నిజామాబాద్(సదాశివనగర్): నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని గిడ్డ గ్రామంలో రాఘవాపురం లక్ష్మి(80) అనే వృద్ధురాలు ఇంట్లో ఉన్న బావిలో పడి మృతి చెందింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కొంత కాలంగా ఆమె గుండెనొప్పితో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. శనివారం ఉదయం లక్ష్మి బావిలో పడినట్లుగా పక్కింటివారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు భర్తగానీ, పిల్లలుగానీ ఎవరూ లేరు. ఆమె ఒంటరిగానే జీవిస్తోంది. ఆ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు బావిలో పడిందా అనేది తెలియాల్సి ఉంది.
బావిలో పడి వృద్ధురాలి మృతి
Published Sat, Feb 21 2015 6:22 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement