paraded
-
హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి..
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది. సోషల్ మీడియాలో కనిపించిన వీడియోల దృశ్యాల ప్రకారం కొంతమంది హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగించారు. ఆ వాహనాన్ని చుట్టుముట్టి కేకలు వేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. మొదట ఆ మహిళా మృతదేహం ఒక మహిళా ఇజ్రాయెల్ సైనికురాలికి చెందినదని హమాస్ పేర్కొంది. అయితే, వీడియోలో కనిపించిన మహిళ తన సోదరి, జర్మన్ పౌరురాలు అని ట్విట్టర్ వేదికగా ఓ మహిళ నివేదించినట్లు న్యూయార్క్ పోస్టు తెలిపింది. The mother of Shani Louk, the woman whose body was seen on video in the back of a pick-up truck driven by Palestinian terrorists to Gaza, released a statement earlier today. She confirmed she had seen her daughter on the video & asked the public for help with more information pic.twitter.com/LDcPsjGHP8 — Visegrád 24 (@visegrad24) October 8, 2023 ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు -
Manipur violence: రేప్ చేసి, రంపాలపై పడేసి...
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటన జరిగిన రోజే అక్కడికి 40కి.మీ. దూరంలో మరో దారుణం జరిగింది. కుకి–జోమి తెగకు చెందిన ఇద్దరు యువతుల్ని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసు స్టేషన్లో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ ద్వారా వెల్లడైంది. బాధిత యువతులు 21, 24 ఏళ్ల వయసున్న వారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో కార్లు వాష్ చేసేవారు. మే 4న వారు కార్లు కడుగుతూ ఉండగా అల్లరిమూక కొందరు అక్కడికి వచ్చి దౌర్జన్యంగా వారిని పక్కనే ఉన్న గదిలోకి లాక్కెళ్లారు. వాళ్లు అరవకుండా నోటికి గుడ్డలు కట్టేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్టుగా జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఆ తర్వాత ఆ ఇద్దరు యువతుల్ని దుండగులు పక్కనే ఉన్న రంపం మిల్లులోకి లాగి పడేశారు. రంపాల మీద పడేయడంతో వారు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆ ఇద్దరు యువతుల్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లడం తాము చూశామని వారి స్నేహితులు చెబుతున్నారు. మరణించిన ఇద్దరు యువతుల్లో ఒకరి తల్లి సాయికుల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాదాపుగా 100–200 మంది దుండగులు రాక్షసంగా తమ కుమార్తె, ఆమె స్నేహితురాల్ని అత్యాచారం చేసి, హింసించి చంపేశారని ఆమె అందులో పేర్కొన్నారు. వీడియో ఘటనలో మరో నిందితుడు అరెస్ట్ మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటనలో పోలీసులు అయిదో నిందితుడిని అరెస్ట్ చేశారు. 19 ఏళ్ల వయసున్న యువకుడిని అదుపులోనికి తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. మణిపూర్‌లో వెలుగులోకి మరో భయానక ఘటన ఇటీవల మణిపూర్‌లో జరిగిన రెండు వర్గాల ఘర్షణల్లో ఓ స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను కొందరు దుండగులు సజీవదహనం చేశారు. ఆమెను లాక్కెళ్లి ఇంట్లో తాళం వేసి నిప్పంటించారు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదైంది. కక్చింగ్ జిల్లాలోని సిరోయూ గ్రామంలో మే 28న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. -
'కార్గిల్‌లో పోరాడినా.. భార్యను కాపాడలేకపోయా' మణిపూర్ బాధితుని ఆవేదన
ఇంఫాల్: మణిపూర్ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతి చెందింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం పంటపొలాల్లోకి లాక్కెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుత్తాయి. ఈ ఘటనపై స్పందించిన బాధిత యువతి.. తమను పోలీసులు అల్లరి మూకకు వదిలేసినట్లుగా ఆరోపించింది. పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు.. బాధిత మహిళ భర్త ఆర్మీలో పనిచేసినట్లు తెలుస్తోంది. సైనికుడిగా కార్గిల్ యుద్ధంలో పోరాడిన తమకు ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన మనోవేదనకు గురయ్యారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. అల్లరి మూక జంతువుల్లా ఆయుధాలతో తమపై ఎగబడ్డారని చెప్పారు. కార్గిల్‌లో పోరాడి దేశాన్ని రక్షించినప్పటికీ దేశంలోపల తన భార్యను కాపాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? పోలీసుల నుంచి లాక్కెళ్లి.. వర్గాల మధ్య పోరులో ఓ గ్రామంపై అల్లరి మూకలు ఎగబడ్డాయి. ఈ క్రమంలో తప్పించుకుంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలపై ఆందోళనకారులు అమానవీయంగా ప్రవర్తించారు. బాధితుల్లో 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) కాగా.. మరో ఇద్దరు మహిళలు(52, 42) ఉన్నారు. వీరు సమీప పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాదాపు 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు వీరిని పోలీసుల నుంచి లాగి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధిత గ్రూప్‌లోని 19 ఏళ్ల యువకుడు తన సోదరి (21)ని రక్షించేందుకు ప్రయత్నించగా.. సాయుధ మూకల దాడిలో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై స్పందించిన బాధిత యువతి తమను పోలీసులు రోడ్డుపైనే వదిలేశారని వాపోయింది. ఇదీ చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు సామూహిక అత్యాచారం ఘటనలో 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా వీధుల్లో ఊరేగించడమే కాకుండా సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే..కొందరు యువకులు మాత్రం అమ్మాయిల శరీర భాగాలను చేతులతో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అయితే అందులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జులై 19న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘోర ఘటనకు సంబంధించి ఇప్పటికే తౌబల్ జిల్లాకు చెందిన హెరాదాస్ (32) అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: Manipur Violence.. మహిళపై అఘాయిత్య ఘటన.. అసలు ఆరోజు జరిగింది ఇదేనా! -
దోషులను వదిలిపెట్టం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. దోషులను వదిలిపెట్టేదిలేదని ప్రకటించారు. మే 4వ తేదీన జరిగిన ఈ దారుణ ఉదంతం 140 కోట్ల మంది భారతీయులను తలదించుకునేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు జరిగిన అవమానం గురించి తెలిశాక తన హృదయం బాధతో, ఆవేదనతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మోదీ గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల్లో శాంతి భద్రతలను కాపాడే యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. మహిళలకు తగిన భద్రత కలి్పంచాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించే విషయంలో రాజీపడొద్దని, కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అమానవీయ ఘటన క్షమించరానిదని, దోషులను వదిలిపెట్టబోమని ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, బిల్లులపై చర్చల కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎంపీలంతా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు. ఆరా తీసిన అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌తో మాట్లాడారు. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆరా తీశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ వీడియోను తొలగించండి: కేంద్రం ఆదేశం మణిపూర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇద్దరు మహిళల పట్ల దుండుగులు రాక్షసంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను వెంటనే తొలగించాలని ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది. సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. వీడియోను తొలగించాలంటూ ట్విట్టర్‌ను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. దోషులు మరణ శిక్షకు అర్హులని మణిపూర్ సీఎం బీరేన్ పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దుండుగుల గుంపులో ఉన్న ఒక కీలకమైన వ్యక్తితోపాటు మరొక నిందితుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు చెప్పారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియోను సుమోటోగా దర్యాప్తునకు స్వీకరించారు. గుర్తుతెలియని సాయుధ దుండగులపై బుధవారం థౌబాల్ జిల్లాలోని నాంగ్పొక్ సెక్మాయ్ పోలీసు స్టేషన్లో అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుడు హెరాదేశ్ సింగ్ ఇంటిని గ్రామస్థులు దహనం చేశారు. అసలేం జరిగింది? మణిపూర్‌లోని కాంగ్పొక్పీ జిల్లాలో మే 3న రెండు తెగల ప్రజల మధ్య హింస జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో మే 4న బి.పయనోమ్ గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో దాదాపు 1,000 మందితో కూడిన ఓ గుంపు బి.పయనోమ్ గ్రామంలోకి ప్రవేశించింది. దుండగులు గ్రామంలో ఇళ్లకు నిప్పుపెట్టారు. పశువులు, దుస్తులు, టీవీలు, ఫోన్లు.. ఇలా సర్వం దోచుకున్నారు. ఈ మూక ఐదుగురు వ్యక్తులపై దాడికి దిగింది. ఆ సమయంలో పోలీసులు సైతం అక్కడే ఉన్నారు. దాడిలో 56 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు మృతిచెందారు. ముష్కరులు అతడి కుమార్తెను(21), మరో మహిళను నగ్నంగా మార్చి, ఊరేగింపుగా పొలాల్లోకి తీసుకెళ్లారు. 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మణిపూర్‌లో మే నుంచి కొనసాగుతున్న ఇంటర్నెట్పై నిషే«ధాన్ని తాజాగా ఎత్తివేశారు. అప్పటి సంఘటనకు సంబంధించిన 26 సెకండ్ల వీడియో ఈ నెల 19న సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు ప్రస్తుతం చురాచాంద్‌పూర్‌లో శిబిరంలో ఉన్నారు. మీవల్ల కాకపోతే మేమే రంగంలోకి దిగుతాం: సుప్రీంకోర్టు మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలకు జరిగిన అవమానాన్ని చూసి తాము తీవ్రంగా కలత చెందామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మణిపూర్ ఘటనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తనంతట తానుగా గురువారం విచారణకు స్వీకరించింది. ప్రసార మాధ్యమాల్లో కనిపించిన వీడియోను చూస్తే మణిపూర్‌లో రాజ్యాంగ ఉల్లంఘన, మానవ హక్కులకు విఘాతం కలిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంది. బాధిత మహిళలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మహిళలను అవమానించిన వ్యక్తులను అరెస్టు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని, తగిన చర్యలు ప్రారంభించాల్సి వస్తుందని హెచ్చరించింది. మొత్తం∙చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మణిపూర్‌లో హింసాకాండకు సంబంధించిన ఇతర పెండింగ్ పిటిషన్లపైనా ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. -
అత్యాచార బాధితురాలిని కొట్టి ఊరేగించారు
భోపాల్: మధ్య ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార బాధిరాలితోపాటు, నిందితుడిని ఊరేగించిన వైనం కలకలం రేపింది. 16 ఏళ్ల బాధిత మైనర్ బాలికతోపాటు, నిందితుడిని తాళ్లతో కట్టేసి దాడిచేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ఊరంతా తిప్పారు. దాడి చేసిన వారిలో బాలిక కుటుంబ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. (హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: తీవ్ర విషాదం) మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని గ్రామంలోఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులతో పాటు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. రెండు కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారి దిలీప్ సింగ్ బిల్వాల్ తెలిపారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ల వ్యక్తిపైన ఒకటి, ఈ దారుణానికి సహకరించిన బాలిక కుటుంబ సభ్యులు, సహా, ఇతరులపై మరో ఎఫ్ఐఆర్ నమెదు చేశామన్నారు. -
అరగుండు, చెప్పులదండ, నగ్నంగా..
ముంబై: ఆకలేసి తప్పు చేసిన ఇద్దరు మైనర్ బాలురు పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ముంబైలోని ఉల్హస్ నగర్లో శనివారం ఉదయం ఈ ఉందంతం చోటు చేసుకుంది. స్థానిక షాపులోంచి తినుబండారాలను దొంగిలించిన ఇద్దరు మైనర్ బాలుళ్ల పట్ల ఆ షాపు షాపు యజమాని అవమానకరంగా, నిర్దయగా ప్రవర్తించారు. బాలుర మెడలో చెప్పుల దండ వేసి, నగ్నంగా ఊరేగించారు. పొలీసులు అందించిన సమాచారం ప్రకారం 8,9 సం.రాల ఇద్దరు అబ్బాయిలు మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్‌ను దొంగిలించారు. ఇది గమనించిన పఠాన్, అతని ఇద్దరుకు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20) వీళ్లపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. అనంతరం అరగుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి, వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత జరుగుతున్నా ఆ పిల్లల్ని కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ దృశ్యాలను స్థానినికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధితుల తల్లదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఉల్హస్ నగర్, హిల్ లైన్ పోలీసు స్టేషన్, సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితులను కోర్టుముందు హాజరు పర్చి, సోమవారం వరకు రిమాండ్ చేసినట్టు చెప్పారు. -
జుట్టు కత్తిరించి, నగ్నంగా ఊరేగించారు
భిండి: మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంత్రగత్తె అనే నెపంతో ఓ ఆదివాసీ యువతిని ఘోరంగా అవమానించిన ఘటన మరువకముందే మరో మహిళపై దాడిచేసి, అనంతరం నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. కొడుకు ప్రేమ పెళ్లి ఓ తల్లి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన లాహర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక యువకుడు... మురళీదౌర్ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాగా ఈ పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే కోర్టు అనుమతితో గత ఫిబ్రవరిలో ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబసభ్యులు... యువకుడి కుటుంబంపై ఆగ్రహం పెంచుకున్నారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కక్ష గట్టారు. యువకుడి కుటుంబంపై దాడి చేసి, అతని తల్లిదండ్రులు, సోదరుడిని విపరీతంగా కొట్టాడు. అంతటితో వారి ఉన్మాదం చల్లారలేదు. యువకుడి తల్లిని జుట్టు పట్టి బయటికి లాక్కొచ్చి మరీ విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం ఆమె జుట్టును కత్తిరించి, వివస్త్రను చేశారు. కొట్టుకుంటూ వీధుల్లో సుమారు రెండు గంటలపాటు నగ్నంగా ఊరేగించి భీతావహం సృష్టించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గ్వాలియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి రాంప్రకాష్, జైసింగ్, విజయ తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి అవినాష్ తెలిపారు. కాగా వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా పోలీసు స్టేషన్ పరిథిలోని బఖార్లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు అనాగరికంగా ప్రవర్తించారు. ఆమెపై దాడి చేసి నగ్నంగా ఊరేగించడమే కాకుండా మురికి కాలువలో నీళ్లు తాగించి, కర్రలతో దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే.