మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. జర్మనీ మాజీ ఛాన్సలర్ (ప్రధాని) ఏంజిలా మెర్కల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు.
17ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?
పుతిన్‌కు శునకాలంటే మహా ప్రాణం. అందుకే దేశాది నేతలతో జరిగే సమావేశాల్లో సైతం శునకాలు పుతిన్‌తో దర్శనమిస్తుంటాయి. అయితే, 17ఏళ్ల క్రితం అంటే 2007 సోచి నగరంలో పుతిన్- అప్పటి జర్మనీ ప్రధాని ఏంజిలా మెర్కల్ మధ్య ఓ సమావేశం జరిగింది. అయితే ఆ మీటింగ్‌కు పుతిన్‌తో పాటు ఆయన పెంపుడు శునకం లాబ్రడార్ కోని కూడా తీసుకువచ్చారు.
సమావేశంలో జరుగుతున్నంత సేపు మెర్కల్‌తో పాటు పుతిన్ చుట్టూ తచ్చాడుతూ కనిపించింది. దీంతో స్వతహాగా శునకాలంటే భయపడే మెర్కల్ లాబ్రడార్ కోని చూసి ఆందోళనకు గురయ్యారు.
నాటి ఘటనపై తాను రాసిన పుస్తకంలో మెర్కల్ ‘ఫ్రీడమ్’ అనే టైటిల్‌తో ప్రస్తావించారు. అందులో పుతిన్ తనని భయపెట్టాలని తన శునకాన్ని సమావేశానికి తెచ్చారని అర్ధం వచ్చేలా రాశారు. తాజాగా విడుదల మెర్కల్ పుస్కకంలో 2007 నాటి ఘటనపై వ్లాదిమిర్ పుతిన్ బహిరంగంగానే స్పందించారు. మెర్కల్‌కు మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment