
బెర్లిన్: వైద్యం చేయడంలో విసుగెత్తి జర్మనీకి చెందిన ఓ మగ నర్సు ఏకంగా 106 మంది రోగులను పొట్టనబెట్టుకున్నాడు. ప్రాణాంతక మందులను ఇచ్చి వీరిని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డెల్మెన్‌హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్(41) 2015లో ఓ ఇద్దరి రోగులను హత్య చేసి, మరో ఇద్దరిపై హత్యాయత్నం జరిపాడన్న కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే అతను మరిన్ని హత్యలకు పాల్పిడ్డాడని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 90 మంది రోగులను అతను హతమార్చినట్లు పోలీసులు అదే ఏడాది ఆగష్టులో ప్రకటించారు. దీంతో జర్మనీ కోర్టు హోగెల్‌కి జీవిత కాల జైలు శిక్ష విధించింది.
ఈ కేసు బాధితులు మరింతమంది పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి దర్యాప్తు జరిపిన పోలీసులు తాజాగా మరో 16 మందిని కూడా నీల్స్ హోగెల్ చంపినట్లు గురువారం వెల్లడించారు. ఈ హత్యలను 1999-2005లో నీల్స్ పనిచేసిన రెండు ఆసుపత్రిలో జరిపినట్లు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా రోగులకు ప్రాణాంతక మందులు ఇంజెక్ట్ చేసి చంపేవాడు. 2005లోనే ఓ రోగికి విషపు ఇంజెక్షన్ ఇవ్వటం గుర్తించిన మరో నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే నీల్స్‌ను అరెస్టు చేయగా.. అతనికి కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఇవన్నీ వైద్యం చేయడంలో విసుగు చెందే చంపినట్లు నిందితుడు అంగీకరించందని పోలీసులు పేర్కొన్నారు.
(నీల్స్ హోగెల్-ఫైల్ ముఖానికి అడ్డుపెట్టుకున్న వ్యక్తి)
Comments
Please login to add a commentAdd a comment