కోతి కోసం భారీ వేట..
కోతి కోసం భారీ వేట..
Published Wed, Nov 30 2016 4:24 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
హైదరాబాద్: కొద్ది రోజులుగా నగరంలోని సైదాబాద్ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న వానరాన్ని బంధించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) రంగంలోకి దిగింది. కమిషనర్ జనార్థన్ రెడ్డి ఆదేశాల మేరకు వెటర్నరీ, మున్సిపల్, జూపార్క్ సిబ్బంది.. భారీ సంరంజామాతో బుధవారం నుంచి కోతి ఆపరేషన్‌ను ప్రారంభించారు..
మతిస్థిమితం కోల్పోయిన ఓ కోతి.. సైదాబాద్ ప్రాంతంలోని ప్రజలపై తరచూ దాడులకు తెగబడుతోంది. ఇప్పటివరకు కనీసం 90 మందిని కరిచింది. దీంతో కొందరు కోతికి భయపడి ఇళ్లు వదిలి వెళ్ళిపోయారు. ఈ వ్యవహారంపై స్పందించాల్సిందిగా సైదాబాద్ కార్పొరేటర్ స్వర్ణలత జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్.. వెటర్నరి, జూ, మున్సిపల్ సిబ్బందిని తక్షణమే అక్కడికి పంపించి, కోతిని బంధించే ఏర్పాట్లు చేస్తామని హమీ ఇచ్చారు. (చదవండి.. కోతి భయంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి..)
Advertisement
Advertisement