
మెరుపుతీగలాంటి బామ్మ
తిక్క లెక్క
ఫొటోలో కనిపిస్తున్న జర్మన్ బామ్మగారి పేరు జోహానా కువాస్. వయసు పదహారుకి జస్ట్ డెబ్బయి మాత్రమే ఎక్కువ. అయితేనేం..? జిమ్నాస్టిక్స్‌లో పదహారేళ్ల పడుచుపిల్లలతో కూడా సై అంటే సై అని పోటీ పడుతుంది ఈమె. సమాంతరంగా నిలిపి ఉంచిన లోహపు చువ్వలను ఆసరా చేసుకుని ఈమె చేసే చిత్రవిచిత్ర విన్యాసాలను చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే!
యూట్యూబ్‌లో ఉంచిన ఈమె వీడియోలను ఇప్పటికే లక్షలాది మంది తిలకించారు. ఆ దెబ్బకు గిన్నెస్‌బుక్ కూడా ఆమె ప్రతిభాపాటవాలను గుర్తించింది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జిమ్నాస్ట్‌గా ఆమె పేరును నమోదు చేసుకుంది.