కోస్గి: నారాయణపేట జిల్లా కోస్గి మండలం బొల్వోన్‌పల్లి శివారులోని ఓ పొలంలో గులాబీరంగులో గొల్లభామ (మిడత) కనిపించింది. ఆదివారం ముశ్రీఫా జెడ్పీహెచ్‌ఎస్ సైన్స్ క్లబ్ విద్యార్థి మహేష్ ఈ కీటకాన్ని గుర్తించి ఉపాధ్యాయుడు మల్లేశానికి చెప్పారు.
కాగా, అర్థో పోడా వర్గానికి చెందిన ఆర్చిలిమమ్ వల్గెర్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే గడ్డి మైదానాల మిడతల్లో జన్యు ఉత్పరివర్తనాల ప్రభావంతో చాలా అరుదుగా ఇలా గులాబీరంగు సంతరించుకుంటాయని ఉపాధ్యాయుడు తెలిపారు. ఇలాంటి గులాబీ రంగు మిడతలు మొదటిసారి అమెరికాలోని టెక్సాస్, ఆస్టిన్‌లోని ఓక్‌హిల్ ప్రాంతంలో గుర్తించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment