new language
-
మరిన్ని భాషల్లో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్
గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. గతంలో కేవలం 13 భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 21కి చేరింది. ఇంతకీ ఇప్పుడు అందుబాటులో ఉన్న భాషలు ఏవి, అందులో భారతీయ భాషలు ఎన్ని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కొత్తగా చేరిన భాషలు మొత్తం ఎనిమిది. అవి అరబిక్, గుజరాతీ, కొరియన్, పర్షియన్, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్. ఇప్పటికే 13 భాషల్లో ఇది వినియోగంలో ఉంది. దీంతో మొత్తం భాషలు 21కి చేరాయి. అంటే గూగుల్ సెర్చ్ ఫలితాలు అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హిందీ, ఇండోనేషియా, కన్నడ, కొరియన్, మలయాళం, మరాఠీ, పర్షియన్, పోర్చుగీస్, స్పానిష్, తమిళం, తెలుగు, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్ భాషల్లో కూడా పొందవచ్చు.ఈ మొత్తం 21 భాషల్లో భారతీయ భాషలు.. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ. సెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల మరింత మంది యూజర్స్ దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది. -
'అక్షర సేద్యం'.. వికీపీడియాలో 'కొలామి భాష'..!
మంచిర్యాల: ఆధునిక కాలంలో కాలానుగుణంగా తమ భాష, సంస్కృతి ఎక్కడ కనుమరుగవుతుందేమోనన్న తపనతో ఆదివాసీ కొలాం తెగ యువత ముందడుగు వేసింది. కొలామి భాష, తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఆలోచనతో వికీపీడియాను వేదికగా ఎంచుకున్నారు. భవిష్యత్ తరాలకు తమ భాష, సంస్కృతి, పదజాలం, జానపద పాటలు, నృత్య కళారూపాలు, చారిత్రాత్మక అస్తిత్వ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషిస్తూ తెలుగు లిపితో కొలాం భాషను వికీపీడియాలో పొందుపరుస్తూ.. పలువురు మన్ననలు పొందుతూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇది వరకే ఉట్నూర్ కేబీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఐటీడీఏ పీవో పాల్గొని కొలామి భాషను వికీపీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయడంపై ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయి బోలిచేతో (భాష చైతన్యం) ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన తెగ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 46,677 మంది కొలాం జనాభా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో అత్యంత వెనుకబడిన తెగ ఆదివాసీ కొలాం. వారి సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ఉంటాయి. కొలాం తెగకు చెందిన యువకులు, కళాకారులు తమ నైపుణ్యాన్ని వెలికితీసి భాషను నేరుగా వికీపీడియాలోకి మార్చి తమ ఔనత్యాన్ని చాటుతున్నారు. కొలామి భాషతో పాటు మహానీయులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల చరిత్రను కొలామిలో పొందుపర్చేందుకు సిద్ధమవుతున్నారు. కొలాం సంస్కృతి.. గిరిజన తెగల్లో కొలాం సంస్కృతి, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. కొలాం ఆదివాసీలు కొలిసే ఆరాధ్యదైవం భీమయ్యక్, నడిదమ్ము, ముత్తేలమ్మ, దండారీ, దూరడి, పొలకమ్మ దేవతులు ముఖ్యమైనవి. వివాహ వేడుకల్లో పాడే జానపదులు ప్రత్యేకంగా ఉంటాయి. కొలాం మహిళలు, పురుషులు ఉత్సవాల సందర్భంగా కొలామి మాతృభాషలో పాడే పాటలు, నృత్య కళారూపాలను కాలానుగుణంగా వివిధ ఉత్సవాలకు సంబంధించిన నృత్యాలు సేకరించి పొందుపర్చనున్నారు. కొలామి వికీపీడియా ప్రస్థానం.. కొలామి వికీపీడియాను జూన్ 28న నేతి సాయి కిరణ్ ప్రారంభించారు. ప్రపంచంలో లిపి లేని ఆదివాసీ భాషలు రోజురోజుకూ అంతరించిపోతున్నాయి. భాష పదజాలం కోసం సంస్కృతి పరిరక్షణకు బోలిచేతో ఫౌండేషన్ స్థాపించారు సాయికిరణ్. భాష కోసం, ఆదివాసీలు సంస్కృతిక పంటలైన చిరుధాన్యాల బాహ్య ప్రపంచానికి తెలియచేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతరిస్తున్న భాషలపై పరిశోధన.. యునెస్కో ప్రకారం ప్రపంచంలో 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితాలోని చాలా భాషలు అంతరిస్తున్నాయి. వైవిధ్యంగా ఉన్న భాషలు ప్రపంచ భాష వైవిధ్యతను కోల్పోయే దిశలో ఉన్నాయి. భాషను డిజిటల్ మాద్యమాల ద్వారా పునరుద్ధరణ చేయడమే నా లక్ష్యం. – నేతి సాయికిరణ్, తెలుగు వికీపీడియా, బోలిచేతో ఫౌండేషన్, వ్యవస్థాపకుడు, అస్సాం భవిష్యత్‌కు కొలామి వికీపీడియా అవసరం.. తెలుగు వికీపీడియాలోని తెలంగాణలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేస్తున్నాం. సమకాలిన అంశాలపై రచనలు కొనసాగుతున్నాయి. వికీ బుక్స్‌లో నేను రచించిన కొలాం వీరుడు కుమురం సూరు, దండారీ కై తికాలు, దంతన్‌పల్లి భీమయ్యక్ మహాత్మ్యం, మోతీరాము శతకం పుస్తకాలు పొందుపర్చుతాను. – ఆత్రం మోతీరాం, కొలామి వికీపీడియా, కవి మా జీవన విధానాన్ని వికీలో భద్రపరుస్తాం.. మా కొలాం సంస్కృతికి సంబంధించిన వ్యవహారాలు, దేవుళ్లు, జానపద నృత్యాలు, పాటలు, మా చరిత్రాత్మక స్థానాలు, మా జీవన విధానం, పల్లెలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సేకరించి వికీ కామన్స్‌లో భద్రపరుస్తాను. – ఆత్రం రాజ్‌కుమార్, కొలామి వికీపీడియా ఇష్టంతో అనువాదం.. తెలుగు వికీపీడియాలోని సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేయడం నాకెంతో ఇష్టం. జాతీయ నాయకులకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో తెలుగు లిపితో అనువాదం చేస్తున్నాం. మా మాతృభాష కొలామి భాషకు సేవా చేయడం నాకెంతో గర్వకారణం. – మడావి జంగు, కొలామి వికీపీడియా వికీపీడియాలోకి.. తెలుగు లిపిని అలంబన చేస్తూ కొలామి భాషకు జీవం పోసి వందలాది వ్యాసాలతో ముందుకు సాగుతూ అంతర్జాతీయ వేదికగా నిర్మితమవుతున్న కొలామి వికీపీడియా అక్షర సేద్యంగా నిలువనుంది. కొలాం తెగ ప్రజలు రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలో యావత్మల్ జిల్లాలో నివసిస్తున్నారు. వీరిది ద్రావిడ భాష అయినా కొలామి భాషను మాట్లాడతారు. ప్రభుత్వ రికార్డుల్లో కొలామ్స్ అని నమోదు చేసింది. -
అమ్మ కుట్టీ అమ్మ కుట్టీ... వెళ్దాం ఛలో ఎలి.కుట్టీ
అవసరమే కాదు ఆసక్తి కూడా కొత్త భాషను దగ్గర చేస్తుందని మలయాళ భాషను గడగడా మాట్లాడే ఎలిజెబెత్ కీటోన్‌ను చూస్తే అర్థమవుతుంది. జార్జియా (యూఎస్)కు చెందిన ఎలిజబెత్ ఇంగ్లీష్ టీచర్. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. సౌత్‌కొరియా ఆ తరువాత యూఏఈలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు మలయాళీ కుర్రాడు అర్జున్‌తో ఎలిజబెత్‌కు పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లయింది. ఇక అప్పటి నుంచి శ్రీవారి మాతృభాషను నేర్చుకోవాలని డిసైడై పోయింది ఎలిజ బెత్. ‘30 రోజుల్లో మలయాళం’లాంటి ఔట్‌డేటెడ్ పుస్తకాలు, మార్గాలు తప్ప కొత్తవి కనిపించలేదు. దీంతో కోళికోద్లో ఉన్న ఒక టీచర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో మలయాళం భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తనదైన స్టైల్లో సొంతంగా నోట్స్ రాసుకొని, డూడుల్స్ తయారు చేసుకొని మలయాళ భాషపై పట్టు సంపాదించింది. ‘ఎలి.కుట్టీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తి ఉన్నవారికి మలయాళం నేర్పుతోంది. -
ఏంటీ ఈ 'లిపి'..? గవర్నర్ సైతం.. 'వాహ్ శభాష్' అంటూ..
వరంగల్: ఏటా నిర్వహించే సైన్స్‌ఫేర్‌లో ఎవరూ చేయని అద్భుతాన్ని ఆవిష్కరించాలనుకున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఫిజికల్సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మడ్క మధు. అతడి దృఢ సంకల్పానికి విద్యార్థుల ఆసక్తి తోడైంది. దీంతో నోటితో మాట్లాడకుండా, చెవితో వినకుండా కళ్ల సైగలతో, చెవుల కదలికలతో మాట్లాడే ఓ లిపిని విద్యార్థులు, ఉపాధ్యాయుడు కలిసి తయారు చేశారు. విద్యార్థుల ప్రతిభను చూసి 'గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాహ్ శభాష్' అంటూ అభినందించారు. విద్యార్థుల్ని, టీచర్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆకుతోట మల్లిక, సల్పాల దేవిక, ఆరెందుల రాజశేఖర్, మద్దిరాల శివ నవదీప్, సల్పాల నందిని, సల్పాల సంకీర్తన ‘ఐ’ కోడింగ్, ‘ఇయర్’ కోడింగ్‌లో ఉపాధ్యాయుడు మధు వద్ద శిక్షణ పొంది ప్రతిభ కనబరుస్తున్నారు. వీటితోపాటు గారడి, ఐబ్రోస్ (కనుబొమ్మలు)సైగలతో భావవ్యక్తీకరణ జరుపుతున్నారు. లిప్(పెదవు)ల మూవ్‌మెంట్‌ను బట్టి మాట్లాడింది చెప్పేస్తున్నారు. విద్యార్థులు వీటిపై మరింత శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే పాఠశాలలో 10 మందికి పైగా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయుడు మధు శిక్షణ ఇస్తున్నారు. ఏంటీ ఈ లిపి..? ‘ఐ’కోడింగ్ అంటే కను సైగలతో మాట్లాడడం. ఏ, బీ, సీ, డీ ఒక్కో అక్షరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వీటిని కనుసైగలతో వ్యక్తీకరిస్తారు. చెవుల కదలికలతో సైతం భావాల్ని వ్యక్తపరుస్తున్నారు. దీనికీ ప్రత్యేకంగా ఓ లిపిని తయారు చేశారు. ఐ, ఇయర్ కోడింగ్ భాష దేశ రక్షణకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సీబీఐ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, రా ఇతర నిఘావర్గాలకు ఈ లిపి ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయుడు మధు, విద్యార్థులు చెబుతున్నారు. ఒక పేపర్లో ఉన్నది చదివి విద్యార్థి నోటిని తెరవకుండా కళ్లు మూస్తూ.. తెరుస్తూ... మీదకు, కిందికి ఎగరేస్తూ.. చెవులను కదిలిస్తూ సైగలతో భావాల్ని వ్యక్తీకరిస్తే.. మరో విద్యార్థి ఆ సైగలు చూసి పొల్లుపోకుండా పేపర్‌పై రాసి చూపిస్తుంది. విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని చేతిలో ఏముందో చెబుతూ మంత్రాలు, తంత్రాలు లేవని గ్రామీణులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. దేశ రక్షణకు ఉపయోగం.. గవర్నర్ కితాబిచ్చారు.. ‘చెవులను కదిలించడం జంతువులకే సాధ్యం అలాంటిది మీరు చేస్తున్నారంటే గ్రేట్’ అని గవర్నర్ మేడమ్ కితాబిచ్చారు. మా టీచర్ల ప్రోత్సాహంతో బాగా శిక్షణ పొందుతున్నాం. మేం, మా భాష దేశ రక్షణకు ఉపయోగపడితే చాలు. పోలీస్ జాబ్ చేయాలనేది నా కోరిక. – శివ నవదీప్, ఎనిమిదో తరగతి మరిచిపోలేని అచీవ్మెంట్.. ఐ కోడింగ్ గురించి మా గైడ్ టీచర్ మధు చెప్పారు. ఆసక్తితో నేర్చుకున్నాను. ఈ భాషను భవిష్యత్‌లో దేశానికి ఉపయోగపడేలా సాధన చేస్తాం. గవర్నర్ మేడమ్ మమ్మల్ని మెచ్చుకోవడం మరిచిపోలేని అచీవ్మెంట్. – ఆకుతోట మల్లిక, పదో తరగతి ప్రపంచంలో ఎక్కడా లేని భాష.. సైన్స్‌ఫేర్‌లో కొత్తగా ఉండాలని ఐ, ఇయర్ కోడింగ్ రెండు ప్రత్యేక భాషలు ఎంచుకున్నా. దీనికి ప్రత్యేకంగా లిపిని తయారు చేశా. దీనికి మాప్రాంతంలో మంచి ఆదరణ వస్తోంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఈ భాష లేదని అనుకుంటున్నా. గవర్నర్‌ను విద్యార్థులతో కలవడం మరిచి పోలేం. విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి దేశానికి ఉపయోగపడేలా చేయాలనేది నా లక్ష్యం. ఇంకా గారడి, ఐబ్రోస్, లిప్ మూవ్‌మెంట్‌పై సాధన జరుగుతోంది. – మడ్క మధు, ఫిజికల్సైన్స్ ఎస్ఏ, మహదేవపూర్ -
మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి...
సాంకేతికం మీరు కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? గణితంలో మీ ప్రతిభను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘అన్‌లాక్ యువర్ బ్రెయిన్’ అనే ఈ ఆండ్రాయిడ్ యాప్ రకరకాల భాషలు నేర్పిస్తుంది. చరిత్రను బోధిస్తుంది. దీంతో పాటు రకరకాల పరీక్షలు పెట్టి, మీ గణిత ప్రతిభను మెరుగుపరుస్తుంది. ప్రశ్నకు సరియైన సమాధానం కోసం రెండు నుంచి మూడు సెకండ్ల సమయం ఇస్తుంది. ‘‘ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ యాప్ ఉపకరిస్తుంది’’ అంటున్నాడు సిమన్. జర్మన్‌కు చెందిన సిమన్ సెమెండ్ ఈ యాప్‌ను తయారుచేశాడు. పదసంపద, గణిత ప్రశ్నలతో ప్రస్తుతం ఈ యాప్‌లో ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని కొత్త సబ్జెక్ట్‌లను రాబోయే రోజుల్లో చేర్చే అవకాశం ఉంది. ఆ యాప్ శక్తిని అంచనా వేయడానికి జర్మనీలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పోట్స్డమ్’ కొన్ని పరీక్షలు నిర్వహించింది. ఇందులో 13,285 మంది పాల్గొన్నారు. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నవారు రెండు వారాల్లో వివిధ సబ్జెక్ట్‌లలో తమ ప్రతిభను గణనీయంగా మెరుగుపరుచుకున్నట్లు ఈ పరీక్షలో తేలింది. ‘‘ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే ప్రతి సబెక్ట్కు సంబంధించి గుట్టలు గుట్టలుగా సమాచారం ఉంటుంది. దీంతో ఎక్కడ మొదలుపెట్టాలో వారికి తెలియడం లేదు. కానీ, ఈ ‘అన్‌లాక్ యువర్ బ్రెయిన్’ యాప్ ఆ అయోమయాన్ని నివారిస్తుంది. సమాచారాన్ని చిన్న చిన్న ముక్కలుగా అందుబాటులో ఉంచి, ఎంచుకున్న సబ్జెక్ట్ మీద అవగాహనకు ఉపకరిస్తుంది’’ అంటున్నాడు సిమన్. మరింకేం... ప్రయత్నించి చూడండి!