బెల్లంపల్లి(మంచిర్యాల): బాలికను గర్భవతిని చేసిన యువకుడు పెళ్లి మాటకొచ్చేసరికి ముఖం చాటేశాడు. పెళ్లి చేస్తామని చెప్పి సదరు యువకుడి తల్లిదండ్రులు అబార్షన్ చేయించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడు, అతడి తల్లిదండ్రులపై నిర్భయ, అత్యాచారం కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్‌హెచ్‌వో జవ్వాజీ సురేష్ కథనం ప్రకారం.. బెల్లంపల్లి పట్టణ పరిధి 65డీప్ బస్తీకి చెందిన బాలిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. అదే బస్తీలో ఉన్న ఓ చర్చికి ప్రార్థనల కోసం కొన్నాళ్లుగా వెళ్తోంది. కొద్దిరోజులు అందులో పని చేసింది. చర్చి ఫాదర్ కుమారుడు సాలెం రాజు(18) బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. శారీరక సంబంధాన్ని కొనసాగించడంతో గర్భవతి అయింది.
శారీరక మార్పులను పరిశీలించిన బాలిక తల్లిదండ్రులు నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. రాజు తల్లిదండ్రులను నిలదీయగా.. తమ కుమారుడితో వివాహం జరిపిస్తామని, అబార్షన్ చేయించాలని సూచించారు. అబార్షన్ చేయించిన తర్వాత పెళ్లికి నిరాకరించారు. కులం తక్కువంటూ హేళనగా మాట్లాడారు. దీంతో బాలిక, ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడు సాలెం రాజు, అతడి తల్లిదండ్రులపై నిర్భయ, అత్యాచారం కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో వివరించారు.
బాలికను గర్భవతిని చేసి.. అబార్షన్!
Published Mon, Sep 25 2017 11:55 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement