పడకేసిన పల్లెవైద్యం | there are no doctors in villages | Sakshi
Sakshi News home page

పడకేసిన పల్లెవైద్యం

Published Tue, Nov 18 2014 3:24 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

there are no doctors in villages

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
 ఎల్లారెడ్డి నియోజకవర్గం
 ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని ఆరు మండలాలలో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పించింది. లింగంపేట, ఎర్రపహాడ్ (తాడ్వాయిమండలం) సదాశివనగర్, మత్‌మల్(ఎల్లారెడ్డి మండలం) నాగిరెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో ఫార్మాసిస్టులు,స్టాఫ్ నర్సులే రోగులకు వైద్య చికిత్సలు అందించారు. ఒక్క గాంధారి పీహెచ్‌సీలో వైద్యుడు రాజహౌళి మాత్రమే విదులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు. గాంధారి ఆసుపత్రిలో పనిచేసే మిగతా నలుగురు వైద్యులు, మిగతా మండలాలలో పని చేసే వైద్యులు కూడా స్థానికంగా నివాసం ఉండడంలేదు.

లింగంపేటలో స్టాఫ్ నర్సే రోగులకు, గర్భవతులకు వైద్య పరీక్షలు చేసారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు సెలవుపై వెళ్లగా ఫార్మాసిస్టు రోగులకు వైద్యం చేసా డు. ఎల్లారెడ్డి మండలం మత్‌మల్ ఆరోగ్య కేంద్రం లో  డాక్టర్ విజయ సమయానికి ఆస్పత్రికి వచ్చి వెం టనే క్లస్టర్ మీటింగ్ పేర ఎల్లారెడ్డికి వెళ్లి పోయారు. చాలాచోట్ల ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులు కానీ, సిబ్బంది సమయపాలనను పాటించడంలేదు.

 జుక్కల్ నియోజకవర్గం
 జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయం 9.30 నిమిషాలకు వెళ్లగా ఆటెండర్ ఉన్నా రు. అప్పటికే ఐదుగురు రోగులు వైద్యం కోసం ఆరోగ్యకేంద్రానికి వచ్చారు. ఇక్కడ స్టాఫ్ నర్సు కార్తిక మెటర్నటి  సెలవులో ఉండగా మల్లూర్ గ్రామ ఆరోగ్యకార్యకర్త 10 గంటలకు వచ్చారు. ఆరోగ్య కేంద్రం లో ప్రసూతి సౌకర్యం, కుటుంబనియంత్రణ ఆపరేషన్ థియేటర్ ఉన్నా సేవలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించగా అక్కడ ఐదుగురు వైద్యు లు, ఎఎన్‌మ్‌లు, సిబ్బంది పూర్తిగా విధుల్లో ఉన్నారు.

జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల నుంచి వైద్యులు వస్తుండటంతో రోగులకు సేవలు సకాలంలో అందడం లేదు. ఆస్పత్రిభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు, వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు విధుల్లో ఉన్నారన్నా రు. వారాంతపు సంతకావడంతో రోగులు వస్తారని వైద్యులు విధులకు వచ్చారన్నారు. బిచ్కుంద మం డల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 10.30 సందర్శించగా వైద్యుడు వచ్చారు.

 బోధన్ నియోజకవర్గం
 బోధన్ నియోజకవర్గంలోని సాలూర, ఎడపల్లి, రెం జల్ పీహెచ్‌సీల వైద్యులు స్థానికంగా నివాసం ఉం డడం లేదు. బోధన్, నిజామాబాద్ పట్టణ కేంద్రాల్లో ఉంటున్నారు. సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పీహెచ్‌సీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ చూస్తున్నారు. నవీపేట, రెంజల్, సాలూర పీహెచ్‌సీలు 24 గంటలు సేవలందించాలి. కాని రెగ్యులర్ వైద్యులు లేక రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. కుటుంబ ని యంత్రణ ఆపరేషన్లకు మంగళం పాడారు. సాలూ ర పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ స్వప్న ఇన్‌చార్జిగా ఉన్నారు.

రెగ్యులర్ పోస్టు వర్ని పీహెచ్‌సీ. అందువల్ల సోమవారం విధులకు రాలేదు. ఉదయం 9 నుంచి రోగులు డాక్టర్ కోసం నిరీక్షించారు. సాలూర పరిసర గ్రామాలైన తగ్గెలి, ఖాజాపూర్ మందర్న గ్రామాల నుంచి రోగులు వచ్చారు. డాక్టర్ బోధన్ పట్టణ కేంద్రంలో ఉంటారు. కాన్పుల సంఖ్య చాల తక్కువ, ఈ నెలలో మూడు కాన్పులు మాత్రమే జరి గాయి. మందులపై పూర్తి అవగాహన లేని ఏఎన్‌ఎం లు  మందులను పంపిణీ  చేస్తున్నారు. రెగ్యులర్ వైద్యులు లేక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ థియేటర్ మూడేళ్లుగా వృథాగా ఉంది. జనరేటర్ మూలపడేశారు. ఆపరేటర్‌లేక కంప్యూటర్లు వృథాగా ఉన్నా యి. ఫార్మాసిస్ట్ కూడా ఇన్‌చార్జియే ఉన్నారు. నవీపే ట పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులుండగా ఒక్కరే విధులకు వచ్చారు.

 బాల్కొండ  నియోజకవర్గం
 బాల్కొండ  నియోజకవర్గం మోర్తాడ్ మండల కేం ద్రంలోని 30 పడకల ఆస్పత్రిలో ఐదుగురు వైద్యుల కు గాను దంత వైద్యురాలు లక్ష్మి ఒక్కరే విధులు నిర్వహించారు. రోగుల తాకిడి ఉన్నా వైద్యులు లే రు. కిసాన్‌నగర్ ఆస్పత్రిలో వైద్యులు సమయంలో అందుబాటులో ఉన్నారు. రోగుల తాకిడి బాగానే ఉంది. వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అందుబాటులో వైద్యులు ఉన్నారు. మందులు బాగానే ఉన్నా యి. కమ్మర్‌పల్లి మండలంలోని, చౌట్‌పల్లిలో పీహెచ్‌సీలో వైద్యురాలు సౌజన్న హాజరు కాక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది సమయ పాలన పాటించక పోవడంతో వైద్యం అం దడం లేదు. భీమ్‌గల్ ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించినా ఆపరేషన్ థియేటర్ చిన్నగా ఉంది. వసతులు లేవు.

 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం
 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లిలో వైద్యులు స్థానికంగా ఉండటం లేదు. 24 గంటల ఆస్పత్రి పేరుకే ఉంది. రాత్రి పూట వైద్యులు అందుబాటులో లేక ఇన్‌పేషంట్లు రావడం లేదు. మందులు అందుబాటులో ఉన్నాయి. రెండున్నర సంవత్సరాలుగా ఫార్మాసిస్టు లేడు. ఒక గర్భిణీ ఆస్పత్రికి రాగా, వైద్యులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి సిపార్సు చేశారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా డీజిల్ లేదని సమాధానం వచ్చింది. ధర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉండగా.. ఉన్న సిబ్బంది సైతం పలువురు స్థానికంగా ఉండటం లేదు. జక్రాన్‌పల్లి మండలంలోను వైద్యులు స్థాని కంగా ఉండటం లేదు. సిబ్బంది కొరత ఉంది. మందులు అందుబాటులో ఉన్నాయి. సరికొండ ప్రభుత్వ ఆస్పత్రికి మెడికల్ ఆఫీసర్ ఆలస్యంగా వచ్చారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.

 జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో...    
 జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 120 మంది వైద్యుల కుగాను 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్‌నర్సులు-94 పోస్టులు, ఎఎన్‌ఎంలు-86 పోస్టులు, ల్యాబ్‌టెక్నిషన్‌లు -73 పోస్టులు , ఫార్మాసిస్టులు -46 పోస్టులు, నాల్గవ తరగతి ఉద్యోగులు-115 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. 14 క్లస్టర్ ఆసుపత్రులు ఉన్నా యి. వీటి పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది.

అలాగే వైద్య విధాన పరిషత్‌కు సంబంధించి జిల్లా ఆస్పత్రితో పాటు , కామారెడ్డి, బోధన్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఎల్లారెడ్డి, దోమకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి ప్రస్తుతం మెడికల్ కళాశాలకు అనుబంధం ఉండడంతో  జిల్లా ఆస్పత్రి ని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది.  డీసీహెచ్‌ఎస్ కార్యాలయానికి సొంత భవనం లేదు. నాలుగు సంవత్సరాలుగా ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్ కొనసాగుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement