
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరులో బకింగ్‌హాం కాలువపై వంతెన పనులు పూర్తికావడంతో ప్యారిస్, మనలి మధ్య నడిచే నెంబర్ 56 బస్సు రూట్ మార్పు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోమవారం మహిళలు ఆందోళన చేపట్టారు. చైన్నె, తిరువొత్తియూరు బకింగ్ హామ్ కాలువను అనుకుని ఉన్న రోడ్డులో ఐదేళ్లుగా ప్రభుత్వ బస్సు 56ఈ నడుస్తోంది. రాజాజీ నగర్, కార్గిల్ నగర్, వెట్రి వినాయక నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ బస్సును ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో బకింగ్ హామ్ కాలువపై చేపట్టిన వంతెన పనులు పూర్తయి దానిని ప్రారంభించారు.
దీంతో బకింగ్ హామ్ కాలువ మార్గంగా వెళుతున్న బస్సులను పాత మార్గంలోని వంతెనపై నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కార్గిల్ నగర్ మార్గంలోనే బస్సును నడపాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 50 మందికి పైగా మహిళలు కొత్త వంతెన వద్ద రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తిరువొత్తియూరు పోలీసులు అక్కడికి చేరుకొని వారితో చర్చించారు. ఉన్నతాధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment