నంద్యాలలో మెడికల్ షాప్‌ను తనిఖీ చేస్తున్న ఔషధ నియంత్రణ అధికారి
కర్నూలు(హాస్పిటల్): రోగమేదైనా కరెక్టు మెడిసిన్ పడితే నివారణ అవుతుంది.. అదే రాంగ్ మెడిసిన్ ఇస్తే రోగ నివారణ దేవుడెరుగు ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి అవగాహన ఉన్న వారైతే వైద్యులు ఇచ్చిన ప్రిస్కిప్షన్ ఆధారంగా రోగులకు సరైన మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంది. అవగాహన లేని వ్యక్తి వైద్యం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో... అర్హతలేని వ్యక్తి ఇచ్చే మెడిసిన్ కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుంది. ఈ విషయం తెలిసినా ఔషధ దుకాణదారులు ఫార్మాసిస్టులు లేకుండానే మం దులు విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. అధికారులు సైతం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతుండడంతో పరిస్థితి మరింత తీవ్రతరమవుతోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాకు సంబంధించి కర్నూలుతోపాటు ప్రధాన పట్టణాల్లో 3వేలకుపైగా రిటైల్ మెడికల్‌షాపులు, 200కు పైగా హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.13కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందని అంచనా. నిబంధనల ప్రకారం ప్రతి దుకాణంలో తప్పనిసరిగా ఫార్మాసిస్టు పర్యవేక్షణలోనే మందులు విక్రయించాలి. కానీ 70 శాతానికి పైగా షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. కొందరు దుకాణదారులు ఫార్మసి సర్టిఫికెట్లు మా త్రం ఉంచుకుని, వారే ఫార్మాసిస్టుల అవతారం ఎత్తుతున్నారు. సర్టిఫికెట్లు ఇచ్చినందుకు డిప్లమా ఫార్మాసిస్టులకైతే నెలకు రూ.2,500 నుంచి రూ.3వే లు, బి.ఫార్మసీ వారికైతే రూ.4వేల నుంచి రూ.6వేల వరకు ప్రతిఫలంగా అందిస్తున్నారు.
స్థానిక దుకాణాలతో పాటు కార్పొరేట్ మెడికల్‌షాపుల్లోనూ అధి క శాతం ఇదే వ్యవహారం నడుస్తోంది. ఔషధ నియంత్రణశాఖలో సిబ్బందికొరత పేరుతో తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులంది తే తప్ప దాడులకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఫార్మాసిస్టు పర్యవేక్షణ లేకుం డా మందులు విక్ర యాలు సాగిస్తే రోగుల ప్రాణాలతో ఆడుకున్నట్లేనని అధికారులు చెబుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. మందులపై అవగాహన లేని వారు ఒక మందు బదులు మరో మందు ఇస్తే అది రోగుల ప్రాణానికి సంకటంగా మారుతుంది. కొన్నిసార్లు మందులు వికటిం చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. అయి నా అధిక శాతం దుకాణదారులు ఫార్మాసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తుండడం గమనార్హం.
అభయం ఇస్తున్న ఓ సంఘం నాయకుడు..
మెడికల్‌షాపు ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా ఔషధ నియంత్రణశాఖలో రిజిస్టర్ చేసుకోవాలి. నిబంధనల మేరకు సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అందజేయాలి. ఇంతకు ముందుగా ఓ సంఘం నా యకుని వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఆయన సంఘం పేరు చెప్పి రూ.10వేలు, అధికారులకంటూ మరో రూ.10వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా చెల్లిస్తే అధికారులు దుకాణం వద్దకు రాకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నట్లు తెలిసింది.
జిల్లా వ్యాప్తంగా అధికారుల దాడులు
రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రిటైల్ మెడికల్ షాపులపై ఆ శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు డి. హరిహర తేజ, కేఎస్ దాదా కళంధర్, అబిద్ అలీషేక్ నంద్యాల, ఆదోని, కర్నూలు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 20 దుకాణాలు తనిఖీ చేశారు. ఇందులో 15 దుకాణాల్లో ఫార్మాసిస్టులు లేకుండా మందుల అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment