ఐజ్వాల్: ప్రసవ వేదనతో బాధపడుతున ఓ మహిళకు మిజోరాంకు చెందిన శాసనసభ్యుడు పురుడుపోశారు. సమయానికి ఎమ్మెల్యే స్పందించడంతో బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సోమవారం తన సొంత నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో శాసనసభ్యుడు, డాక్టర్ జెడ్ఆర్ థియామ్సంగ పర్యటించారు. ఈ సమయంలోనే నాగూర్ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. వృత్తిరీత్యా గైనకాలజీ డాక్టర్ అయిన థియామ్సంగ చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉండటంతో గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్ చేశారు. (మెసేజ్ చూశారని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య!)
అయితే గతంలో కూడా థియామ్సంగ మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న సిబ్బందికి వైద్యం సాయం అందించేందుకు 7 కిలోమీటర్లు నడిచి వార్తలో నిలిచారు. కాగా.. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) టికెట్‌పై పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్‌సంగను ఓడించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment