రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై అతలాకుతలమైంది. తొలకరి వర్షానికే వరంగల్ మహా నగరం వణికిపోయింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యధిక కిలోమీటర్లు తిరిగిన పల్లెవెలుగు బస్సులను లాజిస్టిక్ వ్యాన్‌లుగా మార్చుతోంది. ఏటా లక్షల టన్నుల బొగ్గును వెలికితీస్తున్న సింగరేణి సంస్థ పర్యావరణాన్ని సమతూకం చేసేందుకు దీక్షతో మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా సాగిస్తోంది.
1/10
తొలకరి వర్షానికే వరంగల్ మహా నగరం చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో నగరాన్ని వరద ముంచెత్తింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని శివారు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రహదారులపైకి కూడా నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు నీరు ఎత్తిపోశారు. హన్మకొండలోని బస్‌స్టేషన్, గ్యారేజీలోకి కూడా నీరు చేరింది.
2/10
భారీ వర్షాలతో ముంబై వణికించింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ముంబైకర్లు కష్టాలు పడుతున్నారు. వర్షపు నీటిలో మునిగిపోయిన రోడ్డులో పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న దృశ్యం.
3/10
నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యధిక కిలోమీటర్లు తిరిగిన పల్లెవెలుగు బస్సులను లాజిస్టిక్ వ్యాన్‌లుగా మార్చుతోంది. విజయవాడలో ఇప్పటికే 30 పల్లెవెలుగు లాజిస్టిక్ వ్యాన్‌లు సిద్ధం చేశారు. వీటి ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సరకు రవాణా చేయనున్నారు. ఒక్కో జిల్లాకూ రెండేసి వ్యాన్‌ల చొప్పున కేటాయిస్తూ డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అదనంగా మరికొన్ని వ్యాన్‌లు కేటాయించనున్నారు. కరోనా కారణంగా ఎదురైన నష్టాల నుంచి కొంతవరకూ గట్టెక్కేందుకు కార్గో సర్వీసుల ద్వారా ఆదాయం పొందాలని అధికారులు భావిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
4/10
సింగరేణి సంస్థ ఏటా కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించింది. మంచిర్యాల జిల్లా కాసిపేట ఓసీపీ వద్ద ఓవర్ బర్డెన్ (ఓబీ) డంప్ ఏరియాపై పరుచుకున్న పచ్చదనం
5/10
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం బుధవారం రాత్రి పసిడి వర్ణం విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోయింది. బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సిబ్బంది ఇటీవల బిగించిన ఈ విద్యుత్ దీపాలను మరోసారి ట్రయల్ రన్ చేశారు. ఉత్తరం, తూర్పు అష్టభుజి ప్రాకార మండపాలలు, గోపురాలు, సాలహారాల్లోని విగ్రహాలకు బిగించిన విద్యుత్ దీపాలను రాత్రి సమయంలో ఆన్ చేశారు. దీంతో ఆలయం పసిడి వర్ణంలో మెరిసిపోయింది. యాదగిరిగుట్ట పట్టణంలోనుంచి యాదాద్రికొండ అద్భుతంగా కనిపించింది. – యాదగిరిగుట్ట
6/10
కోవిడ్ సహాయక కార్యక్రమంలో భాగంగా చెన్నైలో పూజారులకు రూ.4000 చొప్పున నగదు సాయం చేస్తున్న డీఎంకే పార్టీ యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి
7/10
మహారాష్ట్రలో భారీ వర్షాల ధాటికి పట్టాలపైకి నీరు చేరడంతో కుర్లాలో రైలు నిలిచిపోవడంతో నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులు
8/10
కష్టంలో ఒకొరికొకరు తోడుంటే చాలు ఎంత కష్టమైన ఇట్లే తీరుపోతుంది. ఇలాంటి దృశ్యం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ వద్ద కనిపించింది. నర్సయ్య అనే వ్యక్తి ధాన్యం కొనుగోలు వద్ద అమ్మకానికి తీసుకువచ్చాడు. ఆ ధాన్యంలో వేరే రకం వడ్లు(మగ)ఉన్నాయని అవి కొనుగోలు చేయకపోవడంతో తిరిగి ఆటోలో ఇంటికి తీసుకువచ్చేందుకు బయలుదేరాడు. కొద్దిదూరంలో ఆటో ఆగిపోయింది. దీంతో అక్కడే ఉన్న అతడి భార్య, పిల్లలు ఆటోను వెనుకనుండి నెటుతూ ఇంటికి చేర్చారు. - కె.సతీష్, స్టాఫ్‌పొటోగ్రాఫర్, సిద్దిపేట
9/10
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోతున్న గ్రామీణ యువత తమకు వచ్చిన పనిని కొత్తమార్గంలో చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లక్ష్మీపురానికి చెందిన షేక్ సజ్జర్ వాహనాల టైర్లకు పంక్చర్లు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో తన వద్దకు పంక్చర్లు వేయించుకునేందుకు వచ్చే వారి సంఖ్య తగ్గడంతో ఆదాయం రావడం లేదు. దీంతో ఓ ఆటోలో ఎయిర్ కంప్రెసర్, పంక్చర్‌కు కావాల్సిన వస్తువులను పెట్టుకొని మోబైల్ సర్వీసు అందస్తున్నాడు. – సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్, ఖమ్మం
10/10
లాటిన్ అమెరికాలోనే తొలి భారీ థర్మోసోలార్ విద్యుత్ కేంద్రమిది. చిలీ దేశంలోని అటకామా ఎడారిలోని ఆంటోఫగస్టా ప్రాంతంలో దీనిని ఇటీవలే ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment