అన్నానగర్(తమిళనాడు) : తురైయూర్‌లో బుధవారం పెళ్లి చూసేందుకు వచ్చిన ఓ యువతి అనుకోకుండా పెళ్లి కూతురైంది. తిరుచ్చి జిల్లా తురైయూర్‌కు చెందిన వెంకటేషన్‌కు మణ్ణచ్చనల్లూర్ సమీపంలోని ఎదుమలైకి చెందిన కనకతో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చితార్థం చేశారు. తురైయూర్‌లో ఉన్న కల్యాణ మండపంలో బుధవారం వివాహం చేయడానికి సిద్ధం చేశారు. బంధువులు, స్నేహితులు అందరూ మండపానికి చేరుకున్నారు. వరుడు, వధువు అలంకరించుకుంటున్నారు.
అప్పుడు వివాహ మండపానికి సినిమా తరహాలో హఠాత్తుగా పోలీసులు రావడంతో కలకలం రేపింది. పోలీసులు పెళ్లికుమార్తె తండ్రిని పిలిచి విచారణ జేశారు. ఆ బాలిక ఇంకా మైనరేనని ఇంకా 18 సంవత్సరాలు పూర్తికాలేదని పెళ్లి చేస్తే అరెస్టుచేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణ నిమిత్తం పెళ్లికుమార్తెను, ఆమె తండ్రిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు అవమానానికి గురయ్యామని మనస్తాపం చెందారు. ఆ సమయంలో బంధువులంతా కలసి చర్చించి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. వివాహానికి వచ్చిన వారిలో ఒకరికి పెళ్లి ఈడొచ్చిన కుమార్తె ఉందని, ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. అందరూ అంగీకరించడంతో ఆ యువతితో అదే ముహూర్తంలో అతడికిచ్చి వివాహం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment