డిచ్‌పల్లి: తెలంగాణలోని గ్రామగ్రామానికీ పల్లె వెలుగు బస్సు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామ ని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలి పారు. శుక్రవారం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డిచ్‌పల్లి టీఎస్‌ఎస్‌పీ ఏడో బె టాలియన్‌లో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రం లో ఆర్టీసీ బస్సులు వెళ్లని 1,300 గ్రామాలను గుర్తించామన్నారు. అన్ని గ్రామాలకు బస్సులు వెళ్లడానికి అవసమైన రోడ్లు వేయించేలా కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవలే రవాణా శాఖకు రూ. 150 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి మహేందర్‌రెడ్డి బెటాలియన్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు వారికి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అమృతరావు స్వాగతం పలికారు.
ఊరూరికీ 'పల్లె వెలుగు'
Published Sat, Feb 7 2015 2:48 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement