శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): మిషన్‌కాకతీయ రెండోదశ పనులను డిసెంబర్ నెల నుంచే ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది మిషన్ కాకతీయ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. దీంతో ఈ సారి మిషన్ కాకతీయ రెండో దశ పనులను డిసెంబర్ నెలలోనే ప్రారంభిస్తామని మంత్రి అన్నారు.
అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో నూతనంగా రోడ్ల నిర్మాణానికి రోడ్లు-భవణాలు, పంచాయతీరోడ్లు శాఖ ఆధ్వర్యంలో రూ. 250 కోట్ల మంజూరయ్యాయన్నారు. మండలంలోని మల్కారం గ్రామానికి నూతనంగా బస్సు సర్వీస్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు.
డిసెంబర్ నుంచే మిషన్ కాకతీయ రెండోదశ పనులు
Published Tue, Aug 11 2015 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM
Advertisement