switched off
-
సౌండ్ వినలేక పేషెంట్ వెంటిలేటర్‌నే ఆపేసింది! నివ్వెరపోయిన పోలీసులు
వెంటిలేటర్‌పై పేషెంట్ ఉన్నాడంటే ప్రతిక్షణం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు లెక్క. ఐతే అదే గదిలో ఉన్న మరో మహిళా పేషెంట్ తన సహ పేషెంట్ వెంటిలేటర్ శబ్దాన్ని భరించలేక ఆపేసింది. దీంతో ఆమె హత్యానేరం కింద జైలుపాలైంది. వివరాల్లోకెళ్తే...72 ఏళ్ల జర్మన్ మహిళ తన రూమ్మేట్ వెంటిలేటర్‌ని స్విచ్ఆఫ్ చేసింది. ఆమెకి మెషిన్ శబ్ధం చికాకు కలిగించిందని ఆపేసింది. ఇలా రెండు సార్లు వెంటిలేటర్‌ని స్విచ్ ఆఫ్ చేసింది. ఈ ఘటన నవంబర్ 29న జర్మన్‌లోని మాన్హీమ్ నగరంలోని ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఐతే వైద్యులు సదరు మహిళకి పేషెంట్‌కి వెంటిలేటర్ ఎంత కీలకమో చెప్పినా కూడా మళ్లీ ఆపేసిందని వైద్యులు చెబుతున్నారు. అంతేగాదు వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్ ప్రమాదంలో లేడని, ఇంకా ఇంటిన్సెవ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిచాల్సి ఉండటంతో ఆ పేషెంట్‌ని అలా ఉంచినట్లు తెలిపారు. దీంతో పోలీసులు సదరు వృద్ధ మహిళను కావలనే ఇలా చేసి సదరు రోగిపై హత్యయత్నానికి పాల్పడి ఉండవచ్చని అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమెను బుధవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచి జైలుకి తరలించారు. -
కరెంట్ ఆదాకు ఓ పరికరం!
స్విచాఫ్ చేయడానికి ‘సటిల్’ విద్యుత్ వినియోగం ఎక్కడ ఎక్కువగా దుర్వినియోగం అవుతోందన్న అంశాన్ని పరిశోధించింది జేఅండ్జీ ఇన్నోవేషన్. ఆశ్చర్యకరంగా 25–30 శాతం అనవసర విద్యుత్ ఖర్చు జరుగుతున్నది హోటల్స్, హాస్టళ్లలోనే అని తేలింది. దీనికి పరిష్కారం చూపించేందుకే సటిల్ పేరిట ఒక డివైజ్‌ను రూపొందించింది. ‘‘ఈ డివైజ్‌ను అమర్చిన చోట ఇది అనవసరంగా ఖర్చవుతున్న విద్యుత్‌ను గుర్తిస్తుంది. వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఈ డివైజ్‌తో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రోజుకు 4 లక్షల యూనిట్ల కరెంట్‌ను ఆదా చేయవచ్చు. దీన్ని హోటల్స్, హాస్టల్స్, సర్వీస్ అపార్ట్మెంట్లలో వినియోగించుకోవచ్చు’’ అని సంస్థ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లో ఈ డివైజ్‌లను మార్కెటింగ్ చేస్తున్నామన్నారు. ‘‘ఒక్కో డివైజ్ ఖరీదు రూ.850. ఇప్పటివరకు ఆయా నగరాల్లో 60 ప్రాపర్టీల్లో వీటిని అమర్చాం. ఒక్కో డివైజ్‌కు ఏడాది పాటు వారంటీని ఇస్తాం. ఆ తర్వాత సర్వీసునందిస్తాం’’ అని వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...