Married person
-
వివాహితుడితో కలిసి ఉండేందుకు అనుమతిచ్చిన కోర్టు
జైపూర్ : రాజస్తాన్ హై కోర్టు సోమవారం సంచలన తీర్పిచ్చింది. వివాహితుడైన వ్యక్తిని ప్రేమించిన మహిళను అతనితోనే కలిసి జీవించవచ్చని పేర్కొంది. మొయినుద్దీన్ అబ్బాసి అనే వ్యక్తి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు సందీప్ మెహతా, వినిత్ కుమార్ మథూర్ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. వివరాలు.. రూపాల్ సోనీ అనే మహిళ(26) మొయినుద్దీన్ అబ్బాసీ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. 2018, జూలై 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోనీని ఇంట్లో బంధించారు. దాంతో మొయినుద్దీన్ తన భార్యను చూపించాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. విచారణలో భాగంగా గత ఏడాది మార్చి 13న పోలీసులు సోనీని కోర్టు ముందు హాజరుపర్చారు. అయితే విచారణలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొయినుద్దీన్‌కు ఇంతకు ముందే వివాహం జరిగిందని.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికి అతను సోనీని ఇంటర్ ఫెయిత్(నమ్మకం) వివాహం చేసుకున్నాడని.. తర్వాత దాన్ని రిజిస్టర్ చేయించాడని విచారణలో తెలీంది. ఆశ్యర్యపోయిన కోర్టు కేసుకున్న సున్నిత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని సోనీని ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్రభుత్వ మహిళా సంక్షేమ కేంద్రానికి పంపించింది. అనంతరం కోర్టు సోనీకి ఆమె భవిష్యత్తు గురించి.. తర్వాత ఎదుర్కొబోయే పరిణామాల గురించి కౌన్సిలింగ్ ఇప్పించింది. ఆపై నిన్నటి విచారణలో భాగంగా కోర్టు సోనీ నిర్ణయం గురించి ప్రశ్నించింది. అందుకు ఆమె తన బంధాన్ని కొనసాగిస్తానని.. మొయినుద్దీన్‌తోనే కలిసి ఉంటానని కోర్టుకు తెలిపింది. దాంతో కోర్టు ‘సదరు మహిళ మేజర్, పూర్తి మానసిక పరిపక్వత కల్గిన వ్యక్తి, హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందువల్ల కోర్టు ఆమె నిర్ణయాన్ని గౌరవించి మొయినుద్దీన్‌తో కలిసి ఉండేందుకు అనుమతిస్తూ తీర్పునిస్తున్ను’ట్లు పేర్కొంది. -
బాలికను వేధించిన వ్యక్తి రిమాండ్
మిరుదొడ్డి(దుబ్బాక) : మైనర్ బాలికను పెళ్లిపేరుతో వేధింపులకు గురి చేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు మిరుదొడ్డి ఎస్ఐ విజయ్ భాస్కర్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..మండల కేంద్రం మిరుదొడ్డిలో మన్నె శేఖర్(28) అనే వివాహితుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని కొంత కాలంగా వేధిస్తున్నాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శేఖర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ చెప్పారు. -
మైనర్‌ను గర్భవతిని చేసిన వ్యక్తిపై కేసు
పోడూరు : బాలికను గర్భవతిని చేసిన ఒక వివాహితుడిపై బుధవారం పోడూరులో కేసు నమోదు చేసినట్టు ఎస్సై కొప్పిశెట్టి రామకృష్ణ తెలిపారు. ఆయన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా తూర్పుపాలెం శివారు ఆనందరావుపేటకు చెందిన వివాహితుడు మూడే గోపాలం. అతడి భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరి ఇంటి సమీపంలో గోపాలానికి చెల్లెలు వరుసైన ఒక బాలిక (17) తరచూ పిల్లవాడిని ఆడించేందుకు అతడి ఇంటికి వస్తుండేది. గోపాలం భార్య ఉపాధ్యాయురాలు కావడంతో పగటి సమయంలో స్కూల్‌కు వెళ్లిపోయేది. ఈ నేపథ్యంలో ఆ బాలికను గోపాలం మాయమాటలుతో శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం బాలిక తొమ్మిదో నెల గర్భిణి. ఈ విషయం గోపాలం భార్యకు తెలియడంతో ఆ బాలికకు అబార్షన్ చేయించేందుకు వారు ప్రయత్నించారు. చివరకు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రామకృష్ణ నిందితుడైన గోపాలంపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీ భర్తను నాకిచ్చేయి ...
తన ప్రియుడిని దక్కించుకోవడానికి అతని భార్యతోనే రూ.10 లక్షలకు బేరమాడిన ప్రియురాలి వైనమిది. మదురై తిరుమంగళం సమీపానగల నయనార్పట్టికి చెందిన నాగరాజ్, వినోదిని (23) భార్యాభర్తలు. అయితే తిరుప్పరంగుండ్రం సమీపానగల హార్విపట్టికి చెందిన పేచ్చియమ్మాళ్ అలియాస్ సత్యా (23) మదురై హోంగార్డు విభాగంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నాగరాజ్‌కు, పేచ్చియమ్మాళ్తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇరువురూ విడిగా నివశిస్తు కుటుంబం నడిపారు. ఈ విషయం నాగరాజ్ భార్య వినోదినికి తెలిసింది. దీంతో వినోదినికి, పేచ్చియమ్మాళ్కు మధ్య తగాదా ఏర్పడింది. పేచ్చియమ్మాళ్ వినోదినికి రూ.10 లక్షలు అందజేస్తానని, నాగరాజ్‌ను తనకు విడిచిపెట్టాలని కోరింది. ఇందుకు పేచ్చియమ్మాళ్ తండ్రి వానమామలై, తల్లి పాండియమ్మాల్కు కూడా సహకరించారు. అంతేకాకుండా వీరు వినోదిని ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశారు. దీనికి సంబంధించి వినోదిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమంగళం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.