
గంభీరావుపేట (సిరిసిల్ల): ఇష్టమైన నాయకులు, సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు.. ప్రతీ ఒక్కరు సెల్ఫీ దిగుతుంటారు. అలాగే, చంద్రకళ అనే వృద్ధురాలు కూడా మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీ దిగాలనుకుంది. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌కు ఆ బామ్మ ఎదురు వచ్చింది. ‘ఏం కావాలమ్మా?’అని కేటీఆర్ అడగగా.. ‘నీతో సెల్ఫీ దిగాలని వచ్చిన బిడ్డా..’అని బదులిచ్చింది. దీంతో కేటీఆర్ ఆమెతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే, కేటీఆర్ మాస్కు ధరించి ఉండటంతో ‘మాస్కు తీసి ఫొటో దిగు నాయనా..’అని అడిగింది. ఆమె కోరిక మేరకు కేటీఆర్ మాస్కు తీసి ఫొటో దిగారు.
(చదవండి: కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంతా గప్‌చుప్!)
(పాత వేపచెట్టు : భారీ జరిమానా)
Comments
Please login to add a commentAdd a comment