
బస్సు రూట్లలో మార్పులు
కొన్నింటి విస్తరణ డీటీసీ ప్రకటన
న్యూఢిల్లీ: మరిన్ని ప్రాంతాలకు బస్సు సేవలను విస్తరించి, ప్రయాణికులకు సౌకర్యభరిత ప్రయాణం అందించాలనే లక్ష్యంతో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తన బస్సు రూట్లలో మార్పులు చేసింది. ఇందుకోసం కొన్ని మార్గాల్లో బస్సుల సేవలను పొడగించింది. ప్రస్తుతం రూటు నంబర్ 102 ఎస్టీఎల్‌లో ఇందర్ ఎన్‌క్లేవ్ నుంచి మధుభన్ చౌక్ వరకు నడుస్తున్న బస్సులు ఇక నుంచి రోహిణి సెక్టార్ 21 లఖీరామ్ పార్కు-మధుబన్ చౌక్ మార్గంలో సేవలు అందిస్తాయి.
ఈ మార్గం లో బస్సులు మధుబన్ చౌక్, రోహిణి సెక్టార్ 7/8 క్రాసింగ్, రోహిణి డిపో, నల్లా గ్యాస్‌ప్లాంట్, రోహిణి సెక్టార్ 24/25 క్రాసింగ్, రోహిణి సెక్టార్-23, 100 ఫూటా రోడ్డు డీడీఏ పార్కు, రోహిణి సెక్టార్ - 22 లఖీరామ్ పార్కు, ఇందర్ ఎన్‌క్లేవ్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని డీటీసీ అధికార ప్రతినిధి ఆర్ ఎస్ మిన్హాస్ గురువారం ప్రకటించారు.
ఇక 854 నంబరు రూట్లో ప్రయాణించే బస్సులు ప్రస్తుతం సరాయికలే ఖాన్ అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ (ఐఎస్‌బీటీ), ఉత్తమ్‌నగర్ టెర్మినల్ వరకు నడుస్తున్నాయి. ఇవి ఇక మీదట జనక్‌పురి సీ-2బీ, తిలక్‌నగర్ నుంచి జిల్లా పార్కు మీదుగా జనక్‌పురి బి-1కు చేరుకుంటాయి. రాత్రిపూట నంబరు 0901 మార్గంలో తిరిగే బస్సురూటు కూడా మారింది.
ప్రస్తుతం ఇవి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ గేటు 2 నుంచి మంగోల్పురి వరకు వెళ్తుం డగా, ఇక నుంచి రోహిణి సెక్టార్-22 టెర్మినల్ వరకు వెళ్తాయి. ఢిల్లీగేటు, ఎర్రకోట, కాశ్మీరీగేట్ ఐఎస్‌బీటీ, పాత సచివాలయం, జీటీబీ నగర్, అశోక్ విహార్ క్రాసింగ్, రోహిణి సెక్టార్ 20/21 ప్యాకెట్-9 మీదుగా రోహిణి సెక్టార్ 22 టెర్మినల్ వరకు వెళ్తాయి.