Bus service
-
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఉబర్.. బస్సులను నడపడానికి సిద్ధమైంది. ప్రీమియం బస్ స్కీమ్ కింద ఈ సర్వీసు ప్రారభించనున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ సేవను దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రారంభించనుంది.ఉబెర్కి బస్సులను నడపడానికి ఢిల్లీ రవాణా శాఖ అగ్రిగేటర్ లైసెన్స్ మంజూరు చేసింది. యాప్‌లో 'ఉబర్ షటిల్' ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రయాణికులు ఒక వారం ముందుగానే సీట్లను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తరువాత లైవ్ లొకేషన్, రూట్‌ని ట్రాక్ చేయవచ్చు.ఉబర్ బస్సులో ఒకసారికి 19 నుంచి 50 మంది ప్రయాణికులు పయనించవచ్చు. రోజు వారీ ప్రయాణాలను కూడా ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సర్వీసును మొదటి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పరీక్షించారు. ఇక త్వరలోనే ఈ సర్వీసును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ తరువాత కోల్‌కతాలో ప్రారంభించే అవకాశం ఉంది.బస్సు సర్వీస్ కోసం లైసెన్స్ పొందిన మొదటి కంపెనీగా ఉబెర్ అవతరించింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని ఢిల్లీ ప్రభుత్వంలోని రవాణా శాఖ అధికారి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సర్వీస్ ఇతర ప్రధాన నగరాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
FlixBus: భారత్‌లోకి జర్మనీ బస్సులు.. ఎక్కడికైనా రూ.99 టికెట్!
జర్మనీ రవాణా సంస్థ ఫ్లిక్స్‌బస్ (FlixBus)భారత్‌లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన భారత్‌లో ప్రయాణికులకు తక్కువ ధరకే మెరుగైన ఇంటర్సిటీ ప్రయాణ అనుభవాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. దేశంలో మొదటగా న్యూఢిల్లీ, హిమాచల్, జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, యూపీ అంతటా ఉన్న ప్రధాన నగరాలు, మార్గాలను కలుపుతూ ఫ్లిక్స్‌బస్ సర్వీసులు నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. టికెట్ రూ.99 లాంచింగ్ ఆఫర్ కింద ప్రారంభ రూట్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూ. 99 లకే టికెట్లు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నార్త్ ఇండియాలోని ఢిల్లీ నుంచి అయోధ్య, చండీఘర్, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, అజ్మీర్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్‌పూర్, వారణాసి, జోధ్‌పూర్, ధర్మశాల, లక్నో, అమృత్సర్ వంటి అన్ని ప్రముఖ ప్రాంతాలకూ ఈ బస్సులు నడుస్తాయి. ఫ్లిక్స్‌బస్ సమగ్ర నెట్‌వర్క్‌లో 59 స్టాప్‌లు, మొత్తం 200 కనెక్షన్లు ఉంటాయి. అన్నీ ప్రీమియం బస్సులు జర్మనీకి చెందిన ఫ్లిక్స్‌బస్ సర్వీస్ ప్రత్యేకంగా BS6 ఇంజిన్లతో కూడిన ప్రీమియం బస్ మోడల్లను నిర్వహిస్తుంది, కఠినమైన ఉద్గార నిబంధనలకు కట్టుబడి పర్యావరణ సుస్థిరతను పెంపొందిస్తుంది. "ఫ్లిక్స్బస్ను ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బస్ మార్కెట్లలో ఒకటైన భారత్‌కి విస్తరించడం సంతోషిస్తున్నాం. ఇది మాకు 43వ దేశం. అందరికీ సుస్థిరమైన, సురక్షితమైన, సరసమైన ప్రయాణ ఎంపికలు అందిస్తాం" అని ఫ్లిక్స్‌బస్ సీఈవో ఆండ్రీ స్క్వామ్లీన్ అన్నారు. -
హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నారు. మొదటి విడతగా 10 బస్సులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్ క్రాస్‌రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలోరవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జెండా ఊపి ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభిస్తారు. టీఎస్‌ఆరీ్టసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మిగతా 40 బస్సులను ఈ ఏడాది చివరినాటికి దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ–గరుడ బస్సుల ప్రత్యేకతలివీ.. 👉కొత్తగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి. 41 సీట్లు ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. 👉 ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతోపాటు రీడిండ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. 👉 ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ ఉంటుంది. వాటిని టీఎస్‌ఆరీ్టసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. 👉 ప్రతి బస్సులో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. 👉 బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమేటిక్ ప్యాసింజర్ కౌంటర్ (ఏపీసీ) కెమెరా కూడా ఉంది. 👉 బస్సును రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. 👉 బస్సుకు ముందు, వెనుక ఎల్ఈడీ బోర్డులు ఉంటాయి. వాటిలో గమ్యస్థానాల వివరాలను ప్రదర్శిస్తారు. 👉 అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ బస్సుల్లో ‘ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం (ఎఫ్డీఎస్ఎస్)’ను ఏర్పాటు చేశారు. 👉 ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా బస్సుల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది. త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు గ్రేటర్ హైదరాబాద్‌లో పరుగులు తీసేందుకు త్వరలోనే 10 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లైఓవర్లు, మెట్రో మార్గాలు లేని రూట్లలో వీటిని నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రానున్న రెండేళ్లలో ఆర్టీసీలో మొత్తంగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 1,300 బస్సులను హైదరాబాద్‌లో నడుపుతారు. మరో 550 బస్సులను హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు తిప్పనున్నారు. చదవండి: 16 బోగీలతో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్.. ఎప్పటి నుంచి అంటే? -
TSRTC: లాభాల కిక్‌తో 2023లోకి ఆర్టీసీ.. పదేళ్లలో తొలిసారి..
సాక్షి, హైదరాబాద్: దాదాపు పదేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్‌ఆరీ్టసీ... కొత్త ఏడాదిలో నూతనోత్సాహంతో అడుగుపెడుతోంది. గతేడాది ఏకంగా 26 డిపోలను లాభాల్లో నిలపడంతోపాటు మిగతా డిపోల్లో నష్టాలను భారీగా తగ్గించుకొని 2022కు గుడ్‌బై చెప్పేసింది. జూలైలో డీజిల్ సెస్‌ను సవరించడం ద్వారా రోజువారీ టికెట్ ఆదాయాన్ని భారీగా పెంచుకున్న ఆర్టీసీ... గత మూడు వారాలుగా ప్రాఫిట్ చాలెంజ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పెద్ద ప్రభావాన్నే చూపింది. డీజిల్ సెస్‌ను పెంచాక నవంబర్ వరకు కొన్ని డిపోలే లాభాల్లోకి రాగా, ప్రాఫిట్ ఛాలెంజ్ ప్రారంభించాక వాటి సంఖ్య దాదాపు రెట్టింపైంది. ఏమిటీ చాలెంజ్..? గత కొన్ని నెలలుగా ఆరీ్టసీలో రకరకాల చాలెంజ్‌లు నిర్వహిస్తున్నారు. గత దసరా వేళ ఆదాయం మరింత పెరిగేలా సంస్థ యాజమాన్యం దసరా ఛాలెంజ్‌ను నిర్వహించింది. అలాగే రాఖీ పండుగ సందర్భంగా రాఖీ చాలెంజ్, శుభకార్యాలు అధికంగా ఉండి ప్రయాణాలు ఎక్కువగా ఉండే శ్రావణమాసంలో శ్రావణమాస చాలెంజ్ లాంటివి నిర్వహించింది. ఈ కొత్త ప్రయత్నాలకు తగ్గట్లుగానే వివిధ డిపోలకు అవే పండగలకు గతంలో వచ్చిన ఆదాయం కంటే ఈసారి ఎక్కువ ఆదాయం వచి్చంది. అలాగే 3 నెలలపాటు డిపోలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టేలా సంస్థ 100 రోజుల చాలెంజ్ నిర్వహించి గరిష్ట ఆదాయాన్ని పొందింది. వాటితో పోలిస్తే మరింత ప్రభావవంతంగా పనిచేసేలా.. డిపోల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టిస్తూ గత మూడు వారాలుగా ప్రాఫిట్ చాలెంజ్‌ను మేనేజ్మెంట్ విసిరింది. ఇది ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది. డీజిల్ సెస్ పెంచాక నవంబర్ వరకు 13 డిపోలు లాభాల్లోకి రాగా ప్రాఫిట్ చాలెంజ్ మొదలయ్యాక ఆ సంఖ్య ఏకంగా 26కు చేరుకుంది. ఏప్రిల్ వరకు కార్పొరేషన్ లాభాల్లోకి! ప్రాఫిట్ ఛాలెంజ్‌లో భాగంగా రోజువారీ టికెట్ ఆదాయం పెరిగేలా చేయడంతోపాటు ఖర్చులను తగ్గించాలి. ఇందుకు 15 అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని మేనేజ్మెంట్ ఆదేశించింది. వాటిని ఎలా నిర్వహించాలో డిపో మేనేజర్లకు శిక్షణ ఇవ్వగా వారు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. డిపోలను లాభాల్లోకి తెచ్చేందుకు సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఏప్రిల్ నాటికి సిటీలోని కొన్ని మినహా మిగతా డిపోలు లాభాల్లోకి వచ్చి మొత్తం కార్పొరేషన్ బ్రేక్ ఈవన్ స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం 26 డిపోలు లాభాల్లో ఉండగా మరో 10 డిపోల్లో రోజువారీ నష్టాలు రూ. లక్షలోపు ఉన్నాయి. ఇంకో పది డిపోల్లో నష్టాలు రూ. 2 లక్షల్లోపు ఉన్నాయి. వెరసి మరో 20 డిపోలు త్వరలోనే లాభాల్లోకి రానున్నాయి. అధిక నష్టాలు వచ్చే వాటిల్లో మొదటి 10 స్థానాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని డిపోలే ఉన్నాయి. వాటిని నియంత్రించగలిగితే కార్పొరేషన్ పరిస్థితి బాగా మెరుగుపడనుంది. లాభాల్లో ఉన్న డిపోలు ఇవే ఇబ్రహీంపట్నం, జగిత్యాల, గోదావరిఖని, కరీంనగర్–1, వనపర్తి, సిద్దిపేట, వరంగల్–1, నల్లగొండ, యాదగిరిగుట్ట, హనుమకొండ, కోదాడ, జనగామ, మెదక్, వేములవాడ, సంగారెడ్డి, దేవరకొండ, భూపాలపల్లి, మణుగూరు, మహేశ్వరం, పరిగి, నర్సాపూర్, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి, హైదరాబాద్–2, హైదరాబాద్–1, పికెట్. చదవండి: ఐటీ కారిడార్‌కు మరో మణిహారం.. కొత్త సంవత్సరం కానుకగా ఫ్లై ఓవర్.. -
కర్ణాటకలో ‘చక్రం’ తిప్పాలని తెలంగాణ ఆర్టీసీ పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: పొరుగురాష్ట్రాల్లోనూ చక్రం తిప్పాలని టీఎస్ ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపిన టీఎస్ ఆర్టీసీ తాజాగా కర్ణాటకకు కూడా బస్సుల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించింది. ఇటీవలే కర్ణాటక ఆర్టీసీ అధికారులతో బెంగళూరులో చర్చలు జరిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక పరిధిలో మరో 30 వేల కిలోమీటర్ల మేర నిత్యం అదనంగా బస్సులు తిరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అదనంగా వంద బస్సులు అవసరమవు తాయని తేల్చారు. దీనివల్ల రోజువారీ ఆదాయంలో రూ.25 లక్షల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని బెంగుళూరు, మైసూరు, బెల్గాం, బీజాపూర్, యాద్గీర్, బీదర్, రాయచూర్ లాంటి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ 500 బస్సులను కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు తిప్పుతోంది. వీటి ఆక్యుపెన్సీ రేషియో కూడా ఎక్కువ గానే ఉంది. కర్ణాటకలోని మూడు ఆర్టీసీలు కూడా హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నాయి. వాటికి కూడా ఆదరణ బాగా ఉంది. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచుకోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాయి. 2008లో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒప్పందం కుదిరింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఎస్ ఆర్టీసీతో విడిగా ఒప్పందం చేసుకోలేదు. దీంతో ఇటీవలే కర్ణాటక అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. బస్సుల సంఖ్య పెంచుకునేందుకు ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో అధికారులు, బెంగళూరు వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించారు. స్లీపర్ బస్సుల కేటాయింపు ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులు కొంటోంది. మరో 108 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకుంటోంది. వీటిలో కొన్నింటిని కర్ణాటకకు అదనంగా తిప్పే సర్వీసులకు కేటాయించాలని నిర్ణయించింది. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు, రాయచూర్ లాంటి ప్రాంతాలకు వాటిని తిప్పాలని భావిస్తోంది. దూరప్రాంతాలు కావటంతో జనం స్లీపర్ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద స్లీపర్ బస్సుల్లేక చాలామంది ప్రైవేటు బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోతోంది. ఇప్పుడు కొత్తగా పెట్టే స్లీపర్ బస్సులతో ఆ ప్రయాణికులను తనవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. -
ఒక్క పాటతో కోట్ల మంది మదిని గెలిచింది.. ఆ పాటతోనే..
ఆ యువతి బస్సు సౌకర్యం లేని మారుమూల గ్రామంలో జన్మించింది. అయితేనేం. ‘ఊరంత వెన్నెలా.. మనసంతా చీకటి’ పాటతో కోట్లాది మంది మదిని గెలిచింది. పుట్టిన ఊరికి పేరు ప్రతిష్టతో పాటు బస్సు సౌకర్యం తీసుకొచ్చింది దాసరి లక్ష్మీపార్వతి. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన ఈ యువ గాయని శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడింది. మనోగతం ఆమె మాటల్లోనే.. saregamapa singer parvathy: మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. మా తల్లిదండ్రులు దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూమార్తెలు సంతానం. అందరి కంటే మా కుటుంబంలో పెద్దది అక్క సరస్వతి, తర్వాత ఇద్దరు అన్నలు చంద్రమోహన్, ఉపేంద్ర. వారి తర్వాత నేను పుట్టాను. మాకున్న 4.70 ఎకరాల పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే ఇష్టం. మా ఊరి ప్రాథమిక స్కూలులో చదివేటప్పుడు మొదటిసారిగా ‘పుట్టింటికిరా చెల్లి’ సినిమాలో పాట పాడాను. దీన్ని విన్న మా ఉపాధ్యాయుడు మద్దయ్య భవిష్యత్తులో మంచిస్థాయిలో ఉంటావని చెప్పి అభినందించారు. తర్వాత 4,5 తరగతులను డోన్ మండలం జగదుర్తి గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో, 6 నుంచి 10 తరగతి వరకు కొత్తపల్లె మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల, ఇంటర్ ఎమ్మిగనూరు ప్రభుత్వ కాలేజీలో చదివాను. నేను అక్కడ పాటలు పాడటాన్ని చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించేవారు. ఇంటర్ తర్వాత వ్యవసాయం కలిసిరాక కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఏడాదిపాటు ఇంటి దగ్గరే ఉన్నా. ఈ సమయంలో మా అమ్మనానలు, అన్నలు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసి వారితో పాటు నేను పొలం పనులకు వెళ్లాను. తిరుపతి సంగీత కళాశాలలో శిక్షణ ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే పలుకూరు గ్రామానికి చెందిన హర్మోనిస్టు హరి విని సంగీతం నేర్పిస్తే మీ చెల్లెలు మంచి గాయని అవుతుందని మా అన్నయ్యకు చెప్పారు. అలా ఆయన ద్వారానే తిరుపతిలో సంగీత కళాశాల ఉందనే విషయం తెలుసుకుని 2017లో ఆ కళాశాలకు అన్లైన్లో దరఖాస్తు చేసుకుని చేరాను. అక్కడ గురువు వల్లూరి సురేష్‌బాబు వద్ద శిక్షణ తీసుకున్నాను. గతేడాది డిసెంబర్ 9న ఎస్వీబీసీలో చానల్లో ‘అదిగో అల్లదిగో’ ప్రోగ్రాంకు పాట పాడే అవకాశం వచ్చింది. అక్కడ ‘ఏమి చేయవచ్చునే’ అనే అన్నమయ్య కీర్తన పాడాను. న్యాయనిర్ణేతగా వచ్చిన ఎస్పీ శైలజ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. పాటతో బస్సు వచ్చింది ఈయేడాది జనవరి 14న ఓ తెలుగు చానల్లో సరిగమప కార్యక్రమానికి సెలెక్షన్ నిర్వహించారు. అందులో నేను ఎంపికై తొలుత ‘ఊరంత వెన్నెల.. మనసంతా చీకటి’ పాట పాడాను. నా పాటను మెచ్చి సంగీత సామ్రాట్ కోటి నీకు ఏమీ కావాలో కోరుకోమన్నారు. వెంటనే మా గ్రామానికి బస్సు వేయాలని కోరా. అందుకు న్యాయనిర్ణేతలు అంగీకరించి ఏపీ మంత్రి పేర్ని నానితో మాట్లాడి డోన్ నుంచి దేవనకొండ వెళ్లే బస్సును మా గ్రామానికి వచ్చేలా చేశారు. ఇందుకు సహకరించిన అందరికీ ప్రత్యేకంగా మా గ్రామం తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నా. అలాగే కర్నూలు నుంచి వయా ఈదుల దేవరబండ మీద మా గ్రామ సమీపంలోని బండపల్లె వరకు బస్సు వస్తుంది. అది కూడా మా గ్రామంలోకి వచ్చిపోతే వివిధ పనుల మీద నేరుగా కర్నూలుకు వెళ్లే రైతులకు మేలు జరుగుతుందని గాయని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో మంచి సింగర్‌గా స్థిరపడి జిల్లాలో సంగీత పాఠశాల ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వాలన్నదే తన ఆశయమని ఈ యువ గాయని చెప్పుకొచ్చారు. -
12 ఏళ్ల తర్వాత ఊరికి బస్సొచ్చింది
జూలూరుపాడు: 12 ఏళ్ల తర్వాత ఓ గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు తిరిగి ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు సర్వీసు శుక్రవారం మొదలైంది. ఈ గ్రామానికి గతంలో బస్సు నడిచినా రోడ్డు బాగా లేదని, ఆదరణ ఉండడం లేదనే కారణంతో 12 ఏళ్ల కిందట సర్వీసు నిలిపివేశారు. దీంతో గ్రామానికి చెందిన చెవుల బాలరాజు ఈనెల 7న ట్విట్టర్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తమ సమస్యపై విన్నవించారు. దీంతో ఆయన రూట్ మ్యాప్ పరిశీలించి గ్రామానికి బస్సు నడపాలని కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరబాబుకు రీట్వీట్ చేశారు. ఈమేరకు 11న సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాంచా నాయక్, కంట్రోలర్ జాకంతో కలిసి కొత్తగూడెం డీఎం.. గ్రామానికి చేరుకుని సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం సర్వీసు ప్రారంభించగా.. గ్రామస్తులు బస్సుకు మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులు కట్టి స్వీట్లు పంచుకున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ గ్రామంలో డప్పు చాటింపు కూడా వేయించారు. ఈటల భూముల్లో నాలుగో రోజు సర్వే వెల్దుర్తి(తూప్రాన్): మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివారుల్లో మాజీ మంత్రి ఈటల కుటుంబీకుల భూముల్లో నాలుగో రోజు కూడా సర్వే కొనసాగింది. శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లు 77, 78, 79, 80, 81, 82లోని భూములను సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయా సర్వే నంబర్లతో పాటు రైతుల వారీగా హద్దులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు 500 హద్దురాళ్లు తెప్పించారు. మాసాయిపేట రెవెన్యూ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన రికార్డులను తూప్రాన్ ఆర్డీఓ శ్యాంప్రకాశ్ పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా పట్టా భూమి ఎంత ఉంది.. అసైన్డ్, సీలింగ్ భూములు ఎన్ని ఉన్నాయి.. ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్ భూముల్లో ఇతరులు పాగా వేశారా? వంటి వివరాలను ఆయన తెలుసుకున్నారు. -
వ్యాక్సిన్ వేయించుకోండి, లేదంటే ఇకపై బస్సు ప్రయాణం కష్టమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 భయంతో ప్రయాణాలు అంటేనే జంకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ‘వ్యాక్సినేటెడ్ బస్’ సర్వీసులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 600 ప్రధాన మార్గాల్లో ఈ సేవలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ఈ బస్‌లలో ప్రయాణిస్తారు. సిబ్బంది, ప్రయాణికులకు కనీసం ఒక డోస్ అయినా అందుకోవాల్సి ఉంటుంది. బస్ ఎక్కే సమయంలో తప్పనిసరిగా రుజువు చూపించాల్సిందే. కస్టమర్ల రేటింగ్ నాలుగు స్టార్స్ కంటే ఎక్కువగా పొందిన బస్ ఆపరేటర్ల సహకారంతో వ్యాక్సినేటెడ్ బస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. సిబ్బంది, తోటి ప్రయాణికులు కనీసం ఒక డోస్ అయినా తీసుకుంటే వారితో ప్రయాణించేందుకు తాము సిద్ధమని 89 శాతం మంది తమ సర్వేలో వెల్లడించారని రెడ్‌బస్ సీఈవో ప్రకాశ్ సంగం తెలిపారు. స్పందననుబట్టి ఇతర మార్గాల్లోనూ ఈ సేవలను పరిచయం చేస్తామన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు ఇవ్వడంతో బస్ సర్వీసులను అమాంతంగా పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రీజనల్ మేనేజర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం 55 వేల మంది ఉద్యోగుల్లో 45 ఏళ్ల దాటినవారు 33 వేల మంది ఉన్నారు. వారిలో 29 వేల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్లు వేయగా, కేవలం 6 వేల మందికే రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. 45 ఏళ్లు దాటిన ఉద్యోగులందరికీ జూలై 31 నాటికి రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేయాలని ఎండీ స్పష్టం చేశారు. తక్కినవారికి జూలై 31 నాటికి మొదటి డోసు వ్యాక్సిన్లు వేసి, ఆగస్టు 31 నాటికి రెండు డోసులు పూర్తి చేయాలన్నారు. -
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రేపటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్‌లు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణలో కరోనా లాక్డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో అంతర్రాష్ట్ర బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడపనున్నారు. రేపటి నుంచి తెలంగాణకు బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ రేపటి నుంచి తెలంగాణకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఉదయం 6 నుంచి సా.6 గంటల వరకు బస్సులు నడపాలని నిర్ణయించింది. ఏపీఎస్ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. చదవండి: సిద్ధిపేట నేను పుట్టిన జిల్లా: సీఎం కేసీఆర్ 25న డిస్కవరీలో ‘కాళేశ్వరం’పై డాక్యుమెంటరీ -
రేపటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్ధరణ
-
ఏపీఎస్ ఆర్టీసీ క్లారిటీ: ప్రతిష్టంభన వీడినట్లేనా!
సాక్షి, అమరావతి : లాక్డౌన్ సమయం నాటి నుంచి తెలంగాణ ఆర్టీసీ-ఏపీఎస్ ఆర్టీసీ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన వీడినట్లే కనిపిస్తోంది. ఇరు రాష్ట్రల అధికారుల మధ్య ఇప్పటికే పలు విడతలుగా సాగిన భేటీల్లో కీలక అంశాలపై చర్చించగా.. వీటిపై ఏపీఎస్ ఆర్టీసీ తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ అధికారులు కోరిన ప్రతిపాదనలకు తాము సానుకూలంగా ఉన్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు శుక్రవారం ప్రకటించారు. ఏపీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నా1.6 లక్షల కిమీలకు తగ్గామని పేర్కొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ తాజా నిర్ణయంతో ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పవన్నారు. టీఎస్ అభ్యంతరాల కారణంగా నష్టం ఉన్నప్పటికీ సర్వీసులను నడపాలనే ఉద్దేశంతో తాము వెనక్కి తగ్గామని కృష్ణబాబు స్పష్టం చేశారు. వాళ్లు కోరినట్లు రూట్ వైస్ క్లారిటీ కూడా ఇచ్చామని.. ఫైనల్ ప్రపోజల్స్ కూడా గత వారమే పంపామని తెలిపారు. అయినప్పటికీ టీఎస్ ఆర్టీసీ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడంలేదని, వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిరిగే కి.మీ. 2.64 లక్షలు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో తిరిగే కి.మీ. 1.61 లక్షలు మాత్రమే. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ సర్వీసులను తగ్గించుకోవాలని టీఎస్ ఆర్టసీ కోరుతోంది. దీనిపైనే గత రెండు నెలలుగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చులు సాగుతున్నాయి. తాజా ఏపీ లేఖతో సమస్యను వీడినట్లే తెలుస్తోంది. ఈ నెల 21న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సమాన కిలోమీటర్ల ప్రాతిపదికన అంగీకారం తెలుపుతూ 1.61 లక్షల కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు తిప్పుదామని ప్రతిపాదించింది. దీని మేరకే ఏపీఎస్ఆర్టీసీ అంగీకారం తెలుపుతూ లేఖ పంపింది. అయితే దసర పండుగ నేపథ్యంలో తెలంగాణ సైతం వీలైనంత త్వరగా స్పందించే అవకాశం ఉంది. ఇరు యాజమాన్యాల అంగీకారంతో పండగ నాటికి అంతరాష్ట్రాల సర్వీసులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. (దసరా టూర్‌కు ‘ఆర్టీసీల’ బ్రేక్!) ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవా.. దసర పండగ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నడుమ సర్వీసులు ప్రారంభంకాకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక. ఈ పండుగ వేళ హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి వారి ప్రయాణాలు మొదలవుతాయి. ఆర్టీసీకి కూడా దసరా సీజన్ కలెక్షన్లు కురిపిస్తుంది. పెద్దెత్తున ఆదాయం వస్తుంది. ఈ సమయంలో చార్జీలు అధికారికంగా 50 శాతం పెంచినా ప్రజలు దాన్ని అంతగా పట్టించుకోరు. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరకపోవడంతో బస్సులు సరిహద్దులు దాటడం లేదు. రెండు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నా సయోధ్య కుదరలేదు. మరోవైపు కోవిడ్ నిబంధనలతో రైళ్లు కూడా తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. వాటిల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విధిలేక ప్రజలు ప్రైవేటు బస్సుల కోసం పరుగుపెట్టాల్సి వస్తోంది. దొరికిందే అదునుగా వారు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ చార్జీ రూ.290 ఉంటే.. ప్రైవేట్‌లో రూ.700కు నుంచి 1000 వరకు వసూలు చేస్తున్నారు. వారి దోపిడికి అడ్డుకట్ట వేయాలంటే ఇరు రాష్ట్రాల సర్వీసులు ప్రారంభించక తప్పదు. -
దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండగను పురస్కరించుకుని ఏపీఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపనుంది. సాధారణంగా ఏటా దసరా పండుగకు 2,500కు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపేది. తెలంగాణతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ 1.61 లక్షల కిలోమీటర్లకు పరిమితమై 322 బస్సుల్ని తగ్గించుకునేందుకు సిద్ధపడినా టీఎస్ఆర్టీసీ ప్రస్తుతం కొత్త మెలికలు పెడుతోంది. ఏపీఎస్‌ఆరీ్టసీ నడిపే బస్సుల టైం కూడా తామే నిర్దేశిస్తామని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా పండుగ నేపథ్యంలో బెంగళూరుకు 562 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పనున్నారు. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ఇంకా అనుమతించకపోవడంతో ఏపీఎస్‌ఆరీ్టసీ ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే బస్సులను నడపనుంది. ప్రైవేటు ఆపరేటర్ల జోరు.. తెలంగాణ వైఖరితో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరని పరిస్థితుల్లో ప్రైవేటు ఆపరేటర్లు జోరు పెంచారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని తిప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 750 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. మరోవైపు దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆరీ్టసీకి అధిక ఆదరణ ఉన్న విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–హైదరాబాద్, విశాఖ–హైదరాబాద్ రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే ఆన్లైన్ రిజర్వేషన్లు ప్రారంభించారు. టికెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిపై రవాణా శాఖ కమిషనర్ స్పందిస్తూ.. ప్రైవేటు ట్రావెల్స్ వారు అధిక రేట్లు వసూలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆర్టీసీ జిల్లాలవారీగా నడిపే ప్రత్యేక బస్సులివీ.. శ్రీకాకుళం, విజయనగరం–66, విశాఖపట్నం–128, తూర్పుగోదావరి–342, పశి్చమగోదావరి–40, కృష్ణా–176, గుంటూరు–50, ప్రకాశం–68, నెల్లూరు–156, చిత్తూరు–252, కర్నూలు–254, కడప–90, అనంతపురం–228 -
కరోనా కోరల్లో ముంబై బస్సు సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : బెస్ట్ పబ్లిక్ బస్ సర్వీసెస్ పరిధిలోని దక్షిణ ముంబై డిపోలో కండక్టర్‌గా పని చేస్తోన్న కిషన్ కుంభ్‌కర్ కరోనా వైరస్ బారిన పడి మే 13వ తేదీన మరణించారు. ఆయనతో ఆ డిపోకు చెందిన ఎంతో మంది కండక్టర్లు, డ్రైవర్లు కలిసి మెలిసి తిరిగారు. వారందరికి సకాలంలో గుర్తించి క్వారెంటైన్‌కు పంపించలేదు. ఫలితంగా ఎక్కువ మందికి కరోనా వైరస్ వ్యాపించినట్లు తెలుస్తోంది. బెస్ట్ బస్ సర్వీసు ముంబై మున్సిపాలిటీ పరిధిలో 1200 బస్సు సర్వీసులను నడుపుతోంది. దాదాపు ఆరువేల మంది కండక్లర్లు, డ్రైవర్లు, డిపో సిబ్బంది పని చేస్తున్నారు. (సడలింపులకు గ్రీన్ సిగ్నల్) అధికారిక లెక్కల ప్రకారం బెస్ట్ పబ్లిక్ బస్ సర్వీసెస్‌కు చెందిన 128 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 63 మంది కోలుకున్నారు. ఎనిమిది మంది మరణించారు. 971 మంది క్వారెంటైన్ పూర్తి చేసుకొని తిరిగి విధుల్లో చేరగా, మరో వెయ్యి మంది క్వారెంటైన్లో ఉన్నారు. కరోనా వైరస్ బారిన పడి తమ సిబ్బంది కనీసం 19 మంది చనిపోయి ఉంటారని, కరోనా బారిన పడిన వారి సంఖ్య అధికారులు చెబుతున్న 128 కన్నా ఎక్కువే ఉంటుందని బెస్ట్ వర్కర్స్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. (మహమ్మారితో వణుకుతున్న మహారాష్ట్ర) తమ సిబ్బందిలో మొదటి కేసు బయట పడిన మే 13వ తేదీనాడే అధికార యంత్రాంగం స్పందించి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదని వారు అభిప్రాయపడ్డారు. వైరస్ బారిన పడిన కండక్టర్ల కారణంగా సాదారణ ప్రజలు ఎంత మందికి ఈ వైరస సోకిందేమోనన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తం అవుతోంది. -
ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
-
ఇక నాన్‌స్టాప్ ప్రయాణం
విశాఖపట్నం/డాబాగార్డెన్స్: కోవిడ్–19 కారణంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గురువారం ఉదయం రోడ్డెక్కనున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత చైతన్య చక్రాలు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. విశాఖ రీజియన్ పరిధి నుంచి 113 బస్సులు నడపనున్నట్లు ప్రాంతీయ మేనేజర్ యేసుదానం తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకే బస్సులు తిరగనున్నాయన్నారు. విశాఖ అర్బన్ ప్రాంతం కంటైన్మెంట్ ఏరియాలో ఉండడంతో సిటీ బస్సులు నడపలేమని చెప్పారు. విశాఖ రూరల్‌తో పాటు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు వరకు బస్సులు నడపనున్నామన్నారు. సీటు విడిచి సీటు కరోనా కారణంగా బస్సులో సీటు విడిచి సీటు(కనీసం మూడు అడుగుల దూరం)నుపయాణికులకు కేటాయించారు. ఒక బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఆర్డనరీ బస్సులతో పాటు లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్‌లను తిప్పనున్నారు. ్చpటట్టఛిౌnజీn్ఛ.జీn వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు ఆన్లైన్లో బుక్‌చేసుకోవచ్చు. మధ్యలో ఎక్కడా ఆపరు టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. కరెంట్ బుకింగ్ టికెట్లు కూడా ఆన్లైన్లోను బుక్ చేసుకోవాలి. కౌంటర్లలో టికెట్లు ఇవ్వరు. డిపో వద్ద మాత్రమే బస్సు ఎక్కాల్సి ఉంటుంది. మధ్యలో ఎక్కడ ప్రయాణికులను బస్సు ఎక్కించుకోరు. 65 ఏళ్ల వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్నారులను అత్యవసర పనులు, వైద్య సేవల కోసం మాత్రమే అనుమతిస్తారు. ఎలా అనుమతిస్తారు.. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుని వద్ద తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారు? పూర్తి చిరునామా, ప్రయాణికుడు వెళ్లే ప్రాంతం చిరునామా సేకరించిన తర్వాత థర్మల్ స్కాన్ తీస్తారు. అన్నీ ఓకే అయితే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ప్రతి ప్రయాణికుడు విధిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్స్ అందుబాటులో ఉంచనున్నారు. ఏఏ ప్రాంతాలకు.. జిల్లాలోని నర్సీపట్నం, పాడేరు, చోడవరం, అనకాపల్లి తదితర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోని రాజాం, పలాస, పాలకొండ, ఇచ్చాపురం, టెక్కలి, శ్రీకాకుళం(నాన్‌స్టాప్), పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రాజోలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు.. విజయవాడ, గుంటూరు జిల్లాలకు విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి బస్సులు పయనం కానున్నాయి. మధ్యలో ఎక్కడా ఆపరు కరెంట్ బుకింగ్ టికెట్లు కూడాఆన్లైన్లోను బుక్ చేసుకోవాలి. కౌంటర్లలో టికెట్లు ఇవ్వరు.డిపో వద్ద మాత్రమేబస్సు ఎక్కాల్సి ఉంటుంది. మధ్యలో ఎక్కడ ప్రయాణికులను బస్సు ఎక్కించుకోరు. అనుమతి ఇలా... ♦ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుని వద్ద తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ♦ ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారు? పూర్తి చిరునామా, ప్రయాణికుడు వెళ్లే ప్రాంతం చిరునామా సేకరించిన తర్వాత థర్మల్ స్కాన్ తీస్తారు. ♦ అన్నీ ఓకే అయితే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ♦ ప్రతి ప్రయాణికుడు విధిగా మాస్క్ ధరించాలి. ♦ శానిటైజర్స్ అందుబాటులో ఉంచనున్నారు. -
రోడ్డెక్కనున్న బస్సులు
సాక్షి, చెన్నై: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు మరికొన్ని రోజుల్లో రోడ్డెక్కనున్నాయి. ఇందుకు తగ్గ కసరత్తుల మీద రవాణాశాఖ వర్గాలు దృష్టి పెట్టాయి. 50 శాతం బస్సులు మాత్రమే నడిపే దిశగా కార్యచరణ సిద్ధమవుతోంది. మార్చి 24వ తేదీన లాక్డౌన్ అమల్లోకి రావడంతో అన్ని రకాల రవాణా సేవలు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ జనం స్వస్థలాలకు చేరుకోలేక నిలిచి పోవాల్సిన పరిస్థితి. బంధువుల ఇళ్లలోనో, లేదా తమకు తెలిసిన వాళ్లు, మిత్రుల నివాసాల్లో తలదాచుకుని ఉన్న వాళ్లు ఎందరో. తాజాగా ఉత్తరాది వాసుల్ని వారి స్వస్థలాలకు తరలించేందుకు తగ్గ కార్యచరణ సిద్ధమైంది. దశల వారీగా వీరిని వారి ప్రాంతాలకు రైళ్లల్లో తరలించనున్నారు. లాక్డౌన్ ఆంక్షలు, నిబంధనల సడళింపుతో అనేక దుకాణాలు, చిన్న పరిశ్రమలు తెరచుకుని ఉన్నాయి. రవాణా వ్యవస్థ లేని కారణంగా ఎక్కడెక్కడో చిక్కుని ఉన్న వాళ్లు తమ ప్రాంతాలకు వెళ్ల లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో లాక్ కారణంగా చిక్కుకుని ఉన్న వాళ్లు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల్ని నడిపేందుకు తగ్గ కసరత్తుల మీదదృష్టి పెట్టారు.ఆయా విభాగాల మేనేజర్లకు రవాణాశాఖ కార్యదర్శి ధర్మేంద్ర ప్రతాప్యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. బస్సుల్ని రోడ్డెక్కించేందుకు సిద్ధంగా ఉండాలన్నట్టుగా ఆ ఆదేశాలు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్న రాష్ట్రంలోని పలు జిల్లాల వాసులకు ఊరట కల్గించినట్టు అయ్యింది. ఈనెల 17వ తేదీ తదుపరి 50 శాతం బస్సుల్ని రోడ్డెక్కించడం ఖాయం అని రవాణాశాఖ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
మూడు రోజులు బస్సుల్లో ఉచిత ప్రయాణం
బెంగళూరు : లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాలలో చిక్కుక్కుపోయిన వలస కార్మికులు తమ, తమ ఊళ్లకు చేరుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. జిల్లా కేంద్రాల, బెంగళూరు నుంచి కేఎస్ఆర్టీసీ(కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్)బస్సులో కార్మికులను తమ తమ ఊళ్లకి తరలిస్తామని ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం వెల్లడించారు. (చదవండి : కోవిడ్-19 : పాత్రికేయులకు రూ 10 లక్షల బీమా) ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం నేటి నుంచి మూడు రోజుల(ఆది, సోమ, మంగళ వారం)మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇది కేవలం వలస కార్మికులను మాత్రమేనని, ఇతరులు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రాలు, బెంగళూరు నుంచి వలస కార్మికులు బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. ప్రయాణ ఖర్ఛులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అయితే బస్సు స్టాప్‌లలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడకుండా, సామాజిక దూరం పాటించేలా చూసుకోవాలని సూచించారు. కాగా, కర్ణాటకలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 601 సోకింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 25 మంది మృతి చేందారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మచిలీపట్నం చెన్నై బస్ సర్వీస్ ప్రారంభించిన మంత్రి పేర్ని నాని
-
ఢిల్లీ–లాహోర్ బస్సు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్–ఢిల్లీ బస్ సర్వీసులను పాక్ రద్దు చేసిన నేపథ్యంలో, భారత్ కూడా ఢిల్లీ–లాహోర్ బస్ సర్వీసును రద్దు చేసిందని ప్రజారవాణా సీనియర్ అధికారి తెలిపారు. ఈ బస్సు సోమవారం ఉదయం 6 గంటలకు లాహోర్‌కు వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం రద్దు అయింది. తమ దేశం నుంచి వస్తున్న బస్ సర్వీసులన్నీ సోమవారం నుంచి నిలిచిపోతాయని శనివారమే పాక్ స్పష్టం చేసింది. 1999 ఫిబ్రవరిలో ఈ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. -
వీళ్లేం పాలకులండీ!
తూర్పుగోదావరి,మండపేట: చంద్రబాబు ప్రచార ఆర్భాటం ప్రయాణికులకు సంకటంగా మారుతోంది. ‘పసుపు కుంకుమ’ –2 పేరిట విశాఖపట్నంలో నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా బస్సులను తరలించడం జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 203, మెప్మా ఆధ్వర్యంలో 20 బస్సులను తరలించారు. ఉసూరుమంటూ కొందరు అర్ధాంతరంగా ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనుతిరగ్గా, తప్పనిసరి పరిస్థితుల్లో మిగిలిన వారు ఆపసోపాలు పడుతూ ప్రయాణాలు సాగించాల్సి వచ్చింది. గద్దెనెక్కాక బేషరతుగా డ్వాక్రా రుణాల మాఫీ హామీని గాలికొదిలేసిన చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ మహిళలకు గాలం వేసే పనిలో పడ్డారు. ‘పసుపు కుంకుమ –2’ పేరిట మరో దగాకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం వేదికగా శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు జిల్లాలోని రాజోలు డిపో మినహా మిగిలిన ఎనిమిది డిపోల నుంచి 223 బస్సులను తరలించారు. వీటిలో రాజమహేంద్రవరం డిపో నుంచి 35 బస్సులను, కాకినాడ నుంచి 34 బస్సులు, అమలాపురం నుంచి 23, గోకవరం నుంచి 25, రావులపాలెం నుంచి 17, ఏలేశ్వరం నుంచి 18, రామచంద్రపరం నుంచి 26, తుని నుంచి 25 బస్సులను డీఆర్డీఏ ఏర్పాటు చేయగా మెప్మా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, ఏలేశ్వరం డిపోల నుంచి రెండు బస్సులు చొప్పున అమలాపురం, కాకినాడ డిపోల నుంచి నాలుగు చొప్పున, తుని నుంచి ఎనిమిది బస్సులను ఏర్పాటు చేశారు. ఆయా బస్సుల ద్వారా అధికార పార్టీ నేతలు దాదాపు పది వేల మంది వరకూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలను ప్రాంతీయ సదస్సుకు తరలించినట్టు అంచనా. ప్రయాణికుల అవస్థలు పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, ఇంద్ర, అమరావతి, గరుడ కేటగిరీల్లో జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో ఆర్టీసీ, అద్దె ప్రాతిపదిక (హైయిర్) బస్సులు 875 వరకూ ఉన్నాయి. వీటిలో అధికశాతం ‘పల్లె వెలుగు’ బస్సులు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు మినహాయించి స్థానికంగా తిప్పే ‘పల్లె వెలుగు’ బస్సులను విశాఖ సదస్సుకు తరలించారు. కొన్ని రూట్లలో పూర్తిగా ‘పల్లె వెలుగు’ బస్సులను నిలిపివేయగా రద్దీ రూట్లలో ఒకటి రెండు మాత్రమే సర్వీసులు నడిపారు. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం తదితర పనుల నిమిత్తం బస్టాండ్లకు వచ్చిన వారు బస్సులు లేవని తెలిసి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇదే అదనుగా కొన్నిచోట్ల ఆటో చార్జీలను అమాంతం పెంచేశారు. సాధారణ టిక్కెట్టు ధరకు రెండు నుంచి మూడు రెట్లు వరకు అధికంగా వసూలు చేయడంతో చేతి చమురు వదిలిందని ప్రయాణికులు వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ప్రయాణం విరమించుకోగా, మరికొందరు కిక్కిరిసిన బస్సుల్లో అవస్థలతో ప్రయాణం సాగించారు. ప్రచార ఆర్భాటం కోసం ప్రయాణికులను ఇబ్బందులు పాలు చేయడమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రయాణికుల పాట్లు
సంక్రాంతి పండక్కి సొంతూరు వెళ్లేందుకు ప్రయాణికులు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. ఏ రైలు చూసినా రద్దీగా వస్తుండడంతో వాటిలో ఎక్కేందుకు ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేశారు. ఓవైపు పిల్లాపాపలు, మరోవైపు లగేజీలతో కిక్కిరిసి ప్రయాణించారు. పోనీ బస్సుల్లో వెళదామన్నా ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి గమ్యస్థానాలకు చేరుకున్నారు. తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తరం): సంక్రాంతికి నగరం సొంతూరికి బయలుదేరింది. దీంతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ ప్రయాణికులతో నిం డిపోయింది. ఇటు ఇచ్చాపురం, అటు విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దీగానే నడిచాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు దూర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపారు. ఇదిలావుండగా విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగో దావరి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ కాంప్లెక్స్ శనివారం ఉదయం నుంచి కిటకిటలాడింది. బస్టాండ్ ప్రాంగణం రద్దీగా మారింది. బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. సింహాచలం రైల్వేస్టేషన్ రద్దీ... గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): వలస జనం స్వగ్రామాలకు ప్రయాణాలు ఒక వైపు...సంక్రాంతి సందర్భంగా సింహాద్రప్పన్న దర్శన భాగ్యం కోసం వచ్చే యాత్రికులతో సింహాచలం రైల్వేస్టేషన్ రద్దీగా మారింది. రైళ్లు రద్దీగా ఉండడంతో జనం సాహసాలు చేశారు. ప్రాణాలకు తెగించి మరీ రైలు బోగీలను వేలాడుతూ ప్రయాణించారు. విశాఖ నుంచి రాయపూర్ , కోరాపుట్, పలాస, విజయనగరం, కోర్భా, దుర్గు, భువనేశ్వర్, సికింద్రాబాద్ తదితర ఎక్స్‌ప్రెస్, ప్యాసింజరు రైళ్లు విశాఖ స్టేషన్లోనే కిక్కిరిసి రావడంతో ఇక్కడి స్టేషన్లో ఎక్కడానికి యాత్రికులు, ప్రయాణికుల అవస్థలు పడ్డారు. ఇదిలా ఉండగా సంక్రాంతి సెలవుల సందర్భంగా వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, జనం విహార యాత్రలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
పాక్–చైనా బస్సు ప్రారంభం
ఇస్లామాబాద్: పాకిస్తాన్–చైనాల మధ్య విలాసవంతమైన బస్సు సర్వీసును పాక్ అధికారులు ప్రారంభించారు. భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఈ లగ్జరీ బస్సు సోమవారం అర్ధరాత్రి లాహోర్‌లోని గుల్బెర్గ్ నుంచి చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులో కష్గర్ నగరానికి బయలుదేరింది. దాదాపు 4.38 లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపట్టిన చైనా పాక్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ)లో భాగంగా ఈ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ‘షూజా ఎక్స్‌ప్రెస్’ అనే ప్రైవేటు సంస్థ ఈ మార్గంలో లగ్జరీ బస్సులను నడపనుంది. కేవలం 15 మంది ప్రయాణికులు మాత్రమే ఉండే ఈ బస్సు 36 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటుంది. పాక్ నుంచి చైనాకు వెళ్లేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.13,000 వసూలు చేయనున్నారు. అదే రాకపోకలకు ఒకేసారి టికెట్ బుక్ చేసుకుంటే రూ.23,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసు పాక్‌లో శని, ఆది, సోమ మంగళవారాల్లో బయలుదేరుతుంది. అలాగే చైనా నుంచి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఈ బస్సు సర్వీసు లాహోర్‌కు చేరుకుంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) మీదుగా ఈ సర్వీసు వెళ్లడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయగా, పాక్, చైనాలు దాన్ని ఖండించాయి. భారత్ ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఈ బస్సు సర్వీస్ ప్రారంభం కారణంగా కశ్మీర్ విషయంలో తమ దేశ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని చైనా పేర్కొంది. -
పాక్–చైనా బస్సు సర్వీస్.. వయా పీవోకే!
బీజింగ్: ఈ నెల 3వ తేదీ నుంచి చైనా, పాక్‌ల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సు కాస్గర్– పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం లాహోర్ మధ్య ఈ బస్సు నడపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా ఈ బస్సును నడపాలన్న నిర్ణయంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పీవోకే కూడా తమదే అని పేర్కొంటున్న భారత్.. ఆ భూభాగం గుండా బస్సు సర్వీసు నడపడం తమ ప్రాదేశిక సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగకరమని తెలిపింది. సీపెక్ ప్రాజెక్టు చైనా–పాక్ దేశాల ఆర్థిక సహకారానికి సంబంధించింది మాత్రమేననీ, మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రాజెక్టు కాదని చైనా తెలిపింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొట్టమొదటి చైనా పర్యటన ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా బస్సు సర్వీసు నిర్ణయం వెలువడటం గమనార్హం. -
సీతమ్మ కరుణాకటాక్షాలతోనే
కఠ్మాండు/జనక్‌పూర్: పొరుగు దేశాలకు అధిక ప్రాధాన్యమన్న భారత విధానంలో నేపాల్‌కు అగ్రస్థానం కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం నేపాల్‌లో అడుగుపెట్టారు. సీతాదేవి జన్మస్థానంగా విశ్వసిస్తున్న జనక్‌పూర్‌లోని జానకి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ పర్యటించాలన్న తన చిరకాల కోరిక సీతమ్మ కరుణాకటాక్షాలతోనే తీరిందని అన్నారు. జనక్‌పూర్, దాని పొరుగు ప్రాంతాల అభివృద్ధికి మోదీ రూ.100 కోట్ల సాయం ప్రకటించారు. అంతకు ముందు నేపాల్ ప్రధాని కేపీ ఓలితో కలసి జనక్‌పూర్–అయోధ్య మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఇరువురు నేతలు తూర్పు నేపాల్‌లోని టమ్లింగ్టార్లో 900 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి రిమోట్ సిస్టం ద్వారా శంకుస్థాపన చేశారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది మూడోసారి. నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరాక మొదటిసారి. కష్టకాలంలో కలసిసాగిన భారత్, నేపాల్.. ఢిల్లీ నుంచి నేరుగా జనక్‌పూర్‌కు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అక్కడికి తాను ప్రధానిగా కాకుండా ఒక యాత్రికుడిగా వచ్చానని చెప్పారు. జనక్‌పూర్‌లో పర్యటించాలన్న తన చిరకాల కోరిక సీతాదేవి కటాక్షంతో తీరిందని ఆనందం వ్యక్తం చేశారు. సుప్రసిద్ధ కావ్యం రామచరితమానస్‌లోని ఓ పంక్తిని ఉటంకిస్తూ..‘ స్నేహితుడు బాధలో ఉంటే అతడికి దూరంగా ఉండలేం. నిజమైన స్నేహితుడు కష్టాల్లో ఉన్న స్నేహితుడికి సాయంగా ఉంటాడు’ అని పేర్కొన్నారు. సమస్యలొచ్చినప్పుడల్లా భారత్, నేపాల్ కలసికట్టుగా సాగాయని, కష్ట కాలంలో ఒకరికొకరు తోడుగా నిలిచాయని అన్నారు. 5 ‘టి’లతో రెండు దేశాలకు ప్రయోజనం.. రామాయణంతో సంబంధం ఉన్న రెండు పవిత్ర స్థలాలు జనక్‌పూర్–అయోధ్య మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసును మోదీ, ఓలీ ప్రారంభించారు. నేపాల్, భారత్‌లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ఉద్దేశించిన రామాయణ సర్క్యూట్లో భాగంగానే ఈ బస్సు సర్వీసును నిర్వహిస్తున్నారు. ఈ సర్క్యూట్లో భద్రాచలం(తెలంగాణ), హంపి(కర్ణాటక), రామేశ్వరం(తమిళనాడు) సహా మొత్తం 15 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 5 ‘టి’ల (ట్రెడిషన్, ట్రేడ్, టూరిజం, టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్)కు అధిక ప్రచారం కల్పిస్తే భారత్, నేపాల్ ఎంతో ప్రయోజనం పొందుతాయని అన్నారు. హైవే, ఐ(ఇన్ఫర్మేషన్)వే, రైల్వే, వాటర్ వే, ట్రాన్స్ వే ద్వారా రెండు దేశాలను అనుసంధానించాలన్నారు. ఓలీ కానుకగా ఇచ్చిన మైథిలి కుర్తాను ధరించి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేపాల్ అధ్యక్షురాలితో మర్యాదపూర్వక భేటీ నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి బండారీ, ఉపాధ్యక్షుడు నంద బహదూర్ పున్లను మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు దేశాల స్నేహ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, విద్యా దేవి బండారీ నిర్ణయించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. సీతమ్మ సేవలో 45 నిమిషాలు జనక్‌పూర్ దేవాలయానికి చేరుకున్న మోదీకి నేపాల్ ప్రధాని ఓలీ ఘన స్వాగతం పలికారు. సుమారు 45 నిమిషాలు ఆలయంలో మోదీ షోడషోపచార పూజలో పాల్గొన్నారు. ప్రార్థనాసమయంలో సీతారాముల భజన కీర్తనలను ఆలకించారు. సీతాదేవిని అర్చిస్తూ, కొత్త బట్టలు, ఆభరణాలతో అలంకరించారు. గతంలో మాజీ రాష్ట్రపతులు నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్‌సింగ్, ప్రణబ్ ఈ పూజచేశారు. -
తిరుమలకు డైలీ దర్శన్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి తిరుమల ఏడుకొండలవాని సన్నిధికి వెళ్లే వారి కోసం పర్యాటకశాఖ కొత్త ప్యాకేజీని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమలకు డైలీ దర్శన్ పేరిట ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే రెండు ఏసీ వోల్వో (మల్టీ యాక్సిల్) బస్సులను కొనుగోలు చేసింది. తొలిరోజు విశాఖ నుంచి బయలుదేరి మర్నాడు శ్రీకాళహస్తి, తిరుమల, అలివేలు మంగాపురాల్లో దర్శనం చేయించి మూడో రోజు ఉదయానికి విశాఖ తీసుకొచ్చేలా ప్యాకేజీని రూపొందించారు. రోజూ ఒక బస్సులో 48 మంది చొప్పున తీసుకెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ నుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. మర్నాడు ఉదయం శ్రీకాళహస్తి చేరుకుంటుంది. ఉదయం అక్కడ పర్యాటకశాఖ అతిథి గృహంలో స్నానపానాదులయ్యాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేయిస్తారు. అనంతరం తిరుపతికి తీసుకెళ్తారు. కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి గంటన్నరలో పర్యాటకశాఖ ప్రత్యేక కోటాలో స్వామి దర్శనం పూర్తి చేస్తారు. ఆ తర్వాత కొండ దిగువన ఉన్న అలివేలు మంగాపురం అమ్మవారు, గోవిందరాజుస్వామిల దర్శనం కల్పిస్తారు. అనంతరం సాయంత్రం బయలుదేరి మర్నాడు ఉదయం విశాఖ చేరుకుంటారు. దర్శన టిక్కెట్లు ప్యాకేజీలోనే.. తిరుమల శ్రీవారి దర్శనం సహా ఇతర దేవాలయాల్లో దర్శన టిక్కెట్ల ఖర్చును పర్యాటకశాఖే భరిస్తుంది. అయితే భోజనం ఖర్చును మాత్రం భక్తులే భరించాల్సి ఉంటుంది. ఆయా దేవాలయాల్లో దర్శనానికి ఇబ్బందుల్లేకుండా చూడడానికి పర్యాటకశాఖ మార్గదర్శి (గైడ్)ని ఎక్కడికక్కడే అందుబాటులో ఉంచుతుంది. ఈ ప్యాకేజీ ధర రూ.3000–3500 మధ్య ఉండేలా నిర్ణయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఇలాంటి ప్యాకేజీని బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నైల నుంచి తిరుపతికి నడుపుతోంది. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో విశాఖ నుంచి తిరుమల డైలీ దర్శన్ పేరిట ప్యాకేజీని సిద్ధం చేసింది. కాగా విశాఖ నుంచి తిరుపతికి గరుడ సర్వీసు టిక్కెట్టు ధర రూ.1350 ఉంది. ఈ లెక్కన రానూపోనూ రూ.2700 అవుతుంది. అదే టూరిజం ప్యాకేజీలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన టిక్కెట్టును భరిస్తూ ఇతర దేవాలయాల్లో దర్శనం చేయిస్తూ, పర్యాటకశాఖ అతిథి గృహంలో వసతి సదుపాయం కల్పిస్తూ రూ.3500 లోపు ప్యాకేజీని రూపొందిస్తున్నందున మంచి ఆదరణ అభిస్తుందని పర్యాటకశాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. నెల రోజుల్లో ప్రారంభిస్తాం.. తిరుమల డైలీ దర్శన్‌ను మరో నెల రోజుల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఆన్లైన్లో ఈ ప్యాకేజీ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం. విశాఖతో పాటు రాజమండ్రి, విజయవాడల్లోనూ పికప్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం. ఈ ప్యాకేజీ కోసం త్వరలో రెండు వోల్వో బస్సులు రానున్నాయి. వీటిలో ఇటు నుంచి ఒకటి, అటు నుంచి మరొకటి బయలుదేరతాయి. – ప్రసాదరెడ్డి,డివిజనల్ మేనేజర్, పర్యాటకాభివృద్ధి సంస్థ -
రోడ్డున్నా.. బస్సు రాదాయే!
మూసాపేట : రోడ్డు సౌకర్యం ఉన్నప్పటి కి ఆ మూడు గ్రామాలకు బస్సు సౌకర్య ం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను నడిపిస్తా మని అధికారులు పలు సమావేశాల్లో పేర్కొంటున్నప్పటికీ మండలంలో మా త్రం అది నోచుకోవడంలేదు. దీంతో ప్ర జలు ప్రైవేట్ ఆటోల్లో స్థాయికి మించి ప్రయాణం చేస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. బస్సుల్లేక అవస్థలు మండలంలోని నిజాలాపూర్, పోల్కంపల్లి,చక్రాపూర్,సూర్తి తండా,కనకాపూర్ తండాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సు సౌకర్యం లేదు. అంతేగాక, సె లవు దినం వచ్చిందంటే చక్రాపూర్కి వ చ్చే బస్సు సైతం బంద్ అవుతుంది. దీం తో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ని త్యం వందలాది మంది ప్రయాణికులు ఇటు జిల్లా, మండల కేంద్రాలతో పాటు, అటు నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్రకు పలు పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. కొన్నేళ్ల కిందట ఓ బస్సు జిల్లా కేంద్రం నుంచి చక్రాపూర్, లక్ష్మీపల్లి గ్రామాల మీదుగా దేవరకద్రకు చేరుకుని అటు నుంచి తిరిగి జిల్లా కేం ద్రానికి చేరుకునేది. కానీ ప్రైవే టు వా హనాల జోరు పెరగడంతో ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను రద్దు చేశారు. ఇటీవల మూడు నెలల క్రితం కొందరు గ్రామస్తుల కోరిక మేరకు బస్సు ప్రారంభమైనా.. సెలవు దినాలు వచ్చాయంటే చాలు ఆర్టీసీ వారు కూడా సెలవు తీసుకుంటారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకరంగా.. మండలంలోని చక్రాపూర్,సూర్తి తండా, కనకాపూర్ తండా తిమ్మాపూర్, పోల్కంపల్లి, తిమ్మాపూర్, తుంకినీపూర్, నిజాలాపూర్, మహ్మదుస్సేన్‌పల్లి, గ్రామాలకు కనీసం రెగ్యులర్‌గా మినీ బస్సు తిరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కానీ దాని గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. దీంతో ప్రజలు ప్రైవేట్ ఆటోలు, జీపులలో బిక్కు బిక్కు మంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. స్థాయికి మించి ప్రైవేట్ ఆటోల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. ఎమ్మెల్యే, జిల్లా అధికారులు స్పందించి మండలంలోని ప్రతీ గ్రామంలో ఒక మినీ బస్సు సర్వీస్ కొనసాగేలా చర్యలు చేపట్టి ప్రజల అవస్థలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేట్ వాహనాలే గతి మా గ్రామం జాతీయ రహదారికి కేవలం 4 కి.మీ దూరం ఉన్నా మండల, జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. సెలవు దినాల్లో అయితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. పై అధికారులు స్పందించి బస్సు సర్వీస్ నిత్యం నడిచేలా చర్యలు చేపట్టాలి. – భగవంతు, చక్రాపూర్ కాలినడకన వెళ్తున్నారు.. నేను రెండవ తరగతి చదువుకుంటున్న సమయంలో గ్రామానికి బస్సు వస్తుండేది. తర్వాత ఎందుకో సర్వీస్ నిలిచిపోయింది. నాటి నుంచి విద్యార్థులు కాలినడకన కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లాల్సి వస్తుంది. అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి – శ్రీకాంత్‌రెడ్డి, పోల్కంపల్లి -
జమ్ముకశ్మీర్-పీఓకే మధ్య మళ్లీ బస్సు!
సాక్షి, శ్రీనగర్ : జమ్ముకశ్మీర్-పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రాంతానికి నడిచే బస్సును సోమవారం నుంచి పునరుద్ధరించనున్నారు. పూంచ్-రావల్కోట్ రోడ్డు మార్గంలో సరిహద్దు రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఈ బస్సు ప్రయాణిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ బస్సు సర్వీసును గత నాలుగు నెలలుగా నిలిపివేశారు. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి పదే పదే కాల్పులు, మోర్టార్ల ప్రయోగం కారణంగా జూలై 10న ఈ బస్సును నిలిపివేశారు. అప్పటినుంచి చకన్-దా-బాగ్ వైపు నుంచి సరిహద్దు రేఖ దాటి బస్సు నడవలేదు. అయితే సరిహద్దు రేఖ వద్ద శుక్రవారం జరిగిన సమావేశంలో బస్సు ప్రయాణం, వ్యాపారాలను కొనసాగించాలని రెండు దేశాల సీనియర్ అధికారులు నిర్ణయించారు. వారానికొకసారి ఎల్ఓసీని దాటే ఈ బస్సు రేపటినుంచి పునరుద్ధరణ జరగవచ్చని భావిస్తున్నట్లు పూంచ్ సెక్టార్ ఎల్ఓసీ నియంత్రణాధికారి మొహమ్మద్ తన్వీర్ చెప్పారు. జమ్ముకశ్మీర్-పీఓకే ప్రాంతాల్లో విభజిత కుటుంబాల ప్రయాణ, వ్యాపార అవసరాల నిమిత్తం ఈ బస్సును శ్రీనగర్-ముజఫరాబాద్ రోడ్డు వరకు నడిచేలా 2005 ఏప్రిల్‌లో ప్రారంభించారు. పూంచ్-రావల్కోట్ మార్గంలో 2006 జూన్ 20న ప్రారంభించారు. -
నష్టాల బాటలో మార్కాపురం ఆర్టీసీ డిపో
► పెద్దనోట్ల రద్దుతో తగ్గిన ప్రయాణాలు ► 8 నెలల్లో రూ.3.10 కోట్ల నష్టం మార్కాపురం: 95 బస్సులు... 520 మంది సిబ్బంది...రోజుకు 37 వేల కిలోమీటర్ల ప్రయాణం... రాష్ట్రంతో పాటు తెలంగాణలోని ముఖ్య పట్టణాలకు బస్సు సర్వీసులు ఉన్నప్పటికీ మార్కాపురం డిపో నష్టాల బాటలో పయనిస్తోంది. పెరుగుతున్న డీజిల్ ఖర్చులు, సిబ్బంది జీత భత్యాలు, ప్రయాణికులకు ఆదరణ తగ్గటం వంటి వాటితో సతమతమవుతున్న ఆర్టీసీకి పెద్దనోట్ల రద్దు పెద్ద సమస్యగా మారింది. ప్రజల దగ్గర తగినంత డబ్బు లేకపోవటంతో ప్రయాణాలు వారుుదా వేసుకుంటున్నారంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సుమారు రూ.3.10 కోట్ల నష్టాలు ఆర్టీసీ చవి చూసింది. గత నెల 8వ తేదీ వరకు రోజుకు దాదాపు రూ.12 లక్షల ఆదాయం వస్తుండగా, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుతం రోజుకు రూ.9 నుంచి రూ.10 లక్షలు మాత్రమే ఆర్టీసీకి చార్జీల రూపంలో వస్తుంది. ఒక కిలోమీటర్ తిరిగేందుకు రూ.42 ఆర్టీసీ ఖర్చు పెడుతోంది. ఇందులో రూ.14 జీతభత్యాలు, రూ.19 మోటార్ వెహికల్ టాక్స్, టైర్ల ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు ఉన్నారుు. అరుుతే ఆర్డినరీ బస్సుకు కిలో మీటర్‌కు రూ.26, ఎక్స్‌ప్రెస్‌కు రూ.34 ఆదాయం మాత్రమే వస్తుంది. మార్కాపురం డిపో నుంచి అత్యధికంగా జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 22 సర్వీసులు ఉన్నారుు. ఇందులో 11 గెలాక్సీ సర్వీసులు ఉన్నారుు. మార్కాపురం నుంచి మాచర్లకు 8, హైదరాబాద్‌కు 8, బెంగళూరుకు 6, విజయవాడకు 5 సర్వీసులు ఉన్నారుు. నష్టాలకు కారణాలివీ.. మార్కాపురం - బెంగళూరు మధ్య తిరిగే ఇంద్ర సర్వీసు తీవ్రమైన నష్టాలతో నడుస్తోంది. అందుకు ఆర్టీసీ అనుసరిస్తున్న విధానమే ప్రధాన కారణమని అటు సిబ్బంది, ఇటు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ చార్జీలో నిలకడ లేకపోవటం, ప్రైవేటు బస్సుల చార్జీలతో పోటీ పడుతూ రోజుకో విధంగా చార్జీలు విధిస్తుండటంతో ప్రజలు ప్రైవేటు బస్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఆర్టీసీ డిమాండ్‌కు తగినట్లుగా సర్వీసు చార్జీల్లో మార్పు చేస్తోంది. ప్రతి రోజు విజయవాడలోని మెరుున్ సర్వర్‌లో అధికారులు అన్ని డిపోల్లో డిమాండ్ ఉన్న సర్వీసులకు చార్జీలు పెంచుతున్నారు. దీంతో పలువురు ప్రైవేటు బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీ నష్టాలకు ఇటీవల కాలంలో ఇదొక ప్రధాన కారణం. దీంతో పాటు గ్రౌండ్ బుకింగ్ విధానంలో స్పష్టత కరువవుతోంది. ప్రైవేటు బస్సుల డ్రైవర్లు కొంత మంది మధ్యలో బస్సు ఎక్కిన ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి టికెట్ ఇవ్వటం లేదు. దీంతో ఆర్టీసీ ఆదాయం కోల్పోతోంది. -
డిసెంబర్ నుంచే మిషన్ కాకతీయ రెండోదశ పనులు
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): మిషన్‌కాకతీయ రెండోదశ పనులను డిసెంబర్ నెల నుంచే ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది మిషన్ కాకతీయ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. దీంతో ఈ సారి మిషన్ కాకతీయ రెండో దశ పనులను డిసెంబర్ నెలలోనే ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో నూతనంగా రోడ్ల నిర్మాణానికి రోడ్లు-భవణాలు, పంచాయతీరోడ్లు శాఖ ఆధ్వర్యంలో రూ. 250 కోట్ల మంజూరయ్యాయన్నారు. మండలంలోని మల్కారం గ్రామానికి నూతనంగా బస్సు సర్వీస్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. -
వాట్ అయామ్ సేయింగ్..
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో పుష్కరయాత్రికుల హడావుడి కన్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హడావుడి ఎక్కువైందట. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీల పేరుతో ఆయన చేసే హడావుడితో అధికారుల మైండ్లు బ్లాంక్ అయ్యాయట. ఇటీవల చంద్రబాబు అర్ధరాత్రి పూట రాజమండ్రిలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు సౌకర్యాలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ఈ తనిఖీని చేపట్టారు. ఆయన బస్టాండులో ఉన్న సమయంలోనే పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని మైసూరు నుంచి పుష్కరాలకు వచ్చిన యాత్రికులు బస్సులు అందుబాటులో లేక తాము పడుతున్న ఇబ్బందులను కన్నడంలో సీఎంకు వివరించటం ప్రారంభించారు. విషయం అర్థమైన ఒక అధికారి సీఎంకు చెప్పారు. దాంతో సీఎం తన పక్కనే ఉన్న ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరికి వెంటనే మైసూరుకు ప్రత్యేక బస్సు ఒకటి వేయమని ఆర్డర్ వేశారట. మైసూరుకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుగా అనుమతులున్న బస్సునే వేయాలని, ఏ బస్సు పడితే ఆ బస్సు వేస్తే ఇబ్బందులు వస్తాయని క్షుణ్ణంగా వివరించారట. ఇవేవీ పట్టించుకోని సీఎం నేను చెబితే కనీసం ఒక్క బస్సు కూడా వెయ్యకపోతే ఎలా అని కస్సుబుస్సులాడారట. నిబంధనలన్నీ చెప్పి ఆయన్ను ఒప్పించేందుకు ఆర్టీసీ అధికారులకు ప్రాణం పోయినంత పనైందట. అంతా విన్న తరువాత మరి వీరిని మైసూరుకు ప్రత్యేక బస్సు వేసి పంపిస్తున్నారా అని సీఎం ప్రశ్నించటంతో ఏమి చెప్పాలో అర్థం కాని అధికారులు... ఇప్పటికిప్పుడు మైసూరు బస్సు వేయటం కుదరదు, మాకు ఉన్న అధికారాల ఆధారంగా తిరుపతి వరకూ ప్రత్యేక బస్సు వేస్తాం, అక్కడి నుంచి వారిని బెంగళూరు వెళ్లి, అటు నుంచి మైసూరు వెళ్లమనండని చెప్పి ఆ బస్సులో ఎక్కి పంపించి ఊపిరి పీల్చుకున్నారట. -
డీటీసీ బస్సులపై అడ్వర్టయిజ్మెంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: రంగురంగుల అడ్వర్టయిజ్మెంట్లతో డీటీసీ బస్సులు నగర రోడ్లపై పరుగులు తీసే రోజులు త్వరలో రానున్నాయి. దివాళా తీసిన ఆర్థిక స్థితిని చక్కదిద్దుకోవడం కోసం డీటీసీ అడ్వర్టయిజ్మెంట్లను ఆశ్రయించనుంది. ఇందుకోసం డీటీసీ టెండర్లనుకూడా ఆహ్వానించింది. ఇప్పటి వరకు డీటీసీ బస్సుల లోపలి భాగంలో మాత్రమే వాణిజ్య ప్రకటనలు దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడని బస్సుల బయటి భాగంలో కూడా ప్రకటనలు కనిపించనున్నాయి. మొదటి దశలో 500 బస్సులపై అడ్వర్టయిజ్మెంట్లు ప్రదర్శించడానికి టెండర్ జారీచేసింది. వాటిలో ఏసీ, నాన్ ఏసీ బస్సులున్నాయి. బస్సుల లోపల వాణిజ్య ప్రకటనలు ఉంచడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపడం లేదు, అటువంటప్పుడు బస్సుల బయట అడ్వర్టయిజ్మెంట్లకు ఎలాంటి ప్రతిస్పందన లభిస్తుందనేది వేచి చూడాల్సిందే. అధికారులు మాత్రం ఈ ప్రయత్నం ద్వారా తమ ఖజానాకు కాసులు రాలుతాయని ఆశిస్తున్నారు. చార్జీలు పెంచడానికి తాము పలుమార్లు ప్రతిపాదనలు పంపినా వాటికి ఆమోదం లభించలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది నష్టాలు పేరుకొనిపోతున్నాయి. రోజుకు 50 లక్షల రూపాయల నష్టం వస్తోందని అంచనా. ఈ నేపథ్యంలో లోటును పూడ్చుకోవడం కోసం వాణిజ్య ప్రకటనల మార్గం సరైనదని అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. రోహిణి, జిటికె డిపో, ఈస్ట్ వినోద్‌నగర్, ఎస్ఎన్ డిపో, హరినగర్ డిపోలకు చెందిన 100 బస్సులపై అడ్వర్టయిజ్మెంట్లు ప్రదర్శించాలని ప్రస్తుతం నిర్ణయించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇతర బస్సుల బయటి భాగంపై అడ్వర్టయిజ్మెంట్లను ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు. జీపీఎస్ సదుపాయం కలిగిన క్లస్టర్ బస్సుల బయటి భాగంపై వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించడానికి ఇదివరకే అనుమతి ఇచ్చారు. -
దాడులు జరుగుతాయని బస్సులు నిలిపివేశాం
పరిస్థితిని సమీక్షించి సర్వీసులను పునరుద్ధరిస్తాం నాలుగు అండర్‌పాస్‌లు, 31 రహదారుల అభివృద్ధికి చర్యలు రాష్ట్ర రవాణశాఖ మంత్రి రామలింగారెడ్డి కృష్ణరాజపురం : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అక్రమ ఆస్తుల కేసులో శిక్ష ఖరారైన నేపథ్యంలో అన్నా డీఎంకే కార్యకర్తలు అభిమానులు ఆవేశంతో బస్సులపై దాడులు చేయవచ్చని భావించి ముందుజాగ్రత్త చర్యగాతమిళనాడుకు కేఎస్ఆర్టీసీ బస్సు సర్వీస్‌లను నిలిపి వేసినట్లు రాష్ట్ర రవాణశాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మహాదేవుపుర, కృష్ణరాజపురం నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఆయన బీబీఎంపీ మేయర్ శాంతకుమారితో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం నాటి పరిస్థితిని బట్టి సర్వీసులను పునరుద్ధరిస్తామన్నారు. 18 నెలలో బీబీఎంపీ పరిధిలో సుమారు 17 కిలో మీటర్ల మేర 4 అండర్ పాసులతో పాటు 31 రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. మహాదేవుపురంలో ఐటీ,బీటి సంస్థలూ ఎక్కువగా ఉండటంతో జన సంచారం అధికమై ట్రాపిక్ సమస్య తలెత్తుతోందన్నారు. వర్తూరు హోడి వరకు సిగ్నల్ ప్రీ రోడ్డును నిర్మిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 2 వందల ఐటీ సంస్థలతో చర్చలు జరిపి వారి సహకారంతో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణరాజపురం ప్రభుత్వ డిగ్రి కళాశాలకు సమావేశం భవన నిర్మాణానికి రూ.3కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధుల కోసం బీబీఎంపీ మేయర్ సహాకారం కోరుతామని మంత్రి తెలిపారు. టిన్ ప్యాక్టరీ సమీపంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే బైరతి బసవరాజుతో చర్చిస్తామన్నారు. మేయర్ శాంతకుమారి మాట్లాడుతూ హొరమావు రైల్వేక్రాసింగ్ వద్ద అండర్ పాస్ నిర్మానం కొసం రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అనుమతి లభిస్తే బీబీఎంపీ, రైల్వే భాగస్వామ్యంతో అండర్‌పాస్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బసవరాజు, బీబీఎంపీ కమిషనర్ లక్ష్మినారాయణ, మహేదేవుపుర బీబీఎంపీ జేసి దేవరాజు, బీబీఎంపీ కార్పొరేటర్లు పూర్ణిమా శ్రీనివాస్, ఉదయ్‌కుమార్, అంజీనేయరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నారాయణస్వామి, బీబీఎంపీ అధికారులు పాల్గొన్నారు. -
‘టోల్’ రద్దయితే ‘బెస్ట్’..
- ఆర్థిక సమస్యలనుంచి బయటపడే అవకాశం ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో టోల్ వసూలు రద్దయితే నగరంలో బస్సు సేవలందించే బృహన్ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్టు) సంస్థకు కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ప్రతి ఏడాది టోల్ రూపంలో ‘బెస్ట్’ కోట్లాది రూపాయలు చెల్లిస్తోంది. ప్రభుత్వం టోల్ వసూలును నిలిపివేస్తే ప్రస్తుత ఆర్థిక సమస్యలనుంచి బయటపడవచ్చని సంస్థ భావిస్తోంది. 2013 ఏప్రిల్ నుంచి 2014 జనవరి వరకు బెస్టు రూ.41.6 కోట్ల టోల్ చెల్లించింది. టోల్ రద్దు చేసే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని రవాణా విభాగం అధికారులు తెలిపారు. ముంబైలోని ప్రయాణికులతో పాటు ఠాణే, వాషి, మీరా-భయీందర్ పట్టణాలకు చెందిన ప్రజలు కూడా బెస్టు సేవలు పొందుతున్నారు. ముంబై దాటి వేరే ప్రాంతానికి వెళ్లాలంటే బెస్ట్ బస్సులు టోల్ నాకాలను దాటాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి బస్సుకు టోల్ తప్పనిసరిగా కట్టాలి. దీని వల్ల బెస్టుకు వస్తున్న ఆదాయం నుంచి కోట్ల రూపాయలు తగ్గుతోంది. ఆర్థిక సమస్యల్లో ఉన్న బెస్టుకు ముంబై కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ నిధులు అందితే నష్టాల నుంచి బయటపడేందుకు వీలుంటుంది. కాగా కార్పొరేషన్ రూ.100 కోట్ల నిధులు అందజేసింది. కానీ బెస్ట్ ఎదుర్కొంటున్న సమస్యకు ఈ నిధులు సరిపోవని అధికారులు తెలిపారు. ఒకవేళ టోల్ వసూలు రద్దు చేసినట్లయితే ఎంతో సహాయమవుతుందని భావిస్తున్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు టోల్ రద్దు చేసినట్లు బెస్టుకు కూడా ఆ సౌకర్యం కల్పించగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
బస్సు రూట్లలో మార్పులు
కొన్నింటి విస్తరణ డీటీసీ ప్రకటన న్యూఢిల్లీ: మరిన్ని ప్రాంతాలకు బస్సు సేవలను విస్తరించి, ప్రయాణికులకు సౌకర్యభరిత ప్రయాణం అందించాలనే లక్ష్యంతో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తన బస్సు రూట్లలో మార్పులు చేసింది. ఇందుకోసం కొన్ని మార్గాల్లో బస్సుల సేవలను పొడగించింది. ప్రస్తుతం రూటు నంబర్ 102 ఎస్టీఎల్లో ఇందర్ ఎన్క్లేవ్ నుంచి మధుభన్ చౌక్ వరకు నడుస్తున్న బస్సులు ఇక నుంచి రోహిణి సెక్టార్ 21 లఖీరామ్ పార్కు-మధుబన్ చౌక్ మార్గంలో సేవలు అందిస్తాయి. ఈ మార్గం లో బస్సులు మధుబన్ చౌక్, రోహిణి సెక్టార్ 7/8 క్రాసింగ్, రోహిణి డిపో, నల్లా గ్యాస్‌ప్లాంట్, రోహిణి సెక్టార్ 24/25 క్రాసింగ్, రోహిణి సెక్టార్-23, 100 ఫూటా రోడ్డు డీడీఏ పార్కు, రోహిణి సెక్టార్ - 22 లఖీరామ్ పార్కు, ఇందర్ ఎన్క్లేవ్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని డీటీసీ అధికార ప్రతినిధి ఆర్ ఎస్ మిన్హాస్ గురువారం ప్రకటించారు. ఇక 854 నంబరు రూట్లో ప్రయాణించే బస్సులు ప్రస్తుతం సరాయికలే ఖాన్ అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ (ఐఎస్బీటీ), ఉత్తమ్‌నగర్ టెర్మినల్ వరకు నడుస్తున్నాయి. ఇవి ఇక మీదట జనక్‌పురి సీ-2బీ, తిలక్‌నగర్ నుంచి జిల్లా పార్కు మీదుగా జనక్‌పురి బి-1కు చేరుకుంటాయి. రాత్రిపూట నంబరు 0901 మార్గంలో తిరిగే బస్సురూటు కూడా మారింది. ప్రస్తుతం ఇవి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ గేటు 2 నుంచి మంగోల్‌పురి వరకు వెళ్తుం డగా, ఇక నుంచి రోహిణి సెక్టార్-22 టెర్మినల్ వరకు వెళ్తాయి. ఢిల్లీగేటు, ఎర్రకోట, కాశ్మీరీగేట్ ఐఎస్బీటీ, పాత సచివాలయం, జీటీబీ నగర్, అశోక్ విహార్ క్రాసింగ్, రోహిణి సెక్టార్ 20/21 ప్యాకెట్-9 మీదుగా రోహిణి సెక్టార్ 22 టెర్మినల్ వరకు వెళ్తాయి. -
బ్యానర్ల దెబ్బకు బస్సు రద్దు!
=మావోయిస్టుల బ్యానర్లతో పోలీసుల మండిపాటు =మద్దిగరువు బస్సు సర్వీసు నిలిపివేత =నాలుగు నెలలుగా గిరిజనుల నరకయాతన =200 గ్రామాల గిరిజనులకు అష్టకష్టాలు పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని పెదబయలు, జి.మాడుగుల, ఒడిశా సరిహ ద్దు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు ఆ ఎర్రబస్సొక్కటే దిక్కు.. ఇప్పు డు అదీ రద్దయి అగచాట్లు పడుతున్న గిరి జనులకు ఆ దేవుడే దిక్కు! మద్దిగరువు బస్సు సర్వీసు లేక గిరిజనులు పడుతున్న అవస్థలు చూస్తే ఈ అభిప్రాయమే కలుగుతుంది. జి.మాడుగుల నుంచి మద్దిగరువు వరకు పక్కా రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ పోలీస్, ఆర్టీసీ అధికారుల మధ్య వివాదంతో బస్సు సర్వీసు నాలుగు నెలల కిందట నిలిచిపోయింది. సూరిమెట్ట ప్రాంతంలో మిలీషియా సభ్యులు ఆర్టీసీ బస్సుకు మావోయిస్టు బ్యానర్లు కట్టడంతో బస్సు డ్రైవర్, కండక్టర్లు ప్రాణభయంతో బొయితిలి నుంచి జి.మాడుగుల వరకు ఈ బస్సును తీసుకువచ్చారు. అయితే మావోయిస్టుల బ్యానర్లు తొలగించకుండా జి.మాడుగుల వరకు ఆర్టీసీ బస్సును తీసుకురావడాన్ని పోలీసులు అప్పట్లో తప్పుబట్టి ఆర్టీసీ సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాంతో ఆర్టీసీ అధికారులు అప్పటి నుంచి మద్దిగరువు ప్రాంతానికి బస్సు సర్వీసును నిలిపేశారు. ఐదారేళ్లుగా బస్సు సౌకర్యం ఉన్న మారుమూల సుమారు 200 గ్రామాల గిరిజనులంతా ఆర్టీసీ అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు రెండుసార్లు పాడేరు నుంచి జి.మాడుగుల మీదుగా మద్దిగరువుకు ప్రయాణించే ఆర్టీసీ బస్సు సర్వీసు నిలిచిపోవడంతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో గిరిజనులు ప్రయివేటు జీపులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా జీపుల యజమానులు గిరిజనులను దోచుకుంటున్నారు. బస్సు సర్వీసును పునరుద్ధరించేందుకు పోలీస్, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజనులు వేడుకుంటున్నారు.