అనుమానాస్పద స్థితిలో మహిళా ఫార్మసిస్టు మృతి | lady pharmacist death in her home subsidies | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళా ఫార్మసిస్టు మృతి

Published Wed, Sep 27 2017 11:31 AM | Last Updated on Wed, Sep 27 2017 1:36 PM

lady pharmacist death in her home subsidies

ఒడిశా ,మహిళా ఫార్మసిస్టు

ఒడిశా ,భువనేశ్వర్‌ : నగరానికి చెందిన ఓ మహిళా ఫార్మసిస్టు అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతిచెందింది.  ఆమె హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక చంద్రశేఖర్‌పూర్‌ కానన్‌ విహార్‌ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన మేరకు ఆమె మెడపై కత్తి గాట్లను గుర్తించారు. ఈ పరిస్థితుల్లో ఆమె హత్యకు గురైనట్లు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఫోరెన్సిక్‌ విభాగం రంగంలోకి దిగి ఈ మృతిపై దర్యాప్తు చేపట్టింది.

నగర కమిషనరేట్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా ఎరసమాకు చెందిన హసీనా దాస్‌   స్థానిక అపోలో ఆస్పత్రిలో  ఫార్మసిస్టుగా పని చేస్తోంది.  పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని స్థానిక క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించినట్లు జంట నగరాల పోలీసు కమిషనర్‌  వై బి ఖురానియా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement