జర్మనీ రవాణా సంస్థ ఫ్లిక్స్‌బస్ (FlixBus)భారత్‌లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన భారత్‌లో ప్రయాణికులకు తక్కువ ధరకే మెరుగైన ఇంటర్‌సిటీ ప్రయాణ అనుభవాన్ని అందించనున్నట్లు వెల్లడించింది.
దేశంలో మొదటగా న్యూఢిల్లీ, హిమాచల్, జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, యూపీ అంతటా ఉన్న ప్రధాన నగరాలు, మార్గాలను కలుపుతూ ఫ్లిక్స్‌బస్ సర్వీసులు నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి.
టికెట్ రూ.99
లాంచింగ్ ఆఫర్ కింద ప్రారంభ రూట్‌లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూ. 99 లకే టికెట్‌లు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నార్త్ ఇండియాలోని ఢిల్లీ నుంచి అయోధ్య, చండీఘర్, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, అజ్మీర్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్‌పూర్, వారణాసి, జోధ్‌పూర్, ధర్మశాల, లక్నో, అమృత్‌సర్ వంటి అన్ని ప్రముఖ ప్రాంతాలకూ ఈ బస్సులు నడుస్తాయి. ఫ్లిక్స్‌బస్ సమగ్ర నెట్‌వర్క్‌లో 59 స్టాప్‌లు, మొత్తం 200 కనెక్షన్‌లు ఉంటాయి.
అన్నీ ప్రీమియం బస్సులు
జర్మనీకి చెందిన ఫ్లిక్స్‌బస్ సర్వీస్ ప్రత్యేకంగా BS6 ఇంజిన్‌లతో కూడిన ప్రీమియం బస్ మోడల్‌లను నిర్వహిస్తుంది, కఠినమైన ఉద్గార నిబంధనలకు కట్టుబడి పర్యావరణ సుస్థిరతను పెంపొందిస్తుంది. "ఫ్లిక్స్‌బస్‌ను ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బస్ మార్కెట్‌లలో ఒకటైన భారత్‌కి విస్తరించడం సంతోషిస్తున్నాం. ఇది మాకు 43వ దేశం. అందరికీ సుస్థిరమైన, సురక్షితమైన, సరసమైన ప్రయాణ ఎంపికలు అందిస్తాం" అని ఫ్లిక్స్‌బస్ సీఈవో ఆండ్రీ స్క్వామ్లీన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment