ఆట మీద అధినేత్రి ప్రేమ..! | I love the game .. on the president! | Sakshi
Sakshi News home page

ఆట మీద అధినేత్రి ప్రేమ..!

Published Wed, Jun 18 2014 12:10 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఆట మీద అధినేత్రి ప్రేమ..! - Sakshi

ఆట మీద అధినేత్రి ప్రేమ..!

క్రేజీ ప్రెసిడెంట్
 

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు కలిగిన వ్యక్తి... జర్మన్ చాన్సలర్ ఏంజెలా మోర్కెల్. అత్యంత శక్తియుక్తులతో జర్మనీ వంటి దేశాధినేతగా ఎన్నికై సమర్థంగా ఆ పదవిని నిర్వహిస్తున్న మోర్కెల్‌కు మరో కోణం ఉంది. అదే ఫుట్‌బాల్ పిచ్చి. అందుకోసం ఆమె తాను ఉన్న స్థాయిని కూడా కాసేపు పక్కనబెట్టి మరీ ఆటగాళ్లను ఉత్సాహ పరిచింది. అది ఇప్పుడు వార్తలో అంశంగా మారింది. అదేంటో చూద్దాం... ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆటగాళ్ల పండగ జరుగుతోంది. అదే ప్రపంచకప్. బ్రెజిల్‌లో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగింది జర్మన్ జట్టు. తమ జాతీయ టీమ్ ఆడుతున్న తొలి మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా హాజరైంది ఏంజెలా. పోర్చుగల్‌తో తలపడిన ఆ మ్యాచ్‌లో జర్మన్ జట్టు 4-0తో విజయం సాధించింది.

ఇంకేముంది ఏంజెలాకు ఉత్సాహం వచ్చేసింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ కేరింతలు కొట్టిన ఆమె మ్యాచ్ ముగిశాక టీమ్ డ్రస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను పలకరించింది. అందరికీ అభినందనలు తెలిపి... ఇదే  ఆటతీరుతో దూసుకుపొమ్మని ఉద్బోధించింది. ఉన్నట్టుండి ఆమె డ్రస్సింగ్ రూమ్‌లోకి రావడంతో ఆటగాళ్లే ఆశ్చర్యపోయారు.దేశాధినేత్రి తమతో సరదాగా గడపడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వాళ్లు ఎంతో సంతోషంగా చెప్పుకున్నారు.అన్నట్టు...మేడమ్ ఈ విధంగా జర్మన్ ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలవడం ఇది తొలిసారి కాదట! గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగా వాళ్లతో మమేకం అయ్యి ఆటపై, జాతీయ జట్టుపై తనకున్న అభిమానాన్ని చాటుకొందీ జర్మన్ చాన్సలర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement