జుట్టు కత్తిరించి, నగ్నంగా ఊరేగించారు | Woman paraded naked in MP town | Sakshi

జుట్టు కత్తిరించి, నగ్నంగా ఊరేగించారు

Nov 13 2015 3:33 PM | Updated on Oct 16 2018 8:34 PM

జుట్టు కత్తిరించి, నగ్నంగా ఊరేగించారు - Sakshi

జుట్టు కత్తిరించి, నగ్నంగా ఊరేగించారు

మొన్న ఆదివాసీ యువతిని ఘోరంగా అవమానించిన ఘటన మరువక ఉందే మరో మహిళను కొట్టి, నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది.

భిండి: మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంత్రగత్తె అనే నెపంతో ఓ ఆదివాసీ యువతిని ఘోరంగా అవమానించిన ఘటన మరువకముందే మరో మహిళపై దాడిచేసి,  అనంతరం నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. కొడుకు ప్రేమ పెళ్లి  ఓ తల్లి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన లాహర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.

స్థానిక యువకుడు... మురళీదౌర్ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాగా ఈ పెళ్లికి యువతి  తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే  కోర్టు అనుమతితో గత ఫిబ్రవరిలో ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబసభ్యులు... యువకుడి కుటుంబంపై ఆగ్రహం పెంచుకున్నారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కక్ష గట్టారు.  యువకుడి కుటుంబంపై దాడి చేసి,  అతని తల్లిదండ్రులు,  సోదరుడిని విపరీతంగా కొట్టాడు. అంతటితో వారి ఉన్మాదం చల్లారలేదు. యువకుడి తల్లిని జుట్టు పట్టి బయటికి లాక్కొచ్చి మరీ విచక్షణా రహితంగా కొట్టారు.  

అనంతరం ఆమె జుట్టును కత్తిరించి, వివస్త్రను చేశారు.  కొట్టుకుంటూ వీధుల్లో  సుమారు రెండు గంటలపాటు నగ్నంగా ఊరేగించి  భీతావహం సృష్టించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గ్వాలియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి రాంప్రకాష్, జైసింగ్, విజయ తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి అవినాష్ తెలిపారు.

కాగా వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా పోలీసు స్టేషన్ పరిథిలోని బఖార్‌లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు అనాగరికంగా ప్రవర్తించారు. ఆమెపై దాడి చేసి నగ్నంగా ఊరేగించడమే కాకుండా మురికి కాలువలో నీళ్లు తాగించి, కర్రలతో దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement