మదురై హైకోర్టు ఆదేశం
అన్నానగర్: పోలీసుల దాడిలో మరణించిన వ్యాన్ డ్రైవర్ భార్యకు అంగన్‌వాడీ వర్కర్‌గా ఉద్యోగం ఇవ్వాలని మధురై హైకోర్టు ఆదేశించింది. పోలీసుల దాడిలో మృతి చెందిన వ్యాన్ డ్రైవర్ భార్య తెన్‌కాశి జిల్లా శంకరన్ కోవిల్ ఉత్తర పుత్తూరు ప్రాంతానికి చెందిన మీనా మదురై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త మురుగన్ (36) వ్యాన్ డ్రైవర్. గత 8వ తేదీన అచ్చంపట్టి నుంచి మహిళలను వ్యానులో ఎక్కించుకుని శివరాత్రి ఉత్సవాల కోసం ఆలయానికి వెళ్లాడు.
ఆపై వ్యాన్ ఆటోను ఢీకొంది. ఈ విషయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు తన భర్తను అనుచితపదాలతో దూషించి, దాడి చేశారు. సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి చనిపోయాడని వైద్యులు తెలిపారు. భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆ ఫిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తమకు తగిన పరిహా రం ఇవ్వాలన్నారు.
సంబంధిత పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలంటూ ఆమె పిటిషన్‌లో పే ర్కొన్నారు. ఈ కేసులో తగిన ఉత్తర్వులు జారీ చేస్తా మని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ కేసు జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌కు అంగన్‌వాడీ కా ర్యకర్త ఉద్యోగం ఇవ్వాలని, అలాగే మురుగన్ కుటుంబానికి ఆది ద్రావిడర్ సంక్షేమ నిధి నుంచి తగిన పరిహారం అందించాలని కేసు విచారించిన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అలాగే మురుగన్ మృతి కేసును సీబీసీఐడీ పర్యవేక్షణలో తగు విచారణ జరపాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment