patnam mahinder reddy
-
అన్నల ఓటమి.. తమ్ముళ్ల గెలుపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పక్కాగా గెలుస్తామనుకున్న నాయకులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ క్రమంలో పలువురు సీనియర్ నాయకులు కనివిని ఎరుగని రీతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరు గాంచిన నల్లగొండలో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీనియర్ నాయకులు జానా రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ పద్మావతిరెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే కోమటి రెడ్డి సోదరుల్లో వెంకట్ రెడ్డి ఓటమి పాలవ్వగా.. ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం విజయం సాధించారు. మల్లు బ్రదర్స్, పట్నం బ్రదర్స్‌ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్... కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వెంకట్ రెడ్డి తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మ్రాతం విజయం సాధించారు. మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోపాల్ రెడ్డి.. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద విజయం సాధించారు. పట్నం బ్రదర్స్... ఎన్నికల ప్రారంభం నుంచే కోడంగల్ నియోజక వర్గం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్ర రెడ్డి మధ్య హోరాహోరి పోరు నడిచింది. చివరకూ రేవంత్ రెడ్డిపై.. పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. కానీ నరేందర్ రెడ్డి అన్న పట్నం మహేందర్ రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. కేసీఆర్ మంత్రి వర్గంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పట్నం మహేందర్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేశారు. ఇప్పటికే నాలుగు సార్లు గెలుపొందిన మహేందర్ రెడ్డి ఇసారి ఓటమి పాలయ్యారు. కూటమి అభ్యర్థి పంజుగుల పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు విజేతగా నిలిచారు. మల్లు బ్రదర్స్... కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఉమ్మడి ఏపీలో డిప్యూడీ స్పీకర్‌గా వ్యవహరించిన మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి మూడోసారి విజయం సాధించారు. తన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి లింగాల కమల రాజ్ మీద విజయం సాధించారు. అయితే మల్లు అన్న రవి మ్రాతం ఓడిపోయారు. జడ్చర్ల నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు రవి తన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. -
'మాజీ మంత్రిపై విమర్శలు మానుకోవాలి'
శంషాబాద్ రూరల్: పదవులను కాపాడుకోవడానికి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి జిల్లా అభివృద్ధికి అడ్డుపడుతూ వ్యక్తిగత దూషణలు చేయడం తగదని ఎంపీపీ చెక్కల ఎల్లయ్య అన్నారు. మండలంలోని పెద్దషాపూర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న మహేందర్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అవినీతి కేసుల విషయంలో అధికారంలో ఉన్నట్టు మీ దగ్గర ఆధారాలుంటే కేసులో సమర్పించాలని ఎద్దేవా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పును గట్టిగా వ్యతిరేకిస్తున్న సబితారెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడం నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో సాగునీటి శాఖ ఆధ్వర్యంలో రూ.కోట్లు ఖర్చు చేసి చెరువుల, కుంటలకు మరమ్మతులు చేపట్టామని, టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయతో ఏదో చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదన్నారు. భూదందాలకు ఎవరు పేరుగాంచారో మంత్రిగారి సొంత మండలానికి వెళ్తే జనాలు చెబుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇస్రానాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోపాల్‌నాయక్, సొసైటీ డైరక్టర్ నర్సింహ, వార్డు సభ్యులు శ్రీధర్, నారాయణ, నాయకులు గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ నుంచే మిషన్ కాకతీయ రెండోదశ పనులు
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): మిషన్‌కాకతీయ రెండోదశ పనులను డిసెంబర్ నెల నుంచే ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది మిషన్ కాకతీయ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. దీంతో ఈ సారి మిషన్ కాకతీయ రెండో దశ పనులను డిసెంబర్ నెలలోనే ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో నూతనంగా రోడ్ల నిర్మాణానికి రోడ్లు-భవణాలు, పంచాయతీరోడ్లు శాఖ ఆధ్వర్యంలో రూ. 250 కోట్ల మంజూరయ్యాయన్నారు. మండలంలోని మల్కారం గ్రామానికి నూతనంగా బస్సు సర్వీస్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. -
ఆర్టీసీకి రోజుకు రూ.కోటి నష్టం
హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్ల రోజుకు రూ. కోటి నష్టం వస్తోందని రాష్ట్ర రోడ్డు, రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ రూ.400 కోట్ల నష్టంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా కార్మిక సంఘాలు ఒప్పుకోవటం లేదని మంత్రి మహేందర్ రెడ్డి మండిపడ్డారు. -
ఊరూరికీ 'పల్లె వెలుగు'
డిచ్పల్లి: తెలంగాణలోని గ్రామగ్రామానికీ పల్లె వెలుగు బస్సు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామ ని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలి పారు. శుక్రవారం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి టీఎస్ఎస్పీ ఏడో బె టాలియన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లో ఆర్టీసీ బస్సులు వెళ్లని 1,300 గ్రామాలను గుర్తించామన్నారు. అన్ని గ్రామాలకు బస్సులు వెళ్లడానికి అవసమైన రోడ్లు వేయించేలా కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవలే రవాణా శాఖకు రూ. 150 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి మహేందర్‌రెడ్డి బెటాలియన్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు వారికి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అమృతరావు స్వాగతం పలికారు.