నెల క్రితమే వివాహం.. భర్తకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన భార్య | Newly Married Bride Was Four Months Pregnant | Sakshi
Sakshi News home page

నెల క్రితమే వివాహం.. భర్తకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన భార్య

Published Fri, Jun 17 2022 8:23 PM | Last Updated on Fri, Jun 17 2022 8:24 PM

Newly Married Bride Was Four Months Pregnant - Sakshi

వివాహామైన నెల రోజులకే నవ వధువు.. భర్తకు ఊహించని షాకిచ్చింది. ఆమె చేసిన పనికి వరుడి కుటుంబ సభ్యులు అందరి ముందు తలెత్తుకోలేకపోయారు. చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మహారాజ్​గంజ్‌కుచెందిన ఓ వ్యక్తి.. నెల రోజుల క్రితం వివాహం జరిగింది. ఇంతలో నవ వధువుకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమెను పరిశీలించిన వైద్యులు.. నవ వధువు నాలుగు నెలల గర్బవతి అని చెప్పారు. ఈ క్రమంలో వరుడితో సహా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు.

అనంతరం.. తనకు నెల రోజుల క్రితమే వివాహం జరిగిందని.. మరి నాలుగు నెలల గర్భవతి ఎలా అయిందని భర్త.. ఆమెను నిలదీశాడు. ఇక చేసేదేమీ లేక.. పోలీసులకు ఆశ్రయించాడు. వధువు కుటుంబం తనను మోసం చేశారని  భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: ప్రవీణ్‌తో ప్రేమ వివాహం.. ఇడ్లీ భాషాతో సహజీవనం.. చివరకు దారుణంగా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement