రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం గుడిదొట్ల గ్రామంలో అవమానభారంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ధరూరు: రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం గుడిదొట్ల గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నర్శింహులు(30) అనే వ్యక్తి చింతపండు దొంగతనం చేశాడని కావరి రాము అనే వ్యక్తి గ్రామంలో పంచాయతీ పెట్టాడు. అంతేకాకుండా అతనిని గ్రామస్తులు చితకబాదారు. దాంతో అవమానంగా భావించిన నర్శింహులు ఇంటికెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామస్తులు అవమానించడంతోనే నర్శింహులు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.