Academy of medical practice
-
వైద్య సిబ్బందికే ఆరోగ్య కార్డుల్లేవ్...
- వైద్య విధాన పరిషత్‌లో డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగుల గగ్గోలు - జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే 6,500 మంది అవస్థ - ట్రెజరీ ద్వారా వేతనాలు పొందకపోవడమే వారికి శాపం - ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదంటోన్న ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్ వారంతా జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే వైద్య సిబ్బంది. వేలాది మంది రోగులకు నిత్యం సేవలు అందిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఆరోగ్యకార్డులు ఇచ్చినా... వైద్య ఆరోగ్యశాఖలో పరిధిలో పనిచేసే ఈ వైద్య సిబ్బందికి మాత్రం ఆరోగ్యకార్డులు ఇప్పటికీ ఇవ్వలేదు. వారు వైద్య సేవలు చేసే చోటే... తమకు జబ్బు చేస్తే మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇదీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల దుస్థితి. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులే అయినా వారికి ఆరోగ్యకార్డులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకటో తేదీన వేతనాలు అందుకుంటే... వీరు మాత్రం నెలాఖరు వరకు ఆగాల్సిన పరిస్థితి దాపురించింది. గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకోలేని దుస్థితి కూడా నెలకొంది. అంతేగాక మూడేళ్లుగా పదోన్నతులు లేవు. శాశ్వత ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే... అందులో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరం. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపించడంలేదన్న ఆరోపణలున్నాయి. 105 వైద్య విధాన ఆసుపత్రులు... రాష్ట్రంలో 105 వైద్య విధాన పరిషత్ పరిధిలో ఆసుపత్రులున్నాయి. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లన్నీ వైద్య విధాన పరిషత్ పరిధిలోనే పనిచేస్తున్నాయి. జిల్లాల్లో కీలకమైన వైద్య సేవలు అందించేది ఈ ఆసుపత్రులేననేది తెలిసిందే. ఆయా ఆసుపత్రుల్లో 6,500 మంది శాశ్వత ఉద్యోగులు, 1,500 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో దాదాపు 4 వేల మంది వరకు డాక్టర్లు ఉన్నారు. ఆ ఆసుపత్రుల్లో ప్రసూతి నుంచి మొదలు పెద్దస్థాయి శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాద కేసులు, సిటీ స్కానింగ్, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుంటాయి. ఎయిడ్స్, టీబీ, స్వైన్‌ఫ్లూ వంటి రోగులకూ వీరు సేవలందిస్తున్నారు. జిల్లాల్లో ఇంతటి కీలకమైన ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందిపై సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. 1996లో వైద్య విధాన పరిషత్‌ను అటానమస్ సంస్థగా దీన్ని నెలకొల్పారు. అయితే అది తన కాళ్ల మీద నిలబడే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వమే వైద్య విధాన పరిషత్‌ను తన స్వాధీనంలోకి తీసుకుంది. అయితే ఇందులో పనిచేసే ఉద్యోగులను 010 పద్దు కింద ట్రెజరీ పరిధిలోకి తీసుకురాకపోవడంతో వీరి వేతనాల కోసం ప్రభుత్వం రెండు మూడు నెలలకోసారి విడుదల చేస్తుంది. దీంతో వారికి సకాలంలో వేతనాలు రావడంలేదు. ట్రెజరీ పరిధిలో లేరన్న కారణం... ఇతరత్రా సాంకేతిక కారణాలు చూపించి ప్రభుత్వ ఉద్యోగులైనా వీరికి ఆరోగ్యకార్డులు ఇవ్వలేదు. ఆందోళనలో కాంట్రాక్టు ఉద్యోగులు... మరోవైపు వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 158 మంది కాంట్రాక్టు ఉద్యోగులు కలెక్టర్ల అధ్యక్షతన డీఎస్సీ, రోస్టర్ విధానం అనుసరించి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే నియమితులయ్యారు. డీఏ, హెచ్ఆర్ఏ పొందుతున్నారు. కానీ వీరు క్రమబద్దీకరణకు నోచుకోవడంలేదు. దీంతో ఏడేళ్లుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. ఇక ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐలను ఏజెన్సీలు వారి ఖాతాల్లో వేయడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు. సర్కారుకు ఎన్నిసార్లు చెప్పినా: జూపల్లి రాజేందర్, వైద్య ఉద్యోగుల నేత వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఆరోగ్య కార్డులు ఇవ్వాలని... వీరిని ట్రెజరీ పరిధిలోకి తీసుకురావాలని ఎన్నిసార్లు కోరినా సర్కారు పట్టించుకోవడంలేదు. -
సంక్షోభంలో వైద్యం!
నెల్లూరు(అర్బన్): వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న సుమారు 40 మంది డాక్టర్లు ఒక్కసారిగా బదిలీ కానున్నట్లు సమాచారం. నగరంలోని డీఎస్ఆర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, రేబాల చిన్న పిల్లల ఆస్పత్రి, జూబ్లీ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రిల్లో పనిచేస్తున్న 40 మంది డాక్టర్లను పరిషత్ ఉన్నతాధికారులు కౌన్సెలింగ్ నిమిత్తం బుధవారం హైదరాబాద్‌కు రావాలని ఆదేశించారు. దీంతో వీళ్లు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పై ఆస్పత్రులు డీఎంసీ (డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) ఆధీనంలోకి వెళ్లాయి. దీంతో ఇక్కడ పనిచేసే డాక్టర్లు కాలేజీలో పాఠాలు చెబుతూ, రోగులకు చికిత్సనందించాలి. ఈ నేపథ్యంలో ఆ ఆస్పత్రుల్లో పరిషత్ కింద పనిచేస్తున్న డాక్టర్లలో అర్హులను తీసుకోగా, మిగిలిన వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోగులకు తప్పని అవస్థలు డాక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించుకోవడంతో ఆస్పత్రుల్లో రోగులకు తిప్పలు తప్పలేదు. డీఎస్ఆర్, రేబాల, జూబ్లీ, టీబీ ఆస్పత్రులకు రోజూ వేలసంఖ్యలోజిల్లా నలుమూలన నుంచి రోగులు వస్తుంటారు. డాక్టర్లు లేకపోవడంతో బుధవారం వీరంతా ఇబ్బందులు పడ్డారు. మెడికల్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆయా ఆస్పత్రులకు వెళ్లాలని చెప్పారు. అయితే కొంతమంది మాత్రమే డీఎస్ఆర్కి వెళ్లి రోగులకు చికిత్సనందించారు. బోధనా.. చికిత్స? ఎటూతేలని వైనం ఇదిలా ఉండగా 40 మంది వైద్యులు హైదరాబాద్‌కు వెళ్తున్న నేపథ్యంలో డీఎస్ఆర్ ఆస్పత్రి ఉన్నతాధికారులు కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఆయా ఆస్పత్రులకు వెళ్లాలని డ్యూటీలు వేశారు. అలాగే కొంతమంది కాలేజీ సిబ్బందిని ఆ ఆస్పత్రుల పర్యవేక్షణ కోసం నియమించారు. అయితే దీనిని కాలేజీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము పాఠాలు చెప్పేందుకు వచ్చామని, చికిత్స చేసేందుకు కాదని కొంతమంది డాక్టర్లు అధికారుల వద్ద తెగేసిచెప్పినట్లు తెలిసింది. సిబ్బంది తాము కాలేజీ వ్యవహారాలు చూసుకుంటూ మిగతా పనులు చేయాలంటే పెనుభారం అవుతుందని చెప్పినట్లు సమాచారం. బదిలీల కౌన్సెలింగ్ కోసం వెళ్లిన డాక్టర్లు ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీ డాక్టర్లు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండరని, తమను ఉన్నట్టు ఉండి బదిలీ చేయడం సబబు కాదని అంటున్నారు. పరిషత్ ఉన్నతాధికారులు ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా డాక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తంగా రోగుల పాలిట శాపంగా మారిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. -
పడకేసిన పల్లెవైద్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని ఆరు మండలాలలో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పించింది. లింగంపేట, ఎర్రపహాడ్ (తాడ్వాయిమండలం) సదాశివనగర్, మత్మల్(ఎల్లారెడ్డి మండలం) నాగిరెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో ఫార్మాసిస్టులు,స్టాఫ్ నర్సులే రోగులకు వైద్య చికిత్సలు అందించారు. ఒక్క గాంధారి పీహెచ్సీలో వైద్యుడు రాజహౌళి మాత్రమే విదులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు. గాంధారి ఆసుపత్రిలో పనిచేసే మిగతా నలుగురు వైద్యులు, మిగతా మండలాలలో పని చేసే వైద్యులు కూడా స్థానికంగా నివాసం ఉండడంలేదు. లింగంపేటలో స్టాఫ్ నర్సే రోగులకు, గర్భవతులకు వైద్య పరీక్షలు చేసారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు సెలవుపై వెళ్లగా ఫార్మాసిస్టు రోగులకు వైద్యం చేసా డు. ఎల్లారెడ్డి మండలం మత్మల్ ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ విజయ సమయానికి ఆస్పత్రికి వచ్చి వెం టనే క్లస్టర్ మీటింగ్ పేర ఎల్లారెడ్డికి వెళ్లి పోయారు. చాలాచోట్ల ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులు కానీ, సిబ్బంది సమయపాలనను పాటించడంలేదు. జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయం 9.30 నిమిషాలకు వెళ్లగా ఆటెండర్ ఉన్నా రు. అప్పటికే ఐదుగురు రోగులు వైద్యం కోసం ఆరోగ్యకేంద్రానికి వచ్చారు. ఇక్కడ స్టాఫ్ నర్సు కార్తిక మెటర్నటి సెలవులో ఉండగా మల్లూర్ గ్రామ ఆరోగ్యకార్యకర్త 10 గంటలకు వచ్చారు. ఆరోగ్య కేంద్రం లో ప్రసూతి సౌకర్యం, కుటుంబనియంత్రణ ఆపరేషన్ థియేటర్ ఉన్నా సేవలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించగా అక్కడ ఐదుగురు వైద్యు లు, ఎఎన్మ్లు, సిబ్బంది పూర్తిగా విధుల్లో ఉన్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల నుంచి వైద్యులు వస్తుండటంతో రోగులకు సేవలు సకాలంలో అందడం లేదు. ఆస్పత్రిభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు, వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు విధుల్లో ఉన్నారన్నా రు. వారాంతపు సంతకావడంతో రోగులు వస్తారని వైద్యులు విధులకు వచ్చారన్నారు. బిచ్కుంద మం డల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 10.30 సందర్శించగా వైద్యుడు వచ్చారు. బోధన్ నియోజకవర్గం బోధన్ నియోజకవర్గంలోని సాలూర, ఎడపల్లి, రెం జల్ పీహెచ్‌సీల వైద్యులు స్థానికంగా నివాసం ఉం డడం లేదు. బోధన్, నిజామాబాద్ పట్టణ కేంద్రాల్లో ఉంటున్నారు. సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పీహెచ్‌సీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ చూస్తున్నారు. నవీపేట, రెంజల్, సాలూర పీహెచ్‌సీలు 24 గంటలు సేవలందించాలి. కాని రెగ్యులర్ వైద్యులు లేక రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. కుటుంబ ని యంత్రణ ఆపరేషన్లకు మంగళం పాడారు. సాలూ ర పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ స్వప్న ఇన్చార్జిగా ఉన్నారు. రెగ్యులర్ పోస్టు వర్ని పీహెచ్సీ. అందువల్ల సోమవారం విధులకు రాలేదు. ఉదయం 9 నుంచి రోగులు డాక్టర్ కోసం నిరీక్షించారు. సాలూర పరిసర గ్రామాలైన తగ్గెలి, ఖాజాపూర్ మందర్న గ్రామాల నుంచి రోగులు వచ్చారు. డాక్టర్ బోధన్ పట్టణ కేంద్రంలో ఉంటారు. కాన్పుల సంఖ్య చాల తక్కువ, ఈ నెలలో మూడు కాన్పులు మాత్రమే జరి గాయి. మందులపై పూర్తి అవగాహన లేని ఏఎన్ఎం లు మందులను పంపిణీ చేస్తున్నారు. రెగ్యులర్ వైద్యులు లేక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ థియేటర్ మూడేళ్లుగా వృథాగా ఉంది. జనరేటర్ మూలపడేశారు. ఆపరేటర్లేక కంప్యూటర్లు వృథాగా ఉన్నా యి. ఫార్మాసిస్ట్ కూడా ఇన్‌చార్జియే ఉన్నారు. నవీపే ట పీహెచ్సీలో ముగ్గురు వైద్యులుండగా ఒక్కరే విధులకు వచ్చారు. బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేం ద్రంలోని 30 పడకల ఆస్పత్రిలో ఐదుగురు వైద్యుల కు గాను దంత వైద్యురాలు లక్ష్మి ఒక్కరే విధులు నిర్వహించారు. రోగుల తాకిడి ఉన్నా వైద్యులు లే రు. కిసాన్‌నగర్ ఆస్పత్రిలో వైద్యులు సమయంలో అందుబాటులో ఉన్నారు. రోగుల తాకిడి బాగానే ఉంది. వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అందుబాటులో వైద్యులు ఉన్నారు. మందులు బాగానే ఉన్నా యి. కమ్మర్పల్లి మండలంలోని, చౌట్పల్లిలో పీహెచ్సీలో వైద్యురాలు సౌజన్న హాజరు కాక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది సమయ పాలన పాటించక పోవడంతో వైద్యం అం దడం లేదు. భీమ్‌గల్ ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించినా ఆపరేషన్ థియేటర్ చిన్నగా ఉంది. వసతులు లేవు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లిలో వైద్యులు స్థానికంగా ఉండటం లేదు. 24 గంటల ఆస్పత్రి పేరుకే ఉంది. రాత్రి పూట వైద్యులు అందుబాటులో లేక ఇన్‌పేషంట్లు రావడం లేదు. మందులు అందుబాటులో ఉన్నాయి. రెండున్నర సంవత్సరాలుగా ఫార్మాసిస్టు లేడు. ఒక గర్భిణీ ఆస్పత్రికి రాగా, వైద్యులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి సిపార్సు చేశారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా డీజిల్ లేదని సమాధానం వచ్చింది. ధర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉండగా.. ఉన్న సిబ్బంది సైతం పలువురు స్థానికంగా ఉండటం లేదు. జక్రాన్‌పల్లి మండలంలోను వైద్యులు స్థాని కంగా ఉండటం లేదు. సిబ్బంది కొరత ఉంది. మందులు అందుబాటులో ఉన్నాయి. సరికొండ ప్రభుత్వ ఆస్పత్రికి మెడికల్ ఆఫీసర్ ఆలస్యంగా వచ్చారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో... జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 120 మంది వైద్యుల కుగాను 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్‌నర్సులు-94 పోస్టులు, ఎఎన్ఎంలు-86 పోస్టులు, ల్యాబ్‌టెక్నిషన్‌లు -73 పోస్టులు , ఫార్మాసిస్టులు -46 పోస్టులు, నాల్గవ తరగతి ఉద్యోగులు-115 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. 14 క్లస్టర్ ఆసుపత్రులు ఉన్నా యి. వీటి పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది. అలాగే వైద్య విధాన పరిషత్‌కు సంబంధించి జిల్లా ఆస్పత్రితో పాటు , కామారెడ్డి, బోధన్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఎల్లారెడ్డి, దోమకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి ప్రస్తుతం మెడికల్ కళాశాలకు అనుబంధం ఉండడంతో జిల్లా ఆస్పత్రి ని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. డీసీహెచ్ఎస్ కార్యాలయానికి సొంత భవనం లేదు. నాలుగు సంవత్సరాలుగా ఇన్చార్జి డీసీహెచ్ఎస్ కొనసాగుతున్నారు.