
బీజింగ్: ఈ నెల 3వ తేదీ నుంచి చైనా, పాక్‌ల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సు కాస్గర్– పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం లాహోర్ మధ్య ఈ బస్సు నడపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా ఈ బస్సును నడపాలన్న నిర్ణయంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పీవోకే కూడా తమదే అని పేర్కొంటున్న భారత్.. ఆ భూభాగం గుండా బస్సు సర్వీసు నడపడం తమ ప్రాదేశిక సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగకరమని తెలిపింది. సీపెక్ ప్రాజెక్టు చైనా–పాక్ దేశాల ఆర్థిక సహకారానికి సంబంధించింది మాత్రమేననీ, మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రాజెక్టు కాదని చైనా తెలిపింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొట్టమొదటి చైనా పర్యటన ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా బస్సు సర్వీసు నిర్ణయం వెలువడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment