దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు | APSRTC To Run 1850 Special Buses For Dasara | Sakshi
Sakshi News home page

దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు

Published Fri, Oct 16 2020 7:48 AM | Last Updated on Fri, Oct 16 2020 8:04 AM

APSRTC To Run 1850 Special Buses For Dasara - Sakshi

సాక్షి, అమరావతి: దసరా పండగను పురస్కరించుకుని ఏపీఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్‌ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపనుంది. సాధారణంగా ఏటా దసరా పండుగకు 2,500కు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపేది. తెలంగాణతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్య తగ్గిపోయింది.

ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ 1.61 లక్షల కిలోమీటర్లకు పరిమితమై 322 బస్సుల్ని తగ్గించుకునేందుకు సిద్ధపడినా టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం కొత్త మెలికలు పెడుతోంది. ఏపీఎస్‌ఆరీ్టసీ నడిపే బస్సుల టైం కూడా తామే నిర్దేశిస్తామని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా పండుగ నేపథ్యంలో బెంగళూరుకు 562 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పనున్నారు. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ఇంకా అనుమతించకపోవడంతో ఏపీఎస్‌ఆరీ్టసీ ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే బస్సులను నడపనుంది. 

ప్రైవేటు ఆపరేటర్ల జోరు.. 
తెలంగాణ వైఖరితో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరని పరిస్థితుల్లో ప్రైవేటు ఆపరేటర్లు జోరు పెంచారు. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్ని తిప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 750 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. మరోవైపు దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆరీ్టసీకి అధిక ఆదరణ ఉన్న విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–హైదరాబాద్, విశాఖ–హైదరాబాద్‌ రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు ప్రారంభించారు. టికెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిపై రవాణా శాఖ కమిషనర్‌ స్పందిస్తూ.. ప్రైవేటు ట్రావెల్స్‌ వారు అధిక రేట్లు వసూలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఆర్టీసీ జిల్లాలవారీగా నడిపే ప్రత్యేక బస్సులివీ.. 
శ్రీకాకుళం, విజయనగరం–66, విశాఖపట్నం–128, తూర్పుగోదావరి–342, పశి్చమగోదావరి–40, 
కృష్ణా–176, గుంటూరు–50, ప్రకాశం–68, 
నెల్లూరు–156, చిత్తూరు–252, కర్నూలు–254, కడప–90, అనంతపురం–228   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement