angela morkel
-
ఫోర్బ్స్ ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితా.. ఇద్దరు భారతీయులకు చోటు
The World's 100 Most Powerful Women 2021 in the World List: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రిక ప్రచురించే ప్రపంచ శక్తివంతులైన మహిళల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. ప్రతీ ఏడు ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ వ్యాప్తంగా పాలసీ మేకర్స్, వ్యాపారం, దాతృత్వం, సీఈవోలు ఇలా వివిధ కేటగిరిలకు చెందిన మహిళలను పరిశీలించి ఈ జాబితాను ప్రకటిస్తుంది. ఇద్దరికి చోటు తాజాగా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్‌కు చోటు దక్కించుకున్నారు. వంద మంది మహిళలతో కూడిన ఈ జాబితాలో నిర్మలా సీతారామన్ 37వ స్థానంలో నిలవగా ఫాల్గుని నాయర్ 88వ స్థానంలో నిలిచారు. బీబీసీ నుంచి భారత రాజకీయ చరిత్రలో తొలిసారిగా మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందారు. అంతకు ముందు ఆమె రక్షణ శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె బీబీసీలో పని చేశారు. సెల్ఫ్‌మేడ్ నైకా ఐపీవోతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఫాల్గుని నాయర్. బ్యూటీ ప్రొడక్టులు వ్యాపారంలోకి వచ్చిన ఫాల్గుని నాయర్ అనతి కాలంలోనే మార్కెట్లో మంచి పేరు సాధించారు. ఇటీవల ఐపీవోకి వచ్చిన మరుసటి రోజే బిలియనీర్‌గా మారారు. సెల్ఫ్‌మేడ్ ఇండియన్ ఫిమేల్ బిలియనీర్‌గా రికార్డులకెక్కారు. మొదటి స్థానంలో మెకెంజీ ఇక ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో మెకెంజీ స్కాట్ నిలిచారు. అమెరికన్ నావెలిస్ట్ అయిన మెకెంజీ స్కాట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ మాజీ భార్య. కాగా దాతృత్వం విభాగంలో ఆమె చేసిన ఛారిటీ సేవలకు గాను ఫోర్బ్స్ ఈ గుర్తింపు ఇచ్చింది. కాగా గత జాబితాలో తొలి స్థానంలో ఉన్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ఈసారి 15వ స్థానంలో నిలిచారు. చదవండి: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్.. ఎందుకంటే..? -
'ఈ సాఫ్ట్వేర్.. ప్రపంచ హార్డ్‌వేర్‌ను కదిలిస్తుంది'
బెంగళూరు: ప్రపంచం అనే హార్డ్ వేర్ ను కదిలించగలిగిన సత్తా డిజిటల్ ఇండియా అనే సాఫ్ట్ వేర్ కు ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన మానసపుత్రికను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం బెంగళూరులో జరిగిన ఇండో- జర్మన్ సదస్సులో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ తో కలిసి పాల్గొన్న ఆయన.. డిజిటల్ ఇండియా పథకం తీరుతెన్నులను ఐటీ దిగ్గజాలకు వివరించారు. నాస్కామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో భారత్, జర్మనీకి చెందిన పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు కూడా పల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ గడిచిన 15 నెలల కాలంలో.. వ్యాపారాపానికి అనువైన పరిస్థితుల కల్పన, సులువుగా అనుమతుల మంజూరు తదితర అంశాల్లో మార్పులు తెచ్చామని, భారత్ లోకి పెట్టుబడుల రాకను సులభతరం చేశామన్నారు. మిగతా ప్రపంచంలో విదేశీపెట్టుబడులు క్షీణదశలో ఉండగా భారత్ లో మాత్రం అవి జోరందుకుంటుండటం ఈ దేశంపై, ఇక్కడి ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని తెలియజేస్తున్నదన్నారు. అనంతరం జర్మన్ ఛాన్సలర్ మోర్కెల్ మాట్లాడుతూ జర్మన్ ఇంజనీర్లు, భారత్ ఐటీ నిపుణులు బెంగళూరులో కలిసిపోయిన దృశ్యం అద్భుతమన్నారు. అంతకుముందు మోదీ, మోర్కెల్ లు జర్మన్ ఆటోమోటివ్ సంస్థ బోష్ బెంగళూరు ప్లాంట్ ను సందర్శించారు. -
ఆట మీద అధినేత్రి ప్రేమ..!
క్రేజీ ప్రెసిడెంట్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు కలిగిన వ్యక్తి... జర్మన్ చాన్సలర్ ఏంజెలా మోర్కెల్. అత్యంత శక్తియుక్తులతో జర్మనీ వంటి దేశాధినేతగా ఎన్నికై సమర్థంగా ఆ పదవిని నిర్వహిస్తున్న మోర్కెల్‌కు మరో కోణం ఉంది. అదే ఫుట్‌బాల్ పిచ్చి. అందుకోసం ఆమె తాను ఉన్న స్థాయిని కూడా కాసేపు పక్కనబెట్టి మరీ ఆటగాళ్లను ఉత్సాహ పరిచింది. అది ఇప్పుడు వార్తలో అంశంగా మారింది. అదేంటో చూద్దాం... ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆటగాళ్ల పండగ జరుగుతోంది. అదే ప్రపంచకప్. బ్రెజిల్లో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది జర్మన్ జట్టు. తమ జాతీయ టీమ్ ఆడుతున్న తొలి మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా హాజరైంది ఏంజెలా. పోర్చుగల్‌తో తలపడిన ఆ మ్యాచ్‌లో జర్మన్ జట్టు 4-0తో విజయం సాధించింది. ఇంకేముంది ఏంజెలాకు ఉత్సాహం వచ్చేసింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ కేరింతలు కొట్టిన ఆమె మ్యాచ్ ముగిశాక టీమ్ డ్రస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను పలకరించింది. అందరికీ అభినందనలు తెలిపి... ఇదే ఆటతీరుతో దూసుకుపొమ్మని ఉద్బోధించింది. ఉన్నట్టుండి ఆమె డ్రస్సింగ్ రూమ్‌లోకి రావడంతో ఆటగాళ్లే ఆశ్చర్యపోయారు.దేశాధినేత్రి తమతో సరదాగా గడపడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వాళ్లు ఎంతో సంతోషంగా చెప్పుకున్నారు.అన్నట్టు...మేడమ్ ఈ విధంగా జర్మన్ ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలవడం ఇది తొలిసారి కాదట! గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగా వాళ్లతో మమేకం అయ్యి ఆటపై, జాతీయ జట్టుపై తనకున్న అభిమానాన్ని చాటుకొందీ జర్మన్ చాన్సలర్. -
జర్మనీ చాన్స్‌లర్‌గా మళ్లీ మెర్కెల్
బెర్లిన్: జర్మనీ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ దేశ చాన్స్‌లర్‌గా ఏంజెలా మెర్కెల్(59) మంగళవారం వరుసగా మూడోసారి ఎన్నికై రికార్డు సృష్టించారు. యూరోప్‌లోనే పెద్దదైన ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ.. చాన్స్‌లర్ ఎన్నిక విషయంలో గత కొన్ని నెలలుగా రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంది. సెప్టెంబర్ 22న జరిగిన ఎన్నికల్లో మెర్కెల్‌కు చెందిన సంప్రదాయవాద క్రిస్టియన్ డెమోక్రాట్స్ యూనియన్ (సీడీయూ) గెలిచినప్పటికీ సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది. దాంతో అప్పటినుంచి ప్రతిపక్ష సోషల్ డెమోక్రాటిక్ పార్టీ(ఎస్పీడీ) మద్దతు కోసం చర్చలు జరిపి.. ఎట్టకేలకు ఆ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో జర్మనీ పార్లమెంట్ దిగువ సభ బుందెల్స్టగ్లోని 631 సీట్లలో ఆ కూటమికి 504 స్థానాల భారీ మెజారిటీ లభించినట్లైంది. మంగళవారం సభలో జరిగిన విజయ నిర్ధారణ ఓటింగ్‌లో ఆమెకు 462 మంది ఎంపీల మద్దతు లభించింది. సభకు హాజరైన 621 మంది సభ్యుల్లో 150 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేయగా, తొమ్మిదిమంది గైర్హాజరయ్యారు. జర్మనీ అధ్యక్షుడు జాచిమ్ గాక్తో ఆయన రాజప్రాసాదంలో సమావేశమైన తరువాత మెర్కెల్ చాన్స్‌లర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆమె నాలుగేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. గత ప్రభుత్వ కఠిన ఆర్థిక క్రమశిక్షణ నూతన సంకీర్ణ ప్రభుత్వంలోనూ కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎన్నికల్లో మెర్కెల్ హ్యాట్రిక్
బెర్లిన్: జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ) హ్యాట్రిక్ సాధించింది. గడచిన రెండు దశాబ్దాల ఫలితాల కన్నా అధిక సీట్లు కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. అయినప్పటికీ, అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీకి 4 సీట్లు తగ్గడం గమనార్హం. సోమవారం వెల్లడించిన అధికారిక ఫలితాల్లో సీడీయూ దాని భాగస్వామ్య క్ట్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ)లు 41.7 శాతం ఓట్లతో భారీ విజయం నమోదు చేసుకున్నాయి. యూరో జోన్లో ప్రస్తుతం నెలకొన్న పెను ఆర్థిక సంక్షోభం నేపథ్యంలోనూ ప్రజలందరూ 59 ఏళ్ల మెర్కెల్ నాయకత్వానికే మద్దతు పలకడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.