
బావిలో వేలాడుతున్న రాజవ్వ
సాక్షి, సిరిసిల్ల: ఇటీవల కాలంలో కోతుల దాడులు పెరిగిపోయాయి. జనావాసాల్లోకి చొరబడి గుంపులు, గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కోతులు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఓ వృద్ధురాలు బావిలో పడింది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది.
రాచర్లబొప్పాపూర్‌కు చెందిన గంభీర్‌పూర్ రాజవ్వ (68) ఇంటి బయట కూర్చుని ఉండగా.. హఠాత్తుగా కోతుల గుంపు దాడి చేశాయి. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న బావిలో పడి మధ్యలో ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో సమీప ఇళ్లలోని యువకులు వచ్చి బావిలో వేలాడుతున్న రాజవ్వను తాళ్ల సహాయంతో బయటకు లాగారు. అపస్మారకస్థితిలో ఉన్న రాజవ్వను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది.
చదవండి: ప్రగతి కాదు.. సర్పంచ్‌లకు దుర్గతి.. ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment