భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్‌ సింగర్‌! | PM Meets German singer Cassandra Mae Spittmann | Sakshi
Sakshi News home page

భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్‌ సింగర్‌!

Published Thu, Feb 29 2024 10:48 AM | Last Updated on Thu, Feb 29 2024 12:19 PM

PM Meets German singer Cassandra Mae Spittmann - Sakshi

జర్మనీ సింగర్‌ నోట ముగ్ధమనోహరంగా భారతీయ సంగీతం.అదీకూడా అన్ని భాషల్లో అవోకగా పాడేస్తోందామె. ఆ గాత్రానికి ఎవవ్వరైన మైమరచిపోవాల్సిందే. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే ఆమె గాత్రానికి ఫిదా అయ్యారు. మనక్‌ బాత్‌లో ఆమె గురించి ప్రస్తావించారు మోదీ. అంతేగాదు మోదీ ఆమెను కలవడమే కాకుండా ఆమె నోట పాటను స్వయంగా విన్నారు. ఇంతకీ ఎవరా జర్మన్‌ సింగర్‌?

ఏ భాష అయిన అందర్నీ కట్టిపడేసేది సంగీతమే. జర్మన్‌ సింగర్‌ కసాండ్ర మే స్పిట్‌మన్‌ను ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా కలిసి ఆమె ప్రతిభను ప్రశంసించారు. భక్తిగీతాలను ఇష్టపడే మోదీ ఎదుటై ప్రసిద్ధ భారతీయ భజన్‌ గీతమమైన "అచ్చుతం కేశం.. అనే పాట అద్భుతంగా ఆలపించింది. ఇది ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్‌ తెగ హల్‌చల్‌ చేస్తోంది. మోదీ తన మన్‌కీ బాత్‌లో కూడా ఆ జర్మన్‌ సింగర్‌ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. "ఎంత మధురమైన స్వరం. ప్రతి పదంలో ఎంత చక్కగా భావోద్వేగాలను పలికిస్తోంది. దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ అందర్నీ అనుభూతి చెందేలా చేస్తుంది.

ఆ మధురమైన స్వరం ఒక జర్మన్‌ది అంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆమె పేరు కాసాండ్ర మే స్పిట్‌మాన్‌ అంటూ ఆమె గురించి పరిచయం చేశారు. పుట్టుకతో అంధురాలైన అది ఆమె సంగీత ప్రతిభను అడ్డుకోలేదు. ఈ సంగీతంమనందరినీ కలిపే విశ్వభాష. అందమైన రిథమ్‌లు, బీట్‌లు ఏ హృదయాన్నేనా గెలుచుకోగలవు. అందుకు ఉదాహరణ అంధురాలైన ఈ కాసాండ్రే అని మన్‌ కీ బాత్‌లోఆమె గురించి గొప్పగా మాట్లాడారు మోదీ."

ఇక ఈ 22 ఏళ్ల కాసాండ్రాకి భారతదేశాన్ని సందర్శించాలనేది అమె సుదీర్ఘ కల. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని తమిళం, హిందీ, సంస్కృతం అస్సామీ, మలయాళం, బెంగాలీ, వంటి అనేక భాష‍ల్లో పాడగలిగేలా ప్రావీణ్యం సంపాదించిది. అందేగాక తన సోషల్‌ మీడియా ఖాతాలో తాను పాడిన పాటలను పోస్ట్‌ చేస్తుండేది. ఓ జర్మన్‌ ఇలా అలవోకగా భారతీయ భాషల్లో పాటలను పాడేయటం అందర్నీ ఆశ్చర్యపరించింది. ఆ నైపుణ్యమే ఆమెను అందరికీ చేరువయ్యేలా చేసింది. అలాగే ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌ బయోలో "జర్మన్ సింగర్-సాంగ్ రైటర్ ఇన్ లవ్ విత్ ఇండియా" అని అభివర్ణించి ఉంటుంది.  దీంతో ఆమెకు 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమెలో దాగున్న ఈ టాలెంటే మోదీ నెలవారి రేడియో షో మన కీ బాత్‌ 105 ఎపిసోడ్‌లో ప్రస్తావించేందుకు దారితీసింది. 

(చదవండి: అనంత్‌ అంబానీ బరువుకి కారణం ఇదే! ఆ విషయంలో కాబోయే భార్య..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement