మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి... | Improving your talent ... | Sakshi
Sakshi News home page

మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి...

Published Wed, Sep 24 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి...

మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి...

సాంకేతికం
 
మీరు కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? గణితంలో మీ ప్రతిభను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘అన్‌లాక్ యువర్ బ్రెయిన్’ అనే ఈ ఆండ్రాయిడ్ యాప్ రకరకాల భాషలు నేర్పిస్తుంది. చరిత్రను బోధిస్తుంది. దీంతో పాటు రకరకాల పరీక్షలు పెట్టి, మీ గణిత ప్రతిభను మెరుగుపరుస్తుంది. ప్రశ్నకు సరియైన సమాధానం కోసం రెండు నుంచి మూడు సెకండ్ల సమయం ఇస్తుంది. ‘‘ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ యాప్ ఉపకరిస్తుంది’’ అంటున్నాడు సిమన్.
 
జర్మన్‌కు చెందిన సిమన్ సెమెండ్ ఈ యాప్‌ను తయారుచేశాడు. పదసంపద, గణిత ప్రశ్నలతో ప్రస్తుతం ఈ యాప్‌లో ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని కొత్త సబ్జెక్ట్‌లను రాబోయే రోజుల్లో చేర్చే అవకాశం ఉంది. ఆ యాప్ శక్తిని అంచనా వేయడానికి జర్మనీలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పోట్స్‌డమ్’ కొన్ని పరీక్షలు నిర్వహించింది. ఇందులో 13,285 మంది పాల్గొన్నారు. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నవారు రెండు వారాల్లో వివిధ సబ్జెక్ట్‌లలో తమ ప్రతిభను గణనీయంగా మెరుగుపరుచుకున్నట్లు ఈ పరీక్షలో తేలింది.
 
‘‘ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే  ప్రతి సబెక్ట్‌కు సంబంధించి గుట్టలు గుట్టలుగా సమాచారం ఉంటుంది. దీంతో ఎక్కడ మొదలుపెట్టాలో వారికి తెలియడం లేదు. కానీ, ఈ ‘అన్‌లాక్ యువర్ బ్రెయిన్’ యాప్ ఆ అయోమయాన్ని నివారిస్తుంది. సమాచారాన్ని చిన్న చిన్న ముక్కలుగా అందుబాటులో ఉంచి, ఎంచుకున్న సబ్జెక్ట్ మీద అవగాహనకు ఉపకరిస్తుంది’’ అంటున్నాడు సిమన్. మరింకేం... ప్రయత్నించి చూడండి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement