హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి.. | German Woman Body Paraded By Hamas Fighters In Israel | Sakshi
Sakshi News home page

హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి..

Published Sun, Oct 8 2023 4:43 PM | Last Updated on Sun, Oct 8 2023 5:18 PM

German Woman Body Paraded By Hamas Fighters In Israel - Sakshi

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది.

సోషల్ మీడియాలో కనిపించిన వీడియోల దృశ్యాల ప్రకారం కొంతమంది హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగించారు. ఆ వాహనాన్ని చుట్టుముట్టి కేకలు వేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. మొదట ఆ మహిళా మృతదేహం ఒక మహిళా ఇజ్రాయెల్ సైనికురాలికి చెందినదని హమాస్ పేర్కొంది. అయితే, వీడియోలో కనిపించిన మహిళ తన సోదరి, జర్మన్ పౌరురాలు అని ట్విట్టర్ వేదికగా ఓ మహిళ నివేదించినట్లు న్యూయార్క్ పోస్టు తెలిపింది.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు.

ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement