిగండ్లకు చేరుకుంది. మొత్తం 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లోని 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటివరకు మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో 1,325 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారు.
తమిళనాడులో 2 జిల్లాలు, కేరళలో 7 జిల్లాలు, కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్‌లో 2 జిల్లాల్లో యాత్ర పూర్తి కాగా ప్రస్తుతం తెలంగాణలోని మొదటి జిల్లా (నారాయణపేట)లో యాత్ర జరుగుతోంది. రాష్ట్రంలో ఈ యాత్ర నవంబర్ 7 వరకు సాగనుంది. తెలంగాణలో యాత్ర పూర్తయితే 5 రాష్ట్రాలు, 26 జిల్లాల్లో 1,670 కిలోమీటర్ల మేర యాత్ర సాగినట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment