కరెంట్‌ ఆదాకు ఓ పరికరం! | new gadget for current saving Satil switched off | Sakshi
Sakshi News home page

కరెంట్‌ ఆదాకు ఓ పరికరం!

Published Sat, Jan 14 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

కరెంట్‌ ఆదాకు ఓ పరికరం!

కరెంట్‌ ఆదాకు ఓ పరికరం!

 స్విచాఫ్‌ చేయడానికి ‘సటిల్‌’
విద్యుత్‌ వినియోగం ఎక్కడ ఎక్కువగా దుర్వినియోగం అవుతోందన్న అంశాన్ని పరిశోధించింది జేఅండ్‌జీ ఇన్నోవేషన్‌. ఆశ్చర్యకరంగా 25–30 శాతం అనవసర విద్యుత్‌ ఖర్చు జరుగుతున్నది హోటల్స్, హాస్టళ్లలోనే అని తేలింది. దీనికి పరిష్కారం చూపించేందుకే సటిల్‌ పేరిట ఒక డివైజ్‌ను రూపొందించింది. ‘‘ఈ డివైజ్‌ను అమర్చిన చోట ఇది  అనవసరంగా ఖర్చవుతున్న విద్యుత్‌ను గుర్తిస్తుంది. వెంటనే స్విచ్‌ ఆఫ్‌ చేస్తుంది.

ఈ డివైజ్‌తో బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో రోజుకు 4 లక్షల యూనిట్ల కరెంట్‌ను ఆదా చేయవచ్చు. దీన్ని హోటల్స్, హాస్టల్స్, సర్వీస్‌ అపార్ట్‌మెంట్లలో వినియోగించుకోవచ్చు’’ అని సంస్థ ఫౌండర్‌ ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లో ఈ డివైజ్‌లను మార్కెటింగ్‌ చేస్తున్నామన్నారు. ‘‘ఒక్కో డివైజ్‌ ఖరీదు రూ.850. ఇప్పటివరకు ఆయా నగరాల్లో 60 ప్రాపర్టీల్లో వీటిని అమర్చాం. ఒక్కో డివైజ్‌కు ఏడాది పాటు వారంటీని ఇస్తాం. ఆ తర్వాత సర్వీసునందిస్తాం’’ అని వివరించారు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

Advertisement
Advertisement